ప్రీతం ముండే భారత పార్లమెంటు సభ్యురాలు. ఆమె మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందింది. ఈమె ఈ ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించి, లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.[1] [2] ఈమె తండ్రి గోపీనాథ్ ముండే .[3][4] బీడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో 2014 జూన్ నెలలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈయన మరణంతో బీడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం జరిగింది.

డాక్టర్ ప్రీతం ముండే
ప్రీతం ముండే


పదవీ కాలం
2014-2019
2019-
ముందు గోపీనాథ్ ముండే
నియోజకవర్గం బీడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1983-02-17) 1983 ఫిబ్రవరి 17 (వయసు 41)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి గౌరవ్ రాజేంద్ర ఖడే
సంతానం 1

విశేషాలు మార్చు

ఈమె 1983 ఫిబ్రవరి 17న మహారాష్ట్రలోని బీడ్ నగరంలో గోపీనాథ్ ముండే, ప్రజ్ఞ దంపతులకు జన్మించింది. ముంబైలోని డి.వై. పాటిల్ వైద్యకళాశాలలో చదివి డెర్మటాలజీ, వెనెరాలజీ, లెప్రసీ విభాగాలలో ఎం.డి.పట్టాను సాధించింది. ఈమెకు 2009 డిసెంబరు 11న గౌరవ్ రాజేంద్ర ఖడేతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈమె తండ్రి మరణంతో 2014లో జరిగిన ఉపఎన్నికలో ఈమె బీడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతాపార్టీ తరఫున నిలబడి 16వ లోక్‌సభకు ఎన్నికైంది. తిరిగి 2019లో 17వ లోక్‌సభకు ఎన్నికై సభ్యురాలిగా కొనసాతున్నది. ఈమె వివిధ పార్లమెంటరీ కమిటీలలో సభ్యురాలిగా నిమమింపబడింది. ఈమె ఇంగ్లాండ్,జర్మనీ,హాంగ్‌కాంగ్,ఇటలీ,మలేషియా,నేపాల్,థాయిలాండ్,అమెరికా మొదలైన దేశాలను సందర్శించింది[5].

మూలాలు మార్చు

  1. "Munde's daughter Pritam wins Beed Lok Sabha bypoll by record margin". The Times of India. 19 October 2014. Archived from the original on 20 అక్టోబరు 2014. Retrieved 20 October 2014.
  2. "Munde's daughter breaks Modi's Lok Sabha record". India Today. 20 October 2014. Archived from the original on 19 అక్టోబరు 2014. Retrieved 20 October 2014.
  3. "Maharashtra elections: Gopinath Munde's daughters vying to retain family turf in Beed". www.dnaindia.com. 20 October 2014. Retrieved 20 October 2014.
  4. "Pritam Munde breaks Loksabha record".
  5. వెబ్ మాస్టర్. "Seventeenth Lok Sabha Members Bioprofile Munde, Dr. Pritam Gopinath". Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE. Lok Sabha Secretariat. Retrieved 13 May 2020.

బాహ్య లంకెలు మార్చు