ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం

తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నది పక్కన ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నది పక్కన ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మంచిర్యాల పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నది ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది.[1]

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యంలోని వన్యప్రాణులు
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
సమీప నగరంమంచిర్యాల
విస్తీర్ణం136.2 km2 (52.6 sq mi)
స్థాపితం1980
ఆధికారిక వెబ్సైటు

చరిత్ర సవరించు

దక్కన్‌ పీఠభూమి లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నిదర్శనంగా ఉన్న ఈ అభయారణ్యం 1980, మార్చి 13న ప్రారంభించబడింది. ఇది 136.02 కిమీ విస్తీర్ణంతో దక్షిణ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, పొడి గడ్డి భూములతో కూడి ఉంది. టేకు చెట్లతో కూడిన కొండలు, పచ్చిక బయళ్ళు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్ళుగా ఉన్నాయి.[2]

వృక్షాలు సవరించు

ఈ అభయారణ్యం సహజ వృక్షసంపదతో సమృద్ధిగా ఉంది. డాల్బెర్జియా పానికులాటా, స్టెరోకార్పస్ మార్సుపియం, ఫికస్ ఎస్పిపి, డాల్బెర్జియా లాటిఫోలియా, డాల్బెర్జియా సిస్సో మొదలైన వివిధ రకాల మొక్కలను, చెట్లను ఇక్కడ చూడవచ్చు.

జంతువులు సవరించు

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం వివిధ రకాల అడవి జాతులకు, ముఖ్యంగా చిరుతపులులు, రీసస్, పులులు, లాంగర్లు, హైనాలు, ఎలుగుబంటి, అడవి కుక్కలు, అటవీ పిల్లి, మరెన్నో క్షీరదాలకు సహజ నివాస స్థలంగా ఉంది.

పక్షులు సవరించు

బ్రాహ్మిని బాతులు, అడవి బాతులు, స్ట్రోక్స్, కొంగలు వంటి సముద్ర పక్షులను కూడా ఇక్కడ ఉంటాయి.

ఇతర వివరాలు సవరించు

  1. ఇక్కడ వివిధ శిలాజాలు ఉన్నాయి. ఇక్కడి 15 నుండి 40 డిగ్రీల వరకు ఉంటుంది.[3]
  2. నవంబరు - ఏప్రిల్ నెలల మధ్య సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది.
  3. మంచిర్యాల, చెన్నూర్ లలో అటవీశాఖ విశ్రాంతి గృహాలు (హరిత హోటల్స్) ఉన్నాయి.

మూలాలు సవరించు

  1. ఈనాడు, తెలంగాణ (12 November 2017). "ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు". Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
  2. సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
  3. నవ తెలంగాణ, జరదేఖో (12 May 2015). "ప్రకృతి ఒడిలో వినోద జడి". m.navatelangana.com. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.

ఇతర లంకెలు సవరించు