ప్రేమ సింహాసనం

ప్రేమ సింహాసనం 1981 లో విడుదలైన సినిమా. దీనిని తిరుపతి ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ [1] పై కె. విద్యాసాగర్ నిర్మించాడు. బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించాడు.[2] ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రధారులు[3] సంగీతాన్ని చక్రవర్తి అందించాడు.[4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది.

ప్రేమ సింహాసనం
(1981 తెలుగు సినిమా)
Prema Simhasanam poster.jpg
దర్శకత్వం బీరం మస్తాన్ రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
రతి,
నూతన్ ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ తిరుపతి ఇంటర్నేషనల్
భాష తెలుగు

కథసవరించు

జమీందారు ఆనంద వర్మ (ఎన్.టి.రామారావు) రాజేశ్వరి (మంజు భార్గవి) అనే అమాయక మహిళను బహిరంగంగా వేలంపాటలో అమ్మకానికి పెట్టడం చూస్తాడు. ఆమెను అగౌరవం నుండి కాపాడటానికి ఆనందవర్మ ఆమెను వివాహం చేసుకుంటాడు. అతని తల్లి అనసూయా దేవి (ఎస్. వరలక్ష్మి) ఈ పెళ్ళిని వ్యతిరేకిస్తుంది. ఆమె మేనేజరు కామరాజు (నూతన్ ప్రసాద్) రెచ్చగొట్టడంతో ఆమె వారిని ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. ఆనందవర్మ రాజేశ్వరి గ్రామంలో నివసించడం మొదలుపెడతారు. కొంతకాలం తర్వాత రాజేశ్వరి గర్భవతి అవుతుంది. ఒక రోజు రాజేశ్వరి ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు గమనించి, ఆమె ఆనంద వర్మ మామయ్య కుమార్తె లక్ష్మి (కెఆర్ విజయ) అని తెలుసుకుంటుంది. లక్ష్మికి చిన్నప్పటి నుండి ఆనంద్‌ అంటే ప్రేమ. అతడు రాజేశ్వరిని పెళ్ళి చేసుకున్నందున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది విన్న రాజేశ్వరి, తాను ఆమె కోరిక తీరుస్తానని లక్ష్మికి హామీ ఇస్తుంది. లక్ష్మిని వివాహం చేసుకోమని ఆమె ఆనంద్ ను ఒత్తిడీ చేస్తుంది. ఒక మగ అబ్బాయికి జన్మనిచ్చిన వెంటనే మరణిస్తుంది. లక్ష్మి ఆ శిశువును తన స్వంత బిడ్డ లాగే చూసుకుంటుంది. నిరాశ చెందిన ఆనంద్ ను ఓదారుస్తుంది. చివరికి లక్ష్మి కూడా ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. మేనేజర్ కామరాజు పరిస్థితిని ఉపయోగించుకుని, రాజేశ్వరి కొడుకును దూరం చేయమని అనుసుయాదేవిని రెచ్చగొడతాడు. బిడ్డను చంపడానికి కామరాజు తన అనుచరులను పంపుతాడు. ఆనంద్ తన కొడుకును కాపాడటానికి ప్రయత్నిస్తాడు కాని గూండాల చేతిలో మరణిస్తాడు. పిల్లవాడిని ఆనంద్ యొక్క నమ్మకమైన సేవకుడు సింహాచలం (హేమ సుందర్) రక్షిస్తాడు. సింహాచలం పిల్లవాడిని పెంచుతాడు. రాజా (మళ్ళీ ఎన్.టి.రామారావు) అనే పిల్లవాడు పాప్ సింగర్‌గా ఎదిగి ప్రేమ (రతి అగ్నిహోత్రి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కామరాజు, అతని కుమారుడు రామానందం (సత్యనారాయణ) ల కుతంత్రాల కారణంగా లక్ష్మి కుమారుడు కళ్యాణ్ (మోహన్ బాబు) అల్లరిచిల్లరగా పెరుగుతాడు. కళ్యాణ్ ను కామరాజు నుండి దూరంగా ఉంచడం ద్వారా లక్ష్మి అతణ్ణి సంస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అంచేత, కామరాజు, రామానందం ఆమెను చంపాలని యోచిస్తారు. రాజా ఆమెను రక్షిస్తాడు. ఆమె అతన్ని తన సవతి కుమారుడిగా గుర్తిస్తుంది. సింహాచలం అతనికి మొత్తం కథ చెబుతాడు. ఇప్పుడు, రాజా తన శత్రువులను నాశనం చేసి తన కుటుంబాన్ని రక్షించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అది సాధించి ప్రేమను పెళ్ళి చేసుకోవడమే తదుపరి కథ

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

చక్రవర్తి సంగీతం సమకూర్చారు. AVM ఆడియో కంపెనీ సంగీతాన్ని విడుదల చేసింది.

క్ర. సం పాట సాహిత్యం గాయనీ గాయకులు నిడివి
1 "హరి ఓం గోవింద" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:11
2 "అరివీరా భాయంకర" Aarudhra ఎస్పీ బాలు, పి.సుశీలా 4:16
3 "లాలమ్మ లాలి" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీలా 3:37
4 "జెజమ్మ చెప్పింధి" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీలా 4:20
5 "చందమామ కొండెకింధి" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీలా 4:30
6 "ఇధి ప్రేమా సింహాసనమ్" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, పి.సుశీలా 5:34

మూలాలుసవరించు

  1. Prema Simhasanam (Banner). Chitr.com.
  2. Prema Simhasanam (Direction). Filmiclub.
  3. Prema Simhasanam (Cast & Crew). gomolo.com.
  4. Prema Simhasanam (Review). The Cine Bay.