ప్రియురాలు పిలిచింది

ప్రియురాలు పిలిచింది 2000 లో విడుదల అయిన తెలుగు సినిమా.

ప్రియురాలు పిలిచింది 2000 లో విడుదల అయిన తెలుగు సినిమా. వి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి రాజీవ్‌ మీనన్‌[1] దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి, అజిత్‌, టబు, ఐశ్వర్యరాయ్‌, అబ్బాస్‌ నటించారు.[2] ఈ సినిమా 2000 సంవత్సరం విడుదల అయిన తమిళ "కండుకొండైన్ కండుకొండైన్" చిత్రానికి అనువాదం.

ప్రియురాలు పిలిచింది
Priyuralu Pilichindi.jpg
దర్శకత్వంరాజీవ్ మీనన్
స్క్రీన్‌ప్లేరాజీవ్ మీనన్
దీనిపై ఆధారితంజేన్ ఆస్టెన్ "సెన్స్ అండ్ సెన్సిబిలిటీ"
నిర్మాతఎ.ఎం రత్నం
నటవర్గం
ఛాయాగ్రహణంరవి కె. చంద్రన్
కూర్పుసురేష్
సంగీతంఎ.ఆర్ రెహమాన్
నిర్మాణ
సంస్థ
వి క్రియేషన్స్
విడుదల తేదీలు
2000 మే 5 (2000-05-05)
నిడివి
158 నిమిషాల
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

కథసవరించు

ఒక ఊళ్ళో పెద్ద ఎస్టేట్‌ యజమానురాలు అయిన పద్మకి ఇద్దరు కూతుళ్లు సౌమ్య, మీనాక్షి ఉంటారు. పెళ్ళి చూపుల్లో సౌమ్యని చూసి వెళ్ళిన అబ్బాయి చనిపోతాడు. అప్పట్నుంచి సౌమ్య నష్టజాతకురాలు అన్న ముద్ర పడుతుంది. ఇక ఏ సంబంధాలూ రాక ఆమెకి వాళ్ళ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసుకుంటూ, కాలేజి ప్రిన్సిపాల్‌ గా పనిచేస్తుంటుంది. మీనాక్షి కి కవితలు అంటే పిచ్చి. అజిత్‌ అసిస్టెంట్‌ డైరక్టర్‌ గా పనిచేస్తుంటాడు. ఓ సినిమా షూటింగ్‌ కు లొకేషన్‌ కోసం వెతుక్కుంటూ సౌమ్య వాళ్ళ ఎస్టేటుకు వస్తాడు. మొదటి చూపులోనే అజిత్‌ ప్రేమలో పడుతాడు. సౌమ్య కూడా తనని ప్రేమించేట్టుగా ఒప్పిస్తాడు. అతను మొదటి సినిమా తీసిన తర్వాత పెళ్ళిచేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. యుద్ధంలో ఒక కాలును కోల్పోయిన మేజర్‌ మమ్ముట్టి మీనాక్షిని ప్రేమిస్తుంటాడు. మీనాక్షి పాటలంటే మమ్ముట్టికి చాల ఇష్టం. మీనాక్షి అబ్బాస్ ని ప్రేమిస్తుంది. పద్మ వాళ్ళ నానా చనిపోతూ ఎస్టేట్ అతని కొడుకు పేరు మీద రాస్తాడు. దానితో పద్మ వాళ్ళు హైదరాబాదుకి వెళ్తారు. సౌమ్య ఓ సాప్ట్‌ వేర్‌ కంపెనీలో రిసెప్షనిస్ట్‌ గా జాయనవుతుంది. మేజర్‌ సాయంతో ఓ మ్యూజిక్‌ కాలేజిలో లెక్చరర్‌ గా మీనాక్షి చేరుతుంది. అజిత్‌ అష్టకష్టాలు పడి టాప్‌ స్టార్‌ నందినీ వర్మతో సినిమా తీస్తాడు. నందినీ తో అజిత్‌ వ్యవహారాన్ని నడుపుతున్నాడన్న పత్రికల్లో గాసిప్‌ లు చూసి సౌమ్య- అజిత్‌ కు దూరంగా ఉండడం మొదలుపడుతుంది. ఫైనాన్స్‌ కంపెనీ నడుపుతున్న అబ్బాస్‌ నష్టాలపాలై బోర్డు తిప్పేస్తాడు. డిపాజిటర్లు నుంచి తప్పించుకొని తిరుగుతున్న అబ్బాస్‌ ను, మీనాక్షిని మమ్ముట్టి మళ్ళీ ఒకటి చేస్తాడు. అయితే అప్పులిచ్చేందుకు ముందుకు వచ్చిన ఓ ఎమ్మెల్యే కూతురును అబ్బాస్‌ పెళ్ళిచేసుకుంటాడు. దీంతో షాక్‌ తిన్న మీనాక్షి వర్షంలో తడుచుకుంటూ నడిచి వెళ్తూ మ్యాన్‌ హోల్‌ లో పడి ఆస్పత్రిపాలవుతుంది. తను గాయని అయ్యేందుకు తోడ్పడమే కాకుండా, ఆస్పత్రిలో తనకు సేవలు చేసిన మమ్ముటినే పెళ్ళి చేసుకుంటుంది. అపార్థాలన్నీ తొలగిపోయాక అజిత్‌, సౌమ్యలు పెళ్ళి చేసుకుంటారు.

పాటలుసవరించు

సంఖ్య శీర్షిక సాహిత్యం గాయకుడు(లు) పొడవు
1. గంధపు గాలిని వైరముత్తు శంకర్ మహదేవన్ 6:00
2. దోబూచులాటేరా వైరముత్తు కె.ఎస్ చిత్ర 4:49
3. పలికే గోరింకా వైరముత్తు సాధనా సర్గం 4:43
4. తొంగి చూసే సుబ్రమణ్య భారతి మహాలక్ష్మి అయ్యర్, హరిహరన్ 2:21
5. ఏమాయే నా కవిత వైరముత్తు కె.ఎస్ చిత్ర 5:15
6. సమయమే మాగ్నెట్ వైరముత్తు దేవన్ ఏకాంబరం, క్లింటన్ చర్చి, డొమినిక్ చర్చి 5:09

మూలాలుసవరించు

  1. "Sify.com". Sify. Archived from the original on 2013-07-01. Retrieved 2022-05-27.
  2. "The Hindu : West End success story". archive.ph. 2012-11-11. Archived from the original on 2012-11-11. Retrieved 2022-05-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Did you know 'priyuralu pilichindi' makers had first approached Manju Warrier to play the role of Meenakshi? - Times of India". The Times of India. Retrieved 2022-05-27.