ఫ్రెంచ్ ఓపెన్
ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో స్టేడ్ రోలాండ్ గారోస్‌లో రెండు వారాల పాటు జరిగే ఒక ప్రధాన టెన్నిస్ టోర్నమెంటు. ఇది ప్రతి సంవత్సరం మే చివరిలో ప్రారంభమవుతుంది. [c] టోర్నమెంటు జరిగే వేదికకు ఫ్రెంచ్ ఏవియేటర్ రోలాండ్ గారోస్ పేరు పెట్టారు. అంచేత దీన్ని రోలాండ్-గారోస్ అని కూడా అంటారు.[2] ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్టుపై ఆడే టోర్న్మెంట్లలో ప్రపంచంలోనే ప్రధానమైనది. ప్రస్తుతం ఈ ఉపరితలంపై జరుగుతున్న ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నమెంటు ఇది. ఇది నాలుగు వార్షిక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లలో కాలక్రమానుసారం రెండవది.[3] ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఇది జరుగుతుంది. 1975 వరకు ఫ్రెంచ్ ఓపెన్, గడ్డిపై ఆడని ఏకైక ప్రధాన టోర్నమెంటు. ఫ్రెంచ్ ఓపెన్‌ను టెన్నిస్‌లో అత్యంత శారీరక శ్రమతో కూడిన టోర్నమెంటుగా పరిగణిస్తారు.[4][5][6][7][8]
ప్రారంభం | 1891 |
---|---|
ఎడిషన్లు | 127 (2023) 93 గ్రాండ్ స్లామ్ పోటీలు (1925 నుండి) |
స్థలం | పారిస్ ఫ్రాన్స్ |
వేదిక | స్టేడ్ రోలండ్ గారోస్ (1928 నుండి) Societé de Sport de Île de Puteaux, at Puteaux (1891–1894); Tennis Club de Paris, at Auteuil (1895–1908); Société Athlétique de la Villa Primrose at Bordeaux (1909); Croix-Catelan de Racing Club de France at the Bois de Boulogne (1910–1924, 1926); Stade Français at Saint-Cloud (1925, 1927) |
నేల | క్లే కోర్ట్ – outdoors[a] (1908–present) Sand – outdoors (1892–1907) Grass – outdoors (1891) |
బహుమాన ధనం | €49,600,000 (2023)[1] |
డ్రా | S (128Q) / 64D (16Q)[b] |
ప్రస్తుత ఛాంపియన్లు | నోవక్ డోకోవిచ్ (సింగిల్స్) ఇవాన్ డోడిగ్ ఆస్టిన్ క్రాయిచెక్ (డబుల్స్) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | రఫేల్ నాడల్ (14) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | రాయ్ ఎమర్సన్ (6) |
డ్రా | S (128Q) / 64D (16Q) |
ప్రస్తుత ఛాంపియన్లు | Iga Świątek (singles) Hsieh Su-wei Wang Xinyu (doubles) |
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళు | క్రిస్ ఎవర్ట్ (7) |
అత్యధిక డబుల్స్ టైటిళ్ళు | మార్టినా నవ్రతిలోవా (7) |
డ్రా | 32 |
ప్రస్తుత ఛాంపియన్లు | Miyu Kato Tim Pütz |
అత్యధిక టైటిళ్ళు (పురుషులు) | కెన్ ఫ్లెచర్ / Jean-Claude Barclay (3) |
అత్యధిక టైటిళ్ళు (స్త్రీలు) | మార్గరెట్ కోర్ట్ (4) |
2023 |
నేల లక్షణాలు
మార్చు1978 లో ఎస్ ఓపెన్ హార్డ్ కోర్టుకు మారిన తరువాత ఫ్రెంచ్ ఓపెన్ ఒక్కటే క్లే కోర్ట్‌లలో అడే ప్రధానమైన టోర్నమెంటుగా మిగిలింది.[10][11] గ్రాస్ కోర్టులు లేదా హార్డ్ కోర్టులతో పోల్చినప్పుడు క్లే కోర్టులు బంతిని నెమ్మదింపజేసి, అధిక బౌన్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారణంగా, క్లే కోర్ట్‌లు పెద్ద పెద్ద సర్వులకు, సర్వ్-అండ్-వాలీలకూ అనువుగా ఉండవు. ఈ రకమైన ఆటగాళ్లు ఉపరితలంపై ఆధిపత్యం చెలాయించడం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, పీట్ సంప్రాస్, అతని భారీ సర్వ్‌లకు పేరుగాంచాడు. అతను 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు, కానీ ఫ్రెంచ్ ఓపెన్‌ను ఎన్నడూ గెలవలేదు - అతని అత్యుత్తమ ఫలితం 1996 లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం, అంతే. జాన్ మెకెన్రో, ఫ్రాంక్ సెడ్గ్‌మన్, జాన్ న్యూకాంబ్, వీనస్ విలియమ్స్, స్టెఫాన్ ఎడ్‌బర్గ్, బోరిస్ బెకర్, లేటన్ హెవిట్, ఆండీ ముర్రే, జిమ్మీ కానర్స్, లూయిస్ బ్రో వంటి అనేక ఇతర ప్రముఖ క్రీడాకారులు అనేక గ్రాండ్ స్లామ్ ఈవెంట్‌లను గెలుచుకున్నారు, అయితే వీళ్ళు ఫ్రెంచ్ ఓపెన్‌ను ఎన్నడూ గెలవలేదు. వేడ్ లేదా మార్టినా హింగిస్ ; మెక్‌ఎన్రో, ఎడ్‌బర్గ్ ఐదు సెట్లలో వారి ఏకైక ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిపోయారు.
మరోవైపు బంతి బాగా ఎత్తుకు లేచే నేలపై బాగా ఆడే రాఫెల్ నాదల్, జార్న్ బోర్గ్, ఇవాన్ లెండిల్, మాట్స్ విలాండర్, జస్టిన్ హెనిన్, క్రిస్ ఎవర్ట్ వంటి ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో గొప్ప విజయాన్ని సాధించారు. ఓపెన్ ఎరాలో, వేగవంతమైన గ్రాస్ కోర్ట్‌లలో ఆడిన ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ రెండింటినీ గెలిచిన ఏకైక పురుష ఆటగాళ్లు రాడ్ లేవర్, జాన్ కోడెస్, జార్న్ బోర్గ్, ఆండ్రీ అగస్సీ, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, నోవాక్ జొకోవిచ్ లు. మహిళా క్రీడాకారుల్లో ఎవోన్నే గూలాగాంగ్ కావ్లీ, మార్గరెట్ కోర్ట్, బిల్లీ జీన్ కింగ్, క్రిస్ ఎవర్ట్ లాయిడ్, మార్టినా నవ్రతిలోవా, స్టెఫీ గ్రాఫ్, సెరెనా విలియమ్స్, మరియా షరపోవా, గార్బైన్ ముగురుజా, సిమోనా హాలెప్, ఆష్లీగ్ బార్టీ ఉన్నారు. జోర్న్ బోర్గ్, ఫ్రెంచ్ ఓపెన్-వింబుల్డన్ లు రెంటినీ ఒకే సంవత్సరం గెలుచుకోవడం వరుసగా మూడుసార్లు సాధించాడు.[12]
కోర్టుల కూర్పు
మార్చు1. ఎర్ర ఇటుక దుమ్ము.2. చూర్ణం చేసిన తెల్లటి సున్నపురాయి.3. క్లింకర్ (బొగ్గు అవశేషాలు).4. పిండిచేసిన కంకర.5. డ్రెయిన్ రాక్.
ట్రోఫీలు, ప్రైజ్ మనీ, ర్యాంకింగ్ పాయింట్లు
మార్చు1953 నుండి విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేస్తున్నారు. మెల్లెరియో డిట్స్ మెల్లర్ అనే ప్రసిద్ధ ప్యారిస్ నగల సంస్థ వీటిని తయారు చేస్తుంది. వాటిని స్వచ్ఛమైన వెండితో, చక్కటి అలంకరణలతో తయారు చేస్తారు. ప్రతి కొత్త సింగిల్స్ విజేత పేరును ట్రోఫీ పీఠంపై రాస్తారు. విజేతలు వారు గెలిచిన ట్రోఫీల కస్టమ్-మేడ్ స్వచ్ఛమైన వెండి ప్రతిరూపాలను అందుకుంటారు.[13] వాటిని సాధారణంగా ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (FFT) అధ్యక్షుడు అందజేస్తారు.
పురుషుల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీని కూపే డెస్ మూస్కెటీర్స్ అంటారు. (ది మస్కటీర్స్ కప్). దీనికి " ఫోర్ మస్కటీర్స్ " గౌరవార్థం పేరు పెట్టారు. ట్రోఫీ బరువు 14 కిలోలు, 40 సెం.మీ ఎత్తు, 19 సెం.మీ వెడల్పు ఉంటుంది.[14] ప్రస్తుత డిజైన్‌ను 1981లో మెల్లెరియో డిట్ మెల్లర్ రూపొందించారు. ప్రతి విజేతకు చిన్న-పరిమాణ ప్రతిరూపం లభిస్తుంది. అసలైనది ఎల్లప్పుడూ FFT వద్దనే ఉంటుంది.[15]
మహిళల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీని 1979 నుండి కూపే సుజానే లెంగ్లెన్ (సుజానే లెంగ్లెన్ కప్) అని పిలుస్తారు. ప్రస్తుత కప్‌ను 1986లో తొలిసారిగా ప్రదానం చేశారు. ఇది, ఆ సమయంలో నైస్ నగరం సుజానే లెంగ్లెన్‌కు అందించిన కప్పుకు ప్రతిరూపం. మ్యూసీ నేషనల్ డు స్పోర్ట్‌కి సుజానే లెంగ్లెన్ కుటుంబం విరాళంగా ఇచ్చిన ఈ ట్రోఫీని 1979 - 1985 మధ్య FFT కాపీ తయారు చేసేవరకు విజేతకు అందించేవారు. ప్రతి విజేత చిన్నప్రతిరూపాన్ని అందుకుంటారు. అసలైనది ఎల్లప్పుడూ FFT వద్దనే ఉంటుంది.[15]
నగదు బహుమతి
మార్చు2022 కోసం, ప్రైజ్ మనీ పూల్ € 43.6 మిలియన్లుగా ప్రకటించారు. 2021 ఎడిషన్ ప్రైజ్ పూల్‌తో పోలిస్తే ఇది 26.87% పెరిగింది.[16]
2022 ఈవెంట్ | విజేత | ఫైనలిస్ట్ | సెమీఫైనల్స్ | క్వార్టర్ ఫైనల్స్ | రౌండ్ 16 | రౌండ్ 32 | రౌండ్ 64 | రౌండ్ 128 | Q3 | Q2 | Q1 |
సింగిల్స్ | €2,200,000 | €1,100,000 | €600,000 | €380,000 | €220,000 | €125,800 | €86,000 | €62,000 | €31,000 | €20,000 | €14,000 |
డబుల్స్ 1 | €580,000 | €290,000 | €146,000 | €79,500 | €42,000 | €25,000 | €15,500 | — | — | — | — |
మిక్స్డ్ డబుల్స్ 1 | €122,000 | €61,000 | €31,000 | €17,500 | €10,000 | €5,000 | — | — | — | — | — |
వీల్ చైర్ సింగిల్స్ | €56,000 | €28,000 | €14,000 | €7,500 | — | — | — | — | — | — | — |
Wheelchair doubles | €16,000 | €8,000 | €5,000 | €3,000 | — | — | — | — | — | — | — |
ప్రస్తుత ఛాంపియన్లు
మార్చు
|
రికార్డులు
మార్చురికార్డు | యుగం. | ఆటగాడు (s) | లెక్కింపు | సంవత్సరాలు. |
---|---|---|---|---|
1891 నుండి పురుషులు | ||||
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | రాఫెల్ నాదల్ | 14 | 2005–2008, 2010–2014, 2017–2020, 2022 |
ఔత్సాహిక యుగం | హెన్రీ కోచెట్ | 4 | 1926, 1928, 1930, 1932 ● ప్రపంచ హార్డ్ కోర్ట్ ఛాంపియన్షిప్స్ 1922 | |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | మాక్స్ డెకుగిస్ | 8 | 1903–1904, 1907–1909, 1912–1914 | |
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | రాఫెల్ నాదల్ | 5 | 2010–2014 |
ఔత్సాహిక యుగం | ఫ్రాంక్ పార్కర్ జారోస్లావ్ డ్రోబ్నీ టోనీ ట్రాబెర్ట్ నికోలా పియట్రాంగేలి |
2 | 1948–1949 1951–1952 1954–1955 1959–1960 | |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | పాల్ ఐమే | 4 | 1897–1900 | |
అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | డేనియల్ నెస్టర్ మాక్స్ మిర్నీ |
4 | 2007 మార్క్ నోలెస్, 2010 నెనాడ్ జిమోంజిక్ తో, 2011,2012 మాక్స్ మిర్నీ. 2005, 2006 జోనాస్ బిజోర్క్మాన్తో, 2011,2012 డేనియల్ నెస్టర్. |
ఔత్సాహిక యుగం | రాయ్ ఎమెర్సన్ | 6 | 1960, 1962లో నీల్ ఫ్రేజర్, 1961లో రాడ్ లావర్, 1963లో మాన్యువల్ సంటాన, 1964లో కెన్ ఫ్లెచర్, 1965లో ఫ్రెడ్ స్టోల్ కలిసి పనిచేశారు. | |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | మాక్స్ డెకుగిస్ | 13 | 1902–1909, 1911–1914, 1920[17] | |
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | డేనియల్ నెస్టర్ | 3 | 2010–2012 |
ఔత్సాహిక యుగం | రాయ్ ఎమెర్సన్ | 6 | 1960–1965 | |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | మారిస్ జెర్మోట్ | 10 | 1906–1914, 1920[17] | |
అత్యధిక మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | జీన్-క్లాడ్ బార్క్లే | 3 | 1968, 1971, 1973 ఫ్రాంకోయిస్ డర్ తో. |
ఔత్సాహిక యుగం | కెన్ ఫ్లెచర్ | 3 | మార్గరెట్ కోర్ట్ 1963-1965. | |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | మాక్స్ డెకుగిస్ | 7 | 1904-1906,1908-1909,1914, 1920 సుజానే లెంగ్లెన్ తో. | |
అత్యధిక ఛాంపియన్షిప్లు (సింగిల్స్, డబుల్స్ & మిక్స్డ్ డబుల్స్) |
ఓపెన్ యుగం | రాఫెల్ నాదల్ | 14 | 2005-2008,2010-2014, <ID3], 2022 (14 సింగిల్స్) |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | మాక్స్ డెకుగిస్ | 28 | 1902-1920 (8 సింగిల్స్, 13 డబుల్స్, 7 మిక్స్డ్ | |
1897 నుండి మహిళలు | ||||
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | క్రిస్ ఎవర్ట్ | 7 | 1974–1975, 1979–1980, 1983, 1985–1986 |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | సుజానే లెంగ్లెన్ | 6 | 1920-1923,1925-1926 ● వరల్డ్ హార్డ్ కోర్ట్ ఛాంపియన్షిప్స్ః 1914,1921-23 | |
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | మోనికా సెలెస్ జస్టిన్ హెనిన్ |
3 | 1990–1992 2005–2007 |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | జీన్ మాథే సుజాన్ లెంగ్లెన్ సుజానే లెంగ్లెన్ |
4 | 1909–1912 1920–1923 | |
అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | / మార్టినా నవ్రతిలోవా | 7 | 1975లో క్రిస్ ఎవర్ట్ తో, 1982లో అన్నే స్మిత్, 1987,1988లో పామ్ ష్రివర్ తో, 1986లో ఆండ్రియా టెమెస్వారి. |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | సిమోన్ మాథ్యూ | 6 | 1933, 1934లో ఎలిజబెత్ ర్యాన్, 1938లో బిల్లీ యార్క్ తో, 1939లో జాడ్విగా జెడ్రెజోవ్స్కా. | |
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | మార్టినా నవ్రతిలోవా గిగి ఫెర్నాండెజ్ |
5 | 1984-1985, <id2 a="" href="./Pam_Shriver" rel="mw:WikiLink">పామ్ ష్రివర్, 1986 ఆండ్రియా </id2> |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | ఫ్రాంకోయిస్ డర్ | 5 | 1967–1971 | |
అత్యధిక మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ | ఓపెన్ యుగం | ఫ్రాంకోయిస్ డర్ | 3 | 1968, 1971, 1973లలో జీన్-క్లాడ్ బార్క్లే కలిసి. |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | సుజానే లెంగ్లెన్ | 7 | 1914, 1920, మాక్స్ డెకుగిస్, 1921-1923,1925,1926, జాక్వెస్ బ్రగ్నాన్. | |
అత్యధిక ఛాంపియన్షిప్లు (సింగిల్స్, డబుల్స్ & మిక్స్డ్ డబుల్స్) |
ఓపెన్ యుగం | / మార్టినా నవ్రతిలోవా | 11 | 1974-1988 (2 సింగిల్స్, 7 డబుల్స్, 2 మిక్స్డ్ |
ఫ్రెంచ్ ఛాంపియన్షిప్స్ * | సుజానే లెంగ్లెన్ | 15 | 1919-1926 (6 సింగిల్స్, 2 డబుల్స్, 7 మిక్స్డ్ | |
వివిధ | ||||
సీడ్ చేయని ఛాంపియన్లు | పురుషులు. | మాట్స్ విలాండర్ గుస్తావో కుర్టెన్ గాస్టన్ గౌడియో |
1982 1997 2004 | |
మహిళలు | మార్గరెట్ స్క్రివెన్ జెలెనా ఒస్టాపెంకో ఇగా స్విటెక్ బార్బోరా క్రెజికోవా |
1933 2017 2020 2021 | ||
అతి పిన్న వయస్కుడైన సింగిల్స్ విజేత | పురుషులు. | మైఖేల్ చాంగ్ | 17 సంవత్సరాల 3 నెలలు (1989) | |
మహిళలు | మోనికా సెలెస్ | 16 సంవత్సరాల 6 నెలలు (1990) | ||
అత్యంత పాత సింగిల్స్ ఛాంపియన్ | పురుషులు. | నోవాక్ జొకోవిచ్ | 36 సంవత్సరాల 2023 రోజులు (23) | |
మహిళలు | జుజ్జా కోర్మోక్సీ | 33 సంవత్సరాల 10 నెలలు (1958) |
ఇవి కూడా చూడండి
మార్చుగమనికలు
మార్చు- ↑ Except Court Philippe Chatrier during rain delay.
- ↑ In the main draws, there are 128 singles players (S) and 64 doubles teams (D), and there are 128 and 16 entrants in the respective qualifying (Q) draws.
- ↑ Usually the tournament is held in late May to early June. However, there have been exceptions:
- The 1946 and 1947 tournaments were held in July after Wimbledon following the aftermath of World War II;
- 2020 was held in late September after the US Open following the suspension of ATP and WTA Tours from mid-March to August due to the COVID-19 pandemic;
- 2021 it was postponed by one week also due to the pandemic after virus cases rose in France in March of that year.
మూలాలు
మార్చు- ↑ "Roland-Garros 2023: Prize money revealed". Roland-Garros Official Website. 12 May 2023.
- ↑ Gershkovich, Evan (10 June 2017). "Who Was Roland Garros? The Fighter Pilot Behind the French Open". The New York Times. Retrieved 25 January 2022.
- ↑ Clarey, Christopher (30 June 2001). "Change Seems Essential to Escape Extinction: Wimbledon: World's Most Loved Dinosaur". International Herald Tribune. Archived from the original on 16 October 2007. Retrieved 20 July 2007.
- ↑ Natekar, Gaurav (24 May 2021). "French Open 2021: Why Roland Garros is the toughest Grand Slam to win?". First Post. Retrieved 25 January 2022.
- ↑ Clarke, Liz (15 May 2020). "The French Open, 'unique in all the world', demands a dancer's agility and an iron will". The Washington Post. Retrieved 25 January 2022.
- ↑ Shine, Ossian (25 May 2017). "Roland Garros now toughest slam of all, says former champ". Reuters. Retrieved 25 January 2022.
- ↑ Dietz, David (12 May 2011). "French Open: Why Winning at Roland Garros Is the Pinnacle of Sports". Bleacher Report. Retrieved 25 January 2022.
- ↑ Clarey, Christopher (26 May 2006). "In a year of change at Roland Garros, the winners may stay the same". International Herald Tribune. Archived from the original on 16 October 2007. Retrieved 8 August 2007.
- ↑ "Clay, the hallowed red dirt". Roland-Garros. Retrieved 7 June 2021.
- ↑ "Why is the French Open played on clay?". 19 May 2022. Retrieved 23 May 2022.
- ↑ "The French Open for Dummies". Bleacher Report. 22 May 2009. Retrieved 25 January 2022.
- ↑ Atkin, Ronald. "Wimbledon Legends – Bjorn Borg". Wimbledon.com. Archived from the original on 11 February 2012. Retrieved 4 February 2012.
- ↑ "An A to Z of Roland Garros". rolandgarros.com. Fédération Française de Tennis (FFT). Archived from the original on 2 April 2015.
- ↑ Absalon, Julien (26 June 2014). "Pourquoi les vainqueurs ne repartent pas avec les vrais trophées". Le Figaro (in ఫ్రెంచ్). Paris. Retrieved 3 June 2021.
- ↑ 15.0 15.1 "THE TROPHIES". rolandgarros.com. Paris. p. en-US. Retrieved 3 June 2021.
- ↑ "French Open 2022 Prize Money". Perfect Tennis. 20 May 2022. Retrieved 22 May 2022.
- ↑ 17.0 17.1 "French Open winners". Roland Garros. Retrieved 2 February 2015.