ప్రొఫిల్మ్ (ప్రొగ్రెసివ్ ఫిల్మ్ అసోసియేషన్)
1970 లో నెల్లూరు వాసి తిక్కవరపు పఠాభిరామరెడ్డి కన్నడ భాషలో సంస్కార చిత్రం తీశాడు. దానికి జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా స్వర్ణపతకం లభించి, దర్శకుడు పట్టాభిరామరెడ్డికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. నెల్లూరు వారికి మాత్రం ఆ సినిమా చూచే అవకాశం లభించలేదు. 1973 ఆగస్టులో ఆర్ట్ ఫిల్మ్స్ అంటే పడిచచ్చే కొందరు యువకులు నెల్లూరు టౌన్ హాల్ ఆవరణలో సమావేశమయి నెల్లూరులో ఫిల్మ్ సొసైటి నెలకొల్పాలని సంకల్పించారు. అప్పటికే విజయవాడ , [[హైదరాబాదు|, తెనాలిలలో ఫిల్మ్ సొసైటీలు ఏర్పడి, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొటీస్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా పనిచేస్తూ కళాత్మక చిత్రాలు ప్రదర్శిస్తున్నాయి. నెల్లూరు ఫిల్మ్ సొసైటి నెలకొల్పాలని సంకల్పించారు గానీ ఆరోజుల్లో నెల్లూరులో ప్రోగ్రెస్ పదం లేకుండా ఏ సంస్థ స్థాపించరు. ఆ ధోరణిలోనే ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అసోసియేషన్ పేరుతో ఏర్పడింది. షుమారు డజనుమంది కార్యవర్గసభ్యలు, ఒక Organising Secretary, ఒక Finance Secretaryని కార్యవర్గ సభ్యలు ఎంపిక చేసుకుంటారు కమిటి సభ్యులనుంచి. మందపాటి పట్టాభిరామరెడ్డి, పెన్నేపల్లి గోపాలకృష్ణ, వి.సంజీవరావు, కెంచం పురుషోత్తమరావు, న్యాయవాది బుజ్జిరెడ్డి, మాచవోలు శివరామ ప్రసాద్, మరుపూరు తరుణేందు శేఖరరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, డాక్టర్ సి.పి.శాస్త్రి, కృష్ణారెడ్డి, ఆర్టిస్ట్ బాబు, రెడ్ రోజ్ టేలర్ నాగరాజు, కె.పెంచలయ్య, సుబ్బారెడ్డి తదితర సభ్యులతో కమిటి ఏర్పడింది, ఏడాదికి పది రూపాయలు సభ్యత్వ రుసుంగా నిర్ణయించారు. షుమారు 200 మంది కళాశాల అధ్యాపకులు, బ్యాంక్ ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, తదితరులు సభ్యులుగా చేరారు. నెలనెలా ఒక సినిమా అయినా ప్రదర్శించాలని నిర్ణయం చేశారు. 1984 లో సంస్థ మూతపడే సమయానికి సంవత్సరం చందా 40 రూపాయాలుండేది.
తిక్కవరపు పట్టాభిరామరెడ్డి సంస్కార చిత్రంతో సంస్థప్రదర్శనలు ప్రారంభించాలని తలపెట్టింది, ఆయనను కోరగానే ఉచితంగా ఫిల్మ్ పంపాడు. ఆరోజుల్లో నెల్లూరులో అత్యంత ఆధునిక సినిమాహాలు అని ప్రసిద్ధికెక్కిన "శ్రీరాం ఎయిర్ కండిషన్" హాలులో 1974 జనవరి 6 ఉదయం పదిగంటలకు తొలి ప్రదర్శన ఏర్పాటయింది. జిల్లా అధికారులు, నెల్లూరులో పఠాభి తాలూకు బంధువులు, ప్రొఫిల్మ్ సభ్యులు అందరూ హాజరయ్యారు. కన్నడ సినిమా కనుక సినిమా వివరాలు అన్నీ ముందుగానే కరపత్రంలో ముద్రించి సభ్యులకు పంచారు. ప్రదర్శన విజయవంతమయింది.
అటుతర్వాత నెల నెల భువన్ షోమ్, ప్రతిద్వంది, దిక్కట్ర పార్వతి, 35 ఎం ఎం సినిమాలు విజయవంతంగా ప్రదర్శించారు. దిక్కట్ర పార్వతి దర్శకులు సింగీతం శ్రీనివాసరావును ఈ సందర్భంగా సమ్మానించ్చారు. చిల్లర దేవుళ్ళు ప్రదర్శించి, దర్శకులు మాధవరావును సమ్మానించారు. షుమారు 350 మంది సభ్యులయ్యారు. ఏమయినా ప్రతి ప్రదర్శనకు 250రూపాయలు వినోదం పన్ను చెల్లించడం కష్టమయింది. ప్రొఫిల్మ్ స్పూర్తితో కావలి, ఒంగోలు, తిరుపతి వంటి చోట్ల ఫిల్మ్ సొసయిటీలు ప్రారంభ మయ్యాయి.
ఏడాది తర్వాత ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసయిటీస్ ఆఫ్ ఇండియా సభ్యత్వం, పూణె ఫిల్మ్ Archive సభ్యత్వం లభించాయి. 35 mm తో పాటుగా 16 mm సినిమాలు ప్రదర్శనకు అందుబాటులోకి రావడంతో వాటిని ప్రదర్శించవలసి వచ్చింది. ISCUS, గ్రంథాలయ సంస్థ, ఆరోగ్యశాఖ వారి సహకారంmతో గొప్ప 16 mm కళాఖండాలు సభ్యులకు ప్రదర్శించారు. చిన్న పిల్లలకు కొన్ని 16 mm చిత్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
1978 ఆగుస్ట్ 13-15 తేదీలలో Archives సహకారంతో స్వీడిష్ దర్శకుడు ఇంగమర్ బెర్గ్ మన్ చిత్రోత్సవాన్ని రెగ్యులర్ సినిమా హాల్లో Wild Straberries, Silence, The Seventh Seal, The Virgin Spring సినిమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంలో విశేష సంచికను ప్రచురించారు. అలాగే మెక్సికన్ ఫిల్మ్ ఉత్సవాన్ని నిర్వహించారు. Madras Film Instituteలో బోధించే కె.ఎస్. శ్రీనివాసన్, రేండర్ గై వంటి వారిచేత సభ్యులకు Holywood, భారతీయ చిత్రాలమీద ఉపన్యాసాలు ఇప్పించారు.
ప్రొఫిల్మ్ చరిత్రలో స్వర్ణాధ్యాయం పూణె నేషనల్ ఫిల్మ్ ఆర్కీవ్, పూణె T.V. Institute, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ Societies of India సహకారంతో 1980 Dec 6th నుంచి 16వ తారీకకు వరకు పదిరోజులు Film Appreciation Course నెల్లూరులో నిర్వహించడం.ఈ కోర్సుకు దక్షిణ భారత దేశ ఫిల్మ్ సోసయిటీల నుంచి అనేకమంది, నెల్లూరు ప్రొఫిల్మ్ సభ్యులు-మొత్తం నూరు మంది కోర్సుకు హాజరయ్యాయరు. దీనికన్నా ముందే ప్రొఫిల్మ్ సభ్యులు ఎన్. చంద్రమోహనరెడ్డి 1979 వేసవిలో పూణెలో ఆరువారాల కోర్సు చేశాడు. Organising Secretary Dr కాళిదాసు పురుషోత్తం 1979 లో మద్రాసు Film Institute 15 రోజులపాటు నిర్వహించిన కోర్సుకు హాజరయ్యాడు. 1980 Decలో నెల్లూరులో జరిగిన Film Appreciation Course కు Pune Film and T.V Institute నుంచి ప్రొఫెసర్ సతీశ్ బహదూర్, Archive Curator పి.కె.నాయర్, డాక్టర్ శ్యామలా వనార్సీ అధ్యాపకులుగా వ్యవహరించారు. కోర్సుకు హాజరయిన వారికి నెల్లూరులో ఉండడానికి, ఇతర సౌకర్యాలు ఏర్పాటు ప్రొఫిల్మ్ చేసింది. ఉదయం 9.30 కి కొర్సు మొదలయి, ఒంటిగంటకు భోజన విరామం. మరల 2.30 నుంచి 5.30 వరకు కోర్సు కొనసాగేది. మధ్య మధ్య 16 mm సినిమా ప్రదర్శనలు. సాయంత్రం 6.30 నుంచి ఒక కళాఖండం పద్రర్శన, రాత్రి భోజనం తర్వాత మరొక సినిమా. ప్రతి ప్రదర్శనకు ముందు సినిమా గురించి సుదీర్ఘంగా వివరణ ఉండేది.
పగలు కొర్సులో సినిమా చరిత్ర, అంతర్జాతీయ సినిమా గురించి పాఠాలు. సత్యజిత్ రే పథేర్ పాంచాలి,బెర్గ్ మన్ వైల్డ్ స్ట్రా బెర్రీస్ సినిమాలు అధ్యయనానికి ఎంపికచేశారు. కోర్సు పదిరోజులు తీరిక లేనంతగా అధ్యయనం. కోర్సు విజయవంతంగా ముగిసింది.
1980 వేసవిలో ప్రొఫిల్మ్ Organising Secretary కాళిదాసు పురుషోత్తం పూణెలో జరిగిన ఆరువారాల Film Appreciation Course కు హాజరయ్యాడు. మరొక మాటు ఫిల్మ్ Institute ఆహ్వానం మీద విశ్వవిద్యాలయాల్లో Film Appreciation పాఠ్యాంశంగా నిర్ణయించను అవసరమయిన సిలబసు తయారు చేయను కమిటీ సభ్యుడుగా పూణెలో పదిరోజులున్నాడు. ప్రొఫిల్మ్ కు దక్కిన విశేష గౌరవాలు ఇవి.
టి.వి అందరి ఇళ్ళల్లోకి ప్రవేశించడంతో ఫిల్మ్ సొసైటీల ప్రదర్శనలకు హాజరయే సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గడం, ప్రభుత్వం వినోదపన్ను విధానంలో మార్పులు రావడంతో ఫిల్మ్ Societies కొనసాగలేక పోయాయి. నెల్లూరులో ఫిల్మ్ సొసైటి కార్యక్రమాలు 1984 మధ్యభాగం వరకు సాగి, సొసైటి మూతపడినా, నెల్లూరు పురజనుల సినిమా కళాభిరుచి ఎంతో పెరిగింది.
మూలాలు
మార్చు1. బెర్గ్ మన్ చిత్రోత్సవం ప్రొఫిల్మ్ విశేష సంచిక, భారతి ప్రింటర్స్, నెల్లూరు, 1978.
2. Film Appreciation Course, Profilm Nellore Special Issue, Editors : Dr Kalidasu Purushotham and Dr Machavolu Sivaramaprasad, Saradhi Printers, Nellore,1980.
3. Jameen Ryot, Telugu Weekly issues 5-12-1980, 12-12-1980 and 26th issue, page 9 and 11 an article on the Film Appreciation course held in Nellore, titled "సినిమాలు చూచి చెడిపోతున్నారు అన్నవారికి.. "