ప్రదీప్ మాచిరాజు
ప్రదీప్ మాచిరాజు ఒక టీవీ వ్యాఖ్యాత. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. జీ తెలుగు లో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం లభించింది.[2]
ప్రదీప్ మాచిరాజు | |
---|---|
జననం | ఆధారం చూపాలి] అమలాపురం,తూర్పు గోదావరి జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్ | 1985 అక్టోబరు 23 [
విద్య | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ |
విద్యాసంస్థ | విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదు |
వృత్తి | టివి వ్యాఖ్యాత |
తల్లిదండ్రులు |
|
వృత్తి
మార్చుఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్ళి ఎం. బి. ఎ చదవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రుల అనుమతితో కొంత సమయం తీసుకుని మరేదైనా వృత్తిలో ప్రవేశించాలనుకున్నాడు. కొద్ది రోజులు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేశాడు. తర్వాత రేడియో జాకీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అక్కడ అతని గాత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది.
సినిమాలు
మార్చువివాదం
మార్చుడిసెంబరు 31, 2017 న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల ప్రదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.[4] కారు స్వాధీనం చేసుకుని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.[5]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (2 May 2021). "యాంకర్ ప్రదీప్ తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
- ↑ "Here's what Pradeep has to say about his life, success and the latest season of KTUC". timesofindia.indiatimes.com. Retrieved 19 January 2018.
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020.
- ↑ Jonnalagadda, Pranita. "Pradeep Machiraju apologises". deccanchronicle.com. Deccan Chronicle. Retrieved 19 January 2018.
- ↑ "కోర్టుకు హాజరైన యాంకర్ ప్రదీప్". హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 19 జనవరి 2018. Retrieved 19 జనవరి 2018.