ప్రోలయ వేమారెడ్డి

రెడ్డి రాజవంశం యొక్క మొదటి రాజు ప్రోలయ వేమారెడ్డి. వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్య పాలన చేశాడు. వీరి రాజధాని మొదట అద్దంకి. తరువాత కొండవీడు. కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి స్వతంత్రంగా కందుకూరు మొదలు గోదావరీ తీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు. కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. తీరాంధ్రప్రజలను తురుష్కదండయాత్రల నుండి కాపాడిన వారిలో వేమారెడ్డి, అతని సోదరుడు మల్లారెడ్డి వారి మంత్రులైన దేశపాండ్యులు ముఖ్యులు.

వేమారెడ్డి రైతులు, పశువుల కాపరులతో ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, గెరిల్లా యుద్ధం అనుసరించారు. ముస్లిం సైన్యం దాడి చేసినప్పుడు వారి నీటి సరఫరా మార్గాలను మురుగునీటితో కలుషితమయ్యేలా చేయమని వేమారెడ్డి అన్నారు. ద్వారసముద్ర యొక్క వీర బల్లల III (హొయసల సామ్రాజ్యం యొక్క చివరి గొప్ప రాజు) వేమారెడ్డి, కాపయ నాయకుల యొక్క కూటమి సహాయం పొందెను. తుగ్లక్ సైన్యం యొక్క జనరల్ ను వేమారెడ్డి వెంబడించాడు, మాలిక్ మక్బల్ వరంగల్ కోటకు చేరెను, అప్పుడు కాపయ నాయకుడు దండెత్తి, చేజిక్కించుకున్నారు.

ప్రోలయ అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు ఎర్రన చేసిన రచనలగురించి ఏ విధమైన వివరాలూ లేవు. ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.

1353లో ప్రోలయ వేమారెడ్డి మరణించాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

రెడ్డి రాజులు

బయటి లింకులు

మార్చు