ప్రభాకర్ మందార

(ప్రభాకర్ మందర నుండి దారిమార్పు చెందింది)

ప్రభాకర్ మందార తెలుగు రచయిత, అనువాదకుడు. ఆయన యాగాటి చిన్నారావు ఆంగ్లంలో వ్రాసిన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ యొక్క తెలుగు అనువాదాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర పేరుతో చేసారు. ఈ అనువాదానికి గాను ఆయనకు 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[1][2] ఈ అవార్డును 20 ఆగస్టు 2010 న పనాజీ (గోవా) లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు సునీల్ గంగోపాధ్యాయ ప్రదానం చేసారు.

ప్రభాకర్ మందార
ప్రభాకర్ మందార
జననం
ప్రభాకర్ మందార

జూలై 19 1950
వరంగల్
ఇతర పేర్లుఅశాంత్
విద్యబి.కాం., డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, అనువాదకుడు
తల్లిదండ్రులుకౌసల్య, వీరయ్య
ప్రభాకర్ మందారకు సాహిత్య అకాడమీ పురస్కార ప్రదానం

జీవిత విశేషాలు

మార్చు

ఆయన స్వస్థలం వరంగల్. 1980 నుంచీ హైదరాబాద్లో ఉంటున్నారు. కొన్ని కథలు, రేడియో నాటికలు రాశారు. ఆర్ టీ సి ప్రస్థానం మాసపత్రికకు రెండు దశాబ్దాల పాటు సంపాదకత్వం వహించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కూ మరికొన్ని ఇతర సంస్థలకూ అనువాదాలు చేస్తున్నారు. వరకట్న మరణాలపై రాసిన "అపరాజిత" అనే రేడియో నాటకానికి 1988 లో ఆకాశవాణి జాతీయ స్థాయి తృతీయ ఉత్తమ రచన బహుమతి, "ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర " అనే అనువాదానికి 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక బహుమతి లభించాయి[1]. 50 కి పైగా కథలు, 20 కి పైగా రేడియో నాటికలు, కొన్ని టి.వి నాటికలు, కవితలు వ్రాసారు. పలు కథలకు కవితలకు వివిధ బహుమతులు అందుకున్నారు.

రచనలు

మార్చు
  1. ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర : దీనిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. (ఆంగ్ల మూలం : దలిత్స్ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటి, రచన డా. యాగాటి చిన్నా రావు)
  2. భారత రాజ్యాంగం – దేశానికి మూల స్తంభం : ఆంగ్ల మూలం : ది ఇండియన్ కాన్స్టిట్యూషన్- కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్, రచన : గ్రాన్ విల్ ఆస్టిన్
  3. ఇండియాలో దాగిన హిందుస్థాన్ ; ఆంగ్ల మూలం : ది ఇండియన్ ఐడియాలజీ, రచన పెరి ఆండర్సన్
  4. తిరగబడ్డ తెలంగాణ- దొరలను దించాం- నిజాంను కూల్చాం; ఆంగ్లమూలం: ఎగైనెస్ట్ దొర అండ్ నిజాం – పీపుల్స్ మువ్ మెంట్ ఇన్ తెలంగాణ, రచన ఇనుకొండ తిరుమలి
  5. 1984 దిల్లీ నుంచి 2002 గుజరాత్ వరకు ఆంగ్ల మూలం : వెన్ ఎ ట్రీ షుక్ దిల్లీ- ది 1984 కార్నేజ్ అండ్ ఇట్స్ ఆఫ్టర్మాత్, రచన మనోజ్ మిట్టా & హెచ్ ఎస్ ఫుల్కా
  6. భారతదేశం – ప్రజాస్వామ్యం : ఆంగ్లమూలం: డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ .
  7. దాస్య విముక్తి కోసం మత మార్పిడి, ఆంగ్లమూలం : డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్
  8. పెరియార్ జీవితం – ఉద్యమం, ఆంగ్ల మూలం : ఇండియా – ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ, రచన వి.ఎస్. నైపాల్
  9. పెరియార్ దృష్టిలో ఇస్లాం, ఆంగ్లమూలం : పెరియార్ ఆన్ ఇస్లాం, రచన: జి. అ లాయ్‌సియస్‌
  10. జబ్బుల గురించి మాట్లాడుకుందాం సిరీస్‌
  11. హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ మనమూ మన సమాజం
  12. నేటి పిల్లలకు రేపటి ముచ్ఛట్లు
  13. తిరగబడ్డ తెలంగాణ - దొరలను దించాం నిజాంను కూల్చాం (ప్రొ.ఇనుకొండ తిరుమలి, పిహెచ్‌డి పరిశోధనా గ్రంథం)
  14. దేవుడి రాజకీయతత్వం- బ్రాహ్మణత్వం పై బుద్ధుని తిరుగుబాటు (ప్రొ.కంచ ఐలయ్య పిహెచ్‌డి పరిశోధనా గ్రంథం)

పురస్కారాలు

మార్చు
  • కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి 2009 సంవత్సరానికి సంబంధించింది. 2010లో (ఆగస్టు 11న) గోవాలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు శ్రీ సునీల్ గంగోపాధ్యాయ ప్రధానం చేసారు.
  • తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వారందరినీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 2011 నవంబరులో హైదరాబాద్ త్యాగరాయ గానసభలో విశిష్ట రీతిలో సత్కరించారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Prabhakar bags Sahitya Akademi prize". News. The Hindu. 27 February 2010. Retrieved 7 February 2016.
  2. Andrapradesh Dalitha Udyama Charithra(1900-1950) (ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర(1900-1950) )

ఇతర లింకులు

మార్చు