ప్రేమ్‌జిత్ లాల్
ప్రేమ్‌జిత్ లాల్ (1940 అక్టోబరు 20 - 2008 డిసెంబరు 31) కోల్‌కతాకు చెందిన భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. అతను 1960లు, 70లలో ఆడాడు.
పూర్తి పేరు | ప్రేమ్‌జిత్ జె. లాల్ |
---|---|
దేశం | భారతదేశం |
జననం | కోల్‌కతా | 1940 అక్టోబరు 20
మరణం | 2008 డిసెంబరు 31 కోల్‌కతా | (వయసు 68)
విశ్రాంతి | 1979 |
ఆడే విధానం | కుడిచేతి వాటం |
సింగిల్స్ | |
సాధించిన రికార్డులు | 294–231 (56%)[1] |
సాధించిన విజయాలు | 9[2] |
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | మూడో రౌండు (1962) |
ఫ్రెంచ్ ఓపెన్ | మూడో రౌండు (1969) |
వింబుల్డన్ | మూడో రౌండు (1962, 1965, 1970) |
యుఎస్ ఓపెన్ | రెండో రౌండు (1959, 1964, 1969, 1970) |
డబుల్స్ | |
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | క్వా.ఫై (1962) |
వింబుల్డన్ | క్వా.ఫై (1966, 1973) |
Mixed Doubles | |
Grand Slam Mixed Doubles results | |
వింబుల్డన్ | రెండో రౌండు (1958, 1959) |
Team Competitions | |
డేవిస్ కప్ | ఫై (1959, 1962, 1963, 1966, 1968) |
టెన్నిస్ కెరీర్
మార్చులాల్ తన టెన్నిస్ కెరీర్‌ని కలకత్తా సౌత్ క్లబ్‌లోని గ్రాస్ కోర్టులలో ప్రారంభించాడు. అక్కడ అతను దిలీప్ బోస్ వద్ద శిక్షణ పొందాడు.[3][4][5][6] జైదీప్ ముఖర్జీ, రామనాథన్ కృష్ణన్, లాల్ -ఈ ముగ్గురినీ భారత టెన్నిస్‌లో త్రీ మస్కటీర్స్ అని పిలుస్తారు.[7][8]
లాల్ 1958 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లో బాయ్స్ సింగిల్స్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్‌లో అతను బచ్ బుచోల్జ్ చేతిలో ఓడిపోయాడు. 1969 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌లో లాల్ మొదటి-సీడ్, ప్రపంచ నం. 1 రాడ్ లేవర్‌ను రెండవ రౌండ్‌లో రెండు సెట్‌ల తేడాతో ఆధిక్యంలోకి వెళ్ళి దాదాపు అప్సెట్ విజయానికి చేరువగా వెళ్ళాడు. కాని చివరికి లేవర్ చేతిలో ఐదు సెట్‌లలో ఓడిపోయాడు.[6][9] లాల్ 1957 - 1975 మధ్య 18 సార్లు వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు [10] 1973లో అతను ఇంగ్లండ్‌లోని స్టౌర్‌బ్రిడ్జ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు డేనియల్ కాంటెట్‌పై గెలిచి స్టౌర్‌బ్రిడ్జ్ ఓపెన్‌ను సాధించాడు.
అతను 1959 నుండి 1973 వరకు ఇండియన్ డేవిస్ కప్ జట్టులో ఆడి, 52 విజయాలు, 32 ఓటముల రికార్డును సృష్టించాడు. అతను 1966 లో ఆస్ట్రేలియాపై ఛాలెంజ్ రౌండ్‌కు చేరుకున్న జట్టులో సభ్యుడు, కానీ ఛాలెంజ్ రౌండ్‌లో ఆడలేదు.
డబుల్స్‌లో, అతను 1962 ఆస్ట్రేలియన్ ఛాంపియన్‌షిప్ లోను, 1966, 1973 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లలోనూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అన్నీ స్వదేశీయుడైన జైదీప్ ముఖర్జీతో కలిసి ఆడాడు.
లాల్ 1961, 1970లో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో కార్లోస్ ఫెర్నాండెజ్, అలెక్స్ మెట్రెవెలిలను సంబంధిత ఫైనల్స్‌లో ఓడించి సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
లాల్‌కు 1967లో భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవం అర్జున అవార్డు లభించింది.[11][12] లాల్ తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్‌ను 1979లో ఆడాడు.
వ్యక్తిగత జీవితం
మార్చులాల్ రెండుసార్లు పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[5] 1992లో గుండెపోటు వచ్చిన తరువాత, లాల్ వీల్ చైర్ ఉపయోగించడం ప్రారంభించాడు. మాట్లాడడంలో ఇబ్బంది పడ్డాడు.[6][13] దీర్ఘకాలిక అనారోగ్యం తరువాత 2008 డిసెంబరు 31 న కోల్‌కతాలోని తన నివాసంలో మరణించాడు. టోలీగంజ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.[5] 2016లో, అతని జ్ఞాపకార్థం కోల్‌కతాలో అతని పేరు మీద ఆహ్వాన టోర్నమెంటు జరిగింది.[14]
మూలాలు
మార్చు- ↑ Garcia, Gabriel. "Premjit Lall: Career match record". thetennisbase.com. Tennismem SL. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 23 November 2017.
- ↑ Garcia, Gabriel. "Premjit Lall: Career tournament results". thetennisbase.com. Tennismem SL. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 23 November 2017.
- ↑ "Road to Wimbledon: An introduction to the Calcutta South Club". Wimbledon. AELTC. 5 April 2016.
- ↑ "Premjit Lall is no more". The Telegraph. 1 January 2009. Archived from the original on 25 October 2012.
- ↑ 5.0 5.1 5.2 "Davis Cupper Premjit Lall cremated". The Times of India. 1 January 2009.
- ↑ 6.0 6.1 6.2 Hari Hara Nandanan (2 January 2009). "Ramanathan Krishnan pays tribute to Premjit Lall". The Times of India.
- ↑ S. Sabanayakan (6 May 2006). "The man who serves". Sportstar.[permanent dead link]
- ↑ Monojit Chatterji (19 July 2015). "Big W crowns 50 years of fandom". The Telegraph. Archived from the original on 22 July 2015.
It was the Davis Cup semi-final and our three musketeers - Ramanathan Krishnan, Premjit Lall and Jaideep Mukerjea - were facing the might of America led by Chuck Mckinley,...
- ↑ Bud Collins (31 January 2009). "Rocket science". The Age.
- ↑ "Players archive – Premjit Lall". Wimbledon. AELTC.
- ↑ "LIST OF ARJUNA AWARD WINNERS - Football | Ministry of Youth Affairs and Sports". yas.nic.in. Ministry of Youth Affairs and Sports. Archived from the original on 25 December 2007. Retrieved 25 December 2007.
- ↑ "List of Arjuna Awardees (1961–2018)" (PDF). Ministry of Youth Affairs and Sports (India). Archived from the original (PDF) on 18 July 2020. Retrieved 12 September 2020.
- ↑ V.V. Subrahmanyam (5 February 2003). "Premjit Lal - in a class of his own". The Hindu.
- ↑ "Tennis legend Tony Roche to visit Kolkata next month". Hindustan Times. 22 November 2016.