సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
== సహ చట్టం కింద అదనపు వసూళ్లు తగవు ==
సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.<ref>ఈనాడు వార్త 9.11.2009 </ref> ఢిల్లీ పోలీసులతో సహా పలు ప్రభుత్వ ఏజన్సీలు అదనపు ఫీజు పేరుతో లక్షల రూపాయల్ని డిమాండు చేస్తున్నాయి.సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.(ఈనాడు9.11.2009)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు