గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
===పుస్తకం లోని కొన్ని పద్యాలు===
ఉర్దూ భాషలో 'గజల్' సుప్రసిద్ధమైనది.ఉర్దూ కవులలొ అనేకులు ఈ పద్ధతినే అనుసరించారు.గాలిబ్ గజల్ రీతిలోనే కాకుండగా ఇతర పద్ధతులలో కూడా కవిత్వం రాసినప్పటికి,గజల్స్ లో కబ్బం అల్లుటలో ప్రసిద్ధి చెందాడు.ఇతరులకు మార్గదర్సకుడుగా నిల్చినాడు.గాలిబ్ మానవ జీవితమును సమగ్రముగా తన కావ్య దర్పణంన ప్రతిఫలింపజేసాడు.జీవితంను దాని భిన్న కోణములను రమ్యంగా,హృద్యంగా రచించిన మొదటి ఉర్దూ కవిగా గాలిబ్ కవి అన వచ్చును. జీవితం,అందులోని విలాసం,విషాదం,తీపిదనం,చేదు మరియు ఒడుదుడుకులను తన కవిత్వంలో ప్రదర్సించాడు గాలిబ్.అట్టి గాలిబ్ ఉర్దూ గజల్స్ ను దాశరథి మిక్కిలి ప్రతిభావంతంగా తెలుగు భాషలోకి అనువదించాడు.అనువాదం చాలా సుభోదకంగా,సరళంగా వున్నది.గాలిబ్ కవనంలోని హైందవేతర వాతవరణంను హైందవ వాతవరణంగా పరివర్తించి,కవితకు తెలుగుదనం అబ్బి,తన ప్రత్యేకత ప్రతిభను చూపించాడు దాశరథి.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు