ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం 1981లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.
ప్రేమాభిషేకం (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ స్టూడియోస్ |
భాష | తెలుగు |
ప్రాచుర్యం, ప్రభావం
మార్చుప్రేమాభిషేకం సినిమా తెలుగు సినిమాలపైన ఎంతో ప్రభావాన్ని చూపింది. ప్రేమాభిషేకం సినిమా కథ స్ఫూర్తిగా వెలువడ్డ సినిమాల్లో బొబ్బిలి సింహం వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.[1]
తారాగణం
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు
- శ్రీదేవి
- మురళీమోహన్
- గుమ్మడి
- పద్మనాభం
- జయసుధ
- మోహన్ బాబు
- కవిత
- ప్రభాకర్ రెడ్డి
- మాడా.
- నిర్మల
పాటలు
మార్చు- నా కళ్ళు చెబుతున్నాయి, నిను చూస్తున్నాయని. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం. పి. సుశీల. రచన: దాసరి నారాయణరావు.(అన్ని పాటలు)
- ఆగదు ఏ నిముషము నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకమూ. శ్రీ పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం.
- కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా . ఎస్ పి. బాలు. పి. సుశీల.
- ఒక దేవుని గుడిలో ఒక దేవత .బాలు, సుశీల
- వందనం, అభివందనం, నీ అందమే ఒక నందనం బాలు సుశీల
- దేవీమౌనమా. ఎస్.పి.బాలు.పి సుశీల
- తారలు దిగివచ్చిన వేళ.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల.
అవార్డులు
మార్చు- ఈ చిత్రానికి గాను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.
చిత్ర విశేషాలు
మార్చు- ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో 4 కోట్ల పైన షేర్ వసూల్ చేసిన మొదటి చిత్రం కాగా, మొత్తం 4.5 కోట్ల షేర్ వచ్చింది. 1987లోవచ్చిన పసివాడి ప్రాణం సినిమా ఆ రికార్డును క్రాస్ చేసింది.
- డైరెక్టుగా 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా ఇది. షిఫ్టింగ్స్ తో కలిపి మొత్తం 43 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది.
- తెలుగు సినిమారంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా, 75 వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే.
- 20 కేంద్రాల్లో 200 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇది. 8 కేంద్రాలలో సంవత్సరంపాటు ఆడిన ఏకైక చిత్రమిది.
- 29 కేంద్రాల్లో 175 రోజులు ఆడి, 1979లో సమరసింహారెడ్డి సినిమా దాన్ని క్రాస్ చేసేవరకు ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది.
- ఒకే థియేటర్ లో 10 లక్షలు వసూల్ చేయడమే కష్టమైన ఆ రోజుల్లో 10 కేంద్రాల్లో 10 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డ్ సొంతం చేసుకుంది.
- ఒకే థియేటర్ లో 15 లక్షలు, 20 లక్షలు వసూల్ చేసిన తొలి సినిమా చరిత్ర సృష్టించింది.
- బెంగుళూరు నగరంలోని 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక సెంటర్ లో 46 లక్షలు వసూల్ చేసి కర్ణాటక రాష్ట్ర రికార్డ్ క్రియేట్ చేసింది.
మూలాలు
మార్చు- ↑ సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.