ప్రహస్తుడు

రామాయణ ఇతిహాస పాత్ర, రావణుడి మేనమామ

ప్రహస్తుడు, రామాయణ ఇతిహాసంలో ఒక శక్తివంతమైన రాక్షస యోధుడు, రావణుని సైన్యానికి ప్రధాన కమాండర్. తరువాతి జన్మలో ప్రహస్తుడు మహాభారతంలో దుర్యోధనుని విశ్వసనీయ సహాయకుడిగా పురోచనగా పునర్జన్మ పొందాడు, లక్క ఇల్లు సంఘటనకు ప్రధాన కారణమయ్యాడు.

ప్రహస్తుడు
రామాయణం పాత్ర
సమాచారం
కుటుంబంసుమాలి (తండ్రి)
కేతుమతి (తల్లి)
పిల్లలుజంబుమాలి[1]

జననం మార్చు

సుమాలి - కేతుమతి దంపతుల పదిమంది కుమారులలో ప్రహస్తుడు ఒకడు. ఇతనికి నలుగురు సోదరీమణులు కూడా ఉన్నారు. వారిలో రావణుడి తల్లి కైకశి ఒకరు.[2]

చరిత్ర మార్చు

ప్రహస్తుడు రావణుడి సైన్యానికి అధిపతిగా నియమితుడయ్యాడు. యముడు, కుబేరుడు, దేవతలు, అసురులు, దైత్యులతో జరిగిన యుద్ధాలలో రావణుని సైన్యాన్ని నడిపించాడు. దాంతో రావణుడు మూడు లోకాలపై తన సార్వభౌమత్వాన్ని స్థాపించాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం నేతృత్వంలోని దండయాత్రలో లంక తరపున నాయకత్వం వహించాడు.

ప్రహస్తుడు సుగ్రీవ సైన్యంలోని అనేకమంది ముఖ్యమైన యోధులను చంపాడు. రాముడి సైన్యానికి నిజమైన ముప్పు అని కూడా ప్రహస్తుడు నిరూపించాడు. లక్ష్మణుని చేతిలో చంపబడ్డాడు.[3]

మూలాలు మార్చు

  1. Mittal, J. P. (2006). History Of Ancient India (a New Version) : From 7300 Bb To 4250 Bc (in ఇంగ్లీష్). Atlantic Publishers & Dist. ISBN 978-81-269-0615-4.
  2. History Of Ancient India (a New Version) : From 7300 Bb To 4250 Bc.
  3. Rao, Desiraju Hanumanta. "Valmiki Ramayana - Yuddha Kanda - Sarga 58". www.valmikiramayan.net. Retrieved 2017-01-02.[permanent dead link]