ఇష్క్ (2021 సినిమా)
ఇష్క్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన తెలుగు సినిమా. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆర్. బి. చౌదరి సమర్పకులుగా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి యస్.యస్.రాజు[1] దర్శకత్వం వహించగా, తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్ గా నటించారు.[2] ఈ సినిమా 2021, జూలై 30న విడుదలైంది.[3]
ఇష్క్ (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యస్.యస్. రాజు |
---|---|
నిర్మాణం | ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ |
తారాగణం | తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ |
సంగీతం | మహతి స్వర సాగర్ |
గీతరచన | శ్రీమణి |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | ఏ.వర ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2021, జూలై 30 |
భాష | తెలుగు |
కథ
మార్చుసాఫ్ట్వేర్ ఇంజనీర్ సిద్దార్థ్ అలియాస్ సిద్దు - అను (ప్రియా ప్రకాష్ వారియర్) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. అను బర్త్ డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ కు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వారిద్దరూ ఒక రోజు రాత్రి బయటకు వెళ్లి, కారులో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పోలీసు ఆఫీసర్‌ని అని వచ్చిన మాధవ్ (రవీంద్ర విజయ్) వారి రొమాన్స్ ఫోటోలను తీసి బెదిరించి ఆ రాత్రంతా వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇంతకీ ఈ మాధవ్ ఎవరు ? సిద్ధు, అను అతని బారి నుంచి ఎలా బయటపడతారు? చివరికి ఈ ఇద్దరి ప్రేమ ఏమైంది? అనేది మిగిలిన కథ.[4]
నటీనటులు
మార్చు- తేజ సజ్జా - సిద్దార్థ్
- ప్రియా ప్రకాష్ వారియర్ - అనసూయ \ అను
- రవీంద్ర విజయ్ - మాధవ్
- లియోనా లిషాయ్
- గోపరాజు విజయ్
పాటల జాబితా
మార్చు- ఆనందం మదికే, రచన: శ్రీమణి, గానం. సిద్ శ్రీరామ్ , సత్య యామిని
- ఆగలేక పోతున్నా, రచన: శ్రీమణి, గానం. అనురాగ్ కులకర్ణి,
- చీకటి చిరు జ్వాలైయే , రచన: శ్రీమణి , గానం.అనురాగ్ కులకర్ణి , ఉమానేహా.
సాంకేతికవర్గం
మార్చు- సమర్పణ: ఆర్.బి. చౌదరి
- దర్శకత్వం: యస్.యస్. రాజు
- నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్
- సంగీతం: సాగర్ మహతి
- పాటలు: శ్రీమణి
- ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
- కూర్పు ఏ.వర ప్రసాద్
- నిర్మాణ సంస్థ: మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్
- ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
- పీఆర్వో: వంశీ-శేఖర్
ప్రచారం
మార్చుఈ చిత్రంలోని ఆనందమా..ఆనందమదికే లిరికల్ పాటను 2021, ఫిబ్రవరి 13న విడుదల చేశారు.[5] ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ ను 2021, మార్చి 5న విడుదల చేశారు.[6] ఈ చిత్రం ట్రైలర్ ను 2021, ఏప్రిల్ 15న విడుదల చేశారు.[7] ఈ చిత్రాన్ని 2021, ఏప్రిల్ 23న విడుదల చేయాలని భావించగా కరోనా వలన రిలీజ్ వాయిదా వేశారు.[8]ఈ సినిమా ట్రైలర్ ను 27 జూలై 2021న విడుదలైంది.[9]
మూలాలు
మార్చు- ↑ "'ഇഷ്ക് നോട്ട് എ ലൗ സ്റ്റോറി'യില് പ്രിയ വാര്യര്; തെലുങ്ക് ടീസര് കാണാം". Mathrubhumi (in ఇంగ్లీష్). Retrieved 2021-04-16.
- ↑ "Priya Varrier roped in for Telugu remake of 'Ishq'". OnManorama. Retrieved 2021-04-16.
- ↑ "థియేటర్లలోనే 'ఇష్క్'.. విడుదల అప్పుడే.. - ishq not a love story only in cinemas from july 30". www.eenadu.net. Retrieved 2021-07-21.
- ↑ Sakshi (30 July 2021). "తేజ సజ్జ 'ఇష్క్' మూవీ రివ్యూ". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.
- ↑ Eenadu (13 February 2021). "ఆనందమా..ఆనందమదికే అంటున్న యువ హీరో!". www.eenadu.net. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
- ↑ TFPC (5 March 2021). "Tollywood: తేజా సజ్జా- ప్రియా ప్రకాశ్ 'ఇష్క్' ఫస్ట్ లుక్ రిలీజ్." Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
- ↑ News18 Telugu (15 April 2021). "Teja Sajja | Priya Prakash Varrier : తేజ ప్రియా ప్రకాష్ వారియర్‌ల ఇష్క్ ట్రైలర్ విడుదల." Archived from the original on 19 April 2021. Retrieved 15 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (15 April 2021). "ఆసక్తిని రేకెత్తిస్తున్న 'ఇష్క్' ట్రైలర్ | NTV-Telugu News". ntvtelugu.com. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
- ↑ Sakshi (27 July 2021). "ట్రైలర్: హీరోయిన్ బర్త్‌డే ప్లాన్, అంతలో ఏమైంది?". Archived from the original on 28 July 2021. Retrieved 28 July 2021.