ప్రియుడు (సినిమా)
ప్రియుడు 2011లో విడుదలైన తెలుగు సినిమా. యు.కె.ఎవెన్యూస్ బ్యానర్ పై పి.ఉదయ కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రావణ్ దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, ప్రీతిక రావు, శ్వేతా బసు ప్రసాద్, కోట శ్రీనివాస రావు, ప్రగతి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను నవంబర్ 11న విడుదల చేసి,[1] సినిమాను 2011 డిసెంబర్ 1న విడుదల చేశారు.
ప్రియుడు | |
---|---|
దర్శకత్వం | శ్రావణ్ |
నిర్మాత | పి.ఉదయ కిరణ్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మల్హర్ భట్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మోహన్ జోనా |
నిర్మాణ సంస్థ | యు.కె.ఎవెన్యూస్ |
విడుదల తేదీ | 1 డిసెంబరు 2011 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకార్తీక్ (వరుణ్ సందేశ్) ఒక ధనవంతుడు. జల్సా గా తిరిగే ఈ కుర్రాడికి ప్రేమ అన్న, నియమాలు అన్న ఇష్టం ఉండవు. ప్రేమ లో పడితే, ఎక్కడ తన స్వతంత్రం పోతుందో అని భయపడతాడు. అలాంటివాడి జీవితంలోకి మధు (ప్రీతిక రావు) అడుగుపెడుతుంది. మధు తండ్రి, కార్తిక్ తండ్రి చిన్ననాటి స్నేహితులు. మధు కార్తిక్ ను ఇష్టపడుతున్నట్లు గా తెలుసుకున్న పెద్దలు వీరి పెళ్లి నిశ్చయం చేస్తారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని కార్తిక్, తన మీదకు నింద రాకుండా మధుని వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు. మధు అంటే బాగా ఇష్టపడే జీనియస్ (రణధీర్) అనే కుర్రాడిని మధు మీదకి మళ్ళించి, ఆమె అతడి తో ప్రేమ లో పడేందుకు ప్రయత్నిస్తాడు. సరిగ్గా మధు మనసు మారే సమయానికి కార్తిక్ మనసులో కూడా మార్పు ఒస్తుంది. ఆ మార్పు ఏమిటి? మధు ఎవరిని పెళ్లి చేసుకుంది? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- వరుణ్ సందేశ్ [3]
- ప్రీతిక రావు [4]
- శ్వేతా బసు ప్రసాద్
- కోట శ్రీనివాస రావు
- ప్రగతి
- నాజర్
- సురేఖ వాణి
- ఆలీ
- వెన్నెల కిషోర్
- రణధీర్
- కాశీ విశ్వనాధ్
- శివన్నారాయణ నరిపెద్ది
- తాగుబోతు రమేష్
- విజయ్ సాయి
- శంకర్ మేల్కొటే
- ప్రభాస్ శ్రీను
- జూ.రేలంగి
- అల్లరి సుభాషిణి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: యు.కె.ఎవెన్యూస్
- నిర్మాత: ఉదయ్ కిరణ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రావణ్ [5]
- సంగీతం: మోహన్ జోనా
- సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
పాటల జాబితా
మార్చులవ్l లో ఏదో, గానం. బెన్నీ దయాళ్
చైత్రమా , గానం.కార్తీక్
అల్బెల అల్బెల , గానం.విజయ్ ప్రకాష్ , చిన్మయి
బక్కొడేర , గానం.ప్రియ హీమేష్
చెలియ చెలియ, గానం.శంకర్ మహదేవన్
చిన్ని గుండె , గానం.శ్వేతా మోహన్.
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (12 November 2011). "'Priyudu' audio released". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
- ↑ The Hindu (3 December 2011). "Priyudu - Matters of the heart" (in Indian English). Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
- ↑ The Times of India (24 November 2011). "Varun Sandesh goes back to romance" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
- ↑ DNA India (2 November 2011). "South actress Preetika elated about Telugu debut 'Priyudu'" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
- ↑ Andrajyothy (2 May 2021). "దర్శకుడు శ్రవణ్ మృతి!". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.