ప్రేమకథ (1968 సినిమా)

ప్రేమకథ వి.శ్రీనివాసన్ దర్శకత్వంలో శ్రీ తిరుమల పిక్చర్స్ బ్యానర్‌పై ఎ.శ్రీరామమూర్తి, వి.ఎస్.సత్యనారాయణలు నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1968, మార్చి 21వ తేదీన విడుదలయ్యింది. నీనైవిల్ నీండ్రవల్ అనే తమిళ సినిమా ఈ రొమాంటిక్ కామెడి చిత్రానికి మాతృక.

ప్రేమ కథ
సినిమా పోస్టర్
దర్శకత్వంముక్తా శ్రీనివాసన్
స్క్రీన్ ప్లేచో
కథరాజశ్రీ
నిర్మాతఎ.శ్రీరామమూర్తి,
వి.ఎస్.సత్యనారాయణ
తారాగణంరవిచంద్రన్
కె.ఆర్.విజయ
ఛాయాగ్రహణంటి.ఎన్.సుందరబాబు
కూర్పుబి.గోపాలరావు
సంగీతంటి.చలపతిరావు
నిర్మాణ
సంస్థ
శ్రీ తిరుమల పిక్చర్స్
విడుదల తేదీ
1968 మార్చి 21 (1968-03-21)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • రవిచంద్రన్ - ప్రకాష్
  • కె.ఆర్.విజయ - ప్రేమ
  • నగేష్ - మధు
  • చో - రామనాథం
  • వి.ఎస్.రాఘవన్ - ఉమాపతి
  • ఆనందన్ - సెక్రెటరీ
  • సచ్చు
  • మనోరమ - రామనాథం భార్య
  • దేవకి

సాంకేతికవర్గం మార్చు

కథ మార్చు

ప్రేమ ఉన్నత చదువులకోసం తన బాబాయి రామనాథం ఇంటిలో మద్రాసులో ఉంటుంది. ఆ అమ్మాయిని అధునాతనంగా తీర్చిదిద్దినందుకు ప్రేమ తండ్రి ఉమాపతి రామనాథంను అభినందించక పోగా తప్పుబడతాడు. ఈలోగా ప్రేమ ఒక ప్రమాదానికి లోనై తన గతాన్ని మరిచిపోతుంది. అన్నయ్యకు ఈ విషయం ఎలా చెప్పాలా అని రామనాథం, అతని భార్య హడలి పోతారు. మద్రాసులో ప్రకాష్, మధు అనే నిరుద్యోగ యువకులను ప్రేమ కలుసుకుంటుంది. ప్రేమ, ప్రకాష్‌లు ప్రేమలో పడతారు. పెళ్ళి చేసుకుంటారు. ప్రేమ కోసం వెదుకుతున్న రామనాథం తన కారుతో ఆమెనే ఢీకొని ఆమెను ఆసుపత్రిలో చేర్పిస్తాడు. ప్రేమ మళ్ళీ తన స్మృతిని కోల్పోతుంది. ప్రకాష్‌లో తనకు పెళ్ళయిన సంగతి గుర్తుకు రాదు. రామనాథం ఆమెను తండ్రి దగ్గరకు చేరుస్తాడు. ఉమాపతి ఆమెను తన మేనేజర్ మోహన్‌కి ఇచ్చి పెళ్ళి చేయడానికి పూనుకుంటాడు. ప్రకాష్, మధులు రామనాథం సహాయంతో ఉమాపతి దగ్గరే పనికి చేరతారు. రామనాథం, ప్రకాష్, మధులు మోహన్‌తో ప్రేమ పెళ్ళి జరగకుండా ఎత్తులు వేస్తారు. వారి ఎత్తులు ఫలించి, ప్రేమకు పూర్వపు స్మృతి వచ్చి ప్రకాష్‌ను గుర్తించడంతో కథ ముగుస్తుంది.[1]

మూలాలు మార్చు

  1. సమీక్షకుడు - రూపవాణి (24 March 1968). "చిత్రసమీక్ష: ప్రేమకథ" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 9 డిసెంబర్ 2022. Retrieved 9 December 2022. {{cite news}}: Check date values in: |archive-date= (help)