ప్రాణం ఖరీదు 1978 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి సి.ఎస్.రావు రచించిన నాటకం ఆధారంగా నిర్మించబడింది.[1] ఇది గుణచిత్ర నటుడు కోట శ్రీనివాసరావుకు తొలి చిత్రం. కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చంద్రమోహన్, మాధవి, చిరంజీవి ముఖ్య పాత్రలు పోషించారు. కె. చక్రవర్తి సంగీతం అందించారు .

ప్రాణం ఖరీదు
(1978 తెలుగు సినిమా)
దస్త్రం:Pranam-kareedu-poster.jpg
దర్శకత్వం కె.వాసు
కథ సి.ఎస్.రావు
తారాగణం చంద్రమోహన్ ,
మాధవి,
చిరంజీవి,
కోట శ్రీనివాసరావు
సంగీతం కె.చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, ఎల్.ఆర్.ఈశ్వరి
సంభాషణలు సి.ఎస్.రావు
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

భూస్వామి కనకయ్య (రావు గోపాలరావు) తన కుమార్తె సమవయస్కురాలైన సీత (జయసుధ) ని కరణం (నూతన్ ప్రసాద్) సహకారంతో వివాహం చేస్కొంటాడు. సీతని బాగా కట్టడి చేస్తాడు. పట్నం నుండి వచ్చిన సీత తమ్ముడు బంగారం (చలం), కనకయ్య ఇంటి పనివాడు, బధిరుడైన దేవుడి (చంద్ర మోహన్) చెల్లెలు బంగారి (రేష్మా రాయ్) పైన కన్నేస్తాడు. కనకయ్య ఇంట్లో మరో పనివాడైన నరసింహ (చిరంజీవి) ని బంగారి ప్రేమిస్తూ ఉంటుంది. బంగారం బంగారిని బలాత్కరిస్తాడు. కనకయ్య సీత, దేవుళ్ళని అనుమానిస్తాడు. అగ్రహోద్రుడైన కనకయ్య ఒక నాడు వారిద్దరినీ హత్య చేస్తాడు. కోపోద్రిక్తులైన ఆ గ్రామ ప్రజలు కనకయ్య పై ఎదురు తిరిగి అతడిని మట్టు బెడతారు

పాత్రలు-పాత్రధారులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.వాసు

కధ, మాటలు: చిత్రజల్లు శ్రీనివాసరావు

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

గీత రచయిత: జాలాది రాజారావు

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, ఎల్ ఆర్ ఈశ్వరి, జి. ఆనంద్, చంద్రశేఖర్

నిర్మాణ సంస్థ: శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజస్

విడుదల:22:09:1978.

పాటలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-25. Retrieved 2011-10-14.

బయటి లింకులు

మార్చు