భమ్ బోలేనాథ్

2015లో కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.

భమ్ బోలేనాథ్ 2015, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, నవీన్ చంద్ర, పూజ ఝవేరి నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

భమ్ బోలేనాథ్
Bham Bolenath Movie Poster.jpg
భమ్ బోలేనాథ్ సినిమా పోస్టర్
దర్శకత్వంకార్తీక్ వర్మ
నిర్మాతసిరివూరి రాజేష్ వర్మ, శ్రీకాంత్‌ దంతలూరి (సమర్పణ)
కథకార్తీక్ వర్మ దండు
నటులునవదీప్
పూజ ఝవేరి
ప్రదీప్ మాచిరాజు
నవీన్ చంద్ర
సంగీతంసాయి కార్తీక్
ఛాయాగ్రహణంభరణి కె. ధరణ్
కూర్పుప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ
ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్
విడుదల
27 ఫిబ్రవరి 2015 (2015-02-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

నిరుద్యోగి అయిన వివేక్‌ (నవదీప్‌) ఉద్యోగం సంపాదించి ప్రేమించిన శ్రీలక్ష్మి (పూజ)ని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. దుబాయ్‌ వెళ్లి డాన్‌గా సెటిల్‌ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేసి, ఆ సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్ (పోసాని)కి ఇస్తుంటాడు. వసూలు రాజా అనే దొంగవ్యాపారి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకొని వస్తున్న వివేక్ దగ్గరనుండి ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. నిత్యం మత్తులో మునిగి తేలే ఇద్దరు (ప్రదీప్‌, కిరీటి) ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికని భారీగా డ్రగ్స్‌ క్యారీ చేస్తూ కారెక్కుతారు. ఈ మూడు కథలకు పాయింట్‌ ఓ కారు. ఆ కారులో కోట్ల డబ్బు, డ్రగ్స్‌, రింగ్‌ వుంటాయి. పోయాయనుకున్న వాటిని వీరు ఎలా దక్కించుకున్నారనేది మిగతా కథ.[2]

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ, కథనం, దర్శకత్వం: కార్తీక్ వర్మ
  • నిర్మాత: సిరివూరి రాజేష్ వర్మ
  • సహ నిర్మాతలు: కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ
  • సమర్పణ: శ్రీకాంత్‌ దంతలూరి
  • మాటలు: శరణ్‌ కొప్పిశెట్టి, కార్తిక్‌ వర్మ దండు
  • సంగీతం: సాయి కార్తీక్
  • కూర్పు: ప్రవీణ్‌ పూడి
  • ఛాయాగ్రహణం: భరణి కె. ధరణ్
  • డ్యాన్స్‌: విజయ్‌
  • ఆర్ట్‌: జె.కె.మూర్తి
  • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రఘు పెన్మత్స
  • నిర్మాణ సంస్థ: ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్

పాటలుసవరించు

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. తన్మయి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

Untitled
పాటల జాబితా
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "భమ్ బోలేనాథ్ (రచన: బి. సుబ్బరాయశర్మ)"  సిద్ధార్ధ్ వాట్కిన్స్ 3:05
2. "మనసే (రచన: బాలాజీ)"  హరిచరణ్, సైంధవి 4:05
3. "ఉన్నోడైనా (రచన: బి. సుబ్బరాయశర్మ)"  రంజిత్ 3:32
4. "వన్స్ అపాన్ ఏ టైమ్ (రచన: కృష్ణ చైతన్య)"  ఎన్. సి. కారుణ్య, సుచిత్ర 2:24
5. "సేటుగర్ (రచన: బాలాజీ)"  ఎన్. సి. కారుణ్య, సుచిత్ర 2:08
15:14

ఇతర వివరాలుసవరించు

  1. ఈ చిత్రానికి సంబంధించిన జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియోను రానా నేడు ట్విట్టర్‌లో విడుదల చేశాడు.[5]

మూలాలుసవరించు

  1. newstel. "Bham Bholenath and Ram Leela First day Box office Collection". Telugu Cinema News India. Retrieved 24 February 2020.
  2. తెలుగు వెబ్ దునియా, రివ్యూ. "'భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్". telugu.webdunia.com. Retrieved 24 February 2020.
  3. ప్రజాశక్తి, మూవీ (8 November 2016). "పౌరాణికం ఇష్టం పూజా జవేరి". మూలం నుండి 5 April 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 24 February 2020. Cite news requires |newspaper= (help)
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (2 November 2015). "పొరపాట్ల వల్లే ఫ్లాపులొచ్చాయన్న నవీన్ చంద్ర". మూలం నుండి 24 February 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 February 2020. Cite news requires |newspaper= (help)
  5. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.

ఇతర లంకెలుసవరించు