F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్

2019 తెలుగు సినిమా

F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ 2019 జనవరి 12 న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన తెలుగు సినిమా. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో[1] వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, గద్దె రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రధారులు.[2][3][4]

F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్
F2 Fun and Frustration.jpg
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాతదిల్ రాజు
నటవర్గంవెంకటేష్
వరుణ్ తేజ్
తమన్నా భాటియా
మెహ్రీన్ పిర్జాదా
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుబిక్కిన తమ్మిరాజు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
విడుదల తేదీలు
2019 జనవరి 12 (2019-01-12)
దేశంభారతదేశం
భాషతెలుగు భాష

కథసవరించు

వెంకీ ఎమ్మెల్యే అంజిరెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తుంటాడు. ఒక వివాహ సంబంధాల వేదిక ద్వారా వెంకీకి సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేసే హారికతో వివాహం అవుతుంది. బోర‌బండ‌కు చెందిన వ‌రుణ్ యాద‌వ్‌ కు హారిక చెల్లెలు హ‌నీతో నిశ్చితార్థం అవుతుంది. పెళ్లి త‌ర్వాత హారిక‌, ఆమె త‌ల్లి చేసే ప‌నుల వ‌ల్ల వెంకీకి నిరాశ పెరిగిపోతుంటుంది. వ‌రుణ్‌ను క‌లిసిన త‌ర్వాత వెంకీ పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇస్తాడు. కానీ వెంకీ మాట‌ల‌ను వ‌రుణ్ ప‌ట్టించుకోడు. ఇంటి ప‌క్క‌నుండే వ్య‌క్తి (గద్దె రాజేంద్ర ప్రసాద్) స‌ల‌హాతో ముగ్గురు క‌లిసి యూరప్ విహార యాత్రకు వెళ‌తారు. విష‌యం తెలుసుకున్న హారిక‌, హానీ కూడా యూరప్‌కి బ‌య‌లుదేరుతారు. అంద‌రూ దొరస్వామినాయుడు ఇంట్లో చేరుతారు.[5]

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
  • నిర్మాణ సంస్థ‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
  • సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
  • ఛాయాగ్ర‌హ‌ణం: స‌మీర్ రెడ్డి
  • కూర్పు: త‌మ్మిరాజు
  • నిర్మాత‌లు: శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌
  • ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి

మూలాలుసవరించు

  1. "F2 (Director)". PINKVILLA.
  2. "F2 (Producer)". The Times of India.
  3. "F2 (Male leads)". hindustan times.
  4. "F2 (Female leads)". News-X. Archived from the original on 2018-07-13. Retrieved 2019-01-06.
  5. https://telugu.greatandhra.com/movies/reviews/cinema-review-f2-96385.html

బయటి లంకెలుసవరించు