బొబ్బిలి సింహం ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, రోజా, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 1994 నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రాన్ని టి. త్రివిక్రమరావు విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

బొబ్బిలి సింహం
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
రచనవిజయేంద్ర ప్రసాద్
నిర్మాతటి. త్రివిక్రమరావు
తారాగణంబాలకృష్ణ,
రోజా,
మీనా
ఛాయాగ్రహణంఎ. విన్సెంట్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
సెప్టెంబరు 23, 1994 (1994-09-23)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

కథారచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథను ప్రేమాభిషేకం ఇతివృత్తం స్ఫూర్తితో తయారుచేశారు. ప్రేమాభిషేకం సినిమాలో కథానాయకునికి కేన్సర్ ఉండడంతో ఆ విషయాన్ని దాచిపెట్టి కథానాయకికి వేరే వివాహం జరిగేలా ప్రవర్తిస్తాడు. దీన్నే తిరగేసి కథానాయకికి ప్రాణానికి ప్రమాదం కలగడంగా మార్చి ఈ కథను తయారుచేసినట్టు విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.[2]

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా బాలు, చిత్ర, నాగూర్ బాబు, రాధిక పాటలు పాడారు. ఆకాష్ ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి. అన్ని పాటలు వేటూరి సుందరరామ్మూర్తి రాయగా, శ్రీరస్తు శుభమస్తు అనే పాటను జాలాది రాశాడు.[3]

  • పాలకొల్లు పాపా (బాలు, చిత్ర)
  • లకడి కా పూలట (బాలు, చిత్ర)
  • శ్రీరస్తు శుభమస్తు (బాలు, చిత్ర)
  • ఈడు ఈల వేసినా (బాలు, చిత్ర)
  • కిట్టమ్మ లీల (బాలు, చిత్ర)
  • మాయదారి పిల్లడా (నాగూర్ బాబు, రాధిక)

మూలాలు

మార్చు
  1. "Bobbili Simham on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-05-13.
  2. సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.
  3. Prabhu (2019-09-23). "25 Years For Balakrishna Blockbuster Movie Bobbili Simham". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-13.