ఫరీద్‌కోట్

పంజాబు లోని నగరం

ఫరీద్‌కోట్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని ఒక చారిత్రిక నగరం. ఇది ఫరీద్‌కోట్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఫరీద్‌కోట్, భటిండా, మాన్సా జిల్లాలను కలిపి ఏర్పరచిన ఫరీద్‌కోట్ డివిజను ప్రధాన కార్యాలయం ఫరీద్‌కోట్ లోనే ఉంది. ఫరీద్‌కోట్ శాసనసభ స్థానానికి ఇది కేంద్రం. ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా ఫరీద్‌కోట్ కేంద్రం.

ఫరీద్‌కోట్
నగరం
ప్రభుత్వ బ్రిజీంద్ర కళాశాల ప్రధాన భవనం, ఫరీద్‌కోట్
ప్రభుత్వ బ్రిజీంద్ర కళాశాల ప్రధాన భవనం, ఫరీద్‌కోట్
పటం
ఫరీద్‌కోట్ is located in Punjab
ఫరీద్‌కోట్
ఫరీద్‌కోట్
ఫరీద్‌కోట్ is located in India
ఫరీద్‌కోట్
ఫరీద్‌కోట్
Coordinates: 30°40′N 74°46′E / 30.67°N 74.76°E / 30.67; 74.76
దేశంభారతదేశం
రాష్ట్రంపంజాబ్
జిల్లాఫరీద్‌కోట్
Founded byరాజా మోకల్సి
Government
 • Typeమునిసిపల్ కౌన్సిల్
విస్తీర్ణం
 • Total18.14 కి.మీ2 (7.00 చ. మై)
Elevation
196 మీ (643 అ.)
జనాభా
 (2011)
 • Total87,695
Demonym(s)ఫరీద్‌కోటియన్, ఫరీద్‌కోటియా
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
151203
టెలిఫోన్ కోడ్+91-1639
Vehicle registrationPB-04
లింగ నిష్పత్తి1000/890 ♂/♀

శబ్దవ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

13 వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు బాబా ఫరీద్ పేరిట నగరానికి ఈ పేరు పెట్టారు. పాకిస్థాన్ లోని పాక్ పట్టన్‌లో ఈ సాధువుకు ఆలయం ఉంది. రాజస్థాన్‌లోని భట్నైర్ భట్టి చీఫ్ రాయ్ ముంజ్ మనవడు రాజా మోకల్సి ఫరీద్‌కోట్ పట్టణాన్ని మొకల్హర్‌ పేరుతో స్థాపించాడు. బాబా ఫరీద్ పట్టణాన్ని సందర్శించిన తరువాత రాజా మొకల్హార్ ను ఫరీద్‌కోట్ గా మార్చారని ప్రతీతి. మోకల్సి వారసులైన జైర్సీ, వైర్సీల పాలనలో ఇది రాజధానిగా ఉండేది.

చరిత్ర

మార్చు

చారిత్రిక కిలా ముబారక్ కోట బాబా ఫరీద్ కాలం నుండే ఉంది. అయితే, ఒక సంస్థానంగా ఈ ఆధునిక నగరానికి పునాది వేసినది మాత్రం 1763 లో. ఈ నగరం 1947 వరకు బ్రిటిష్ ఆధిపత్యం క్రింద కొనసాగింది. స్వాతంత్ర్యానికి ముందు, జిల్లాలో ఎక్కువ భాగం ఫరీద్‌కోట్ మహారాజా పాలనలో ఉండేది. తరువాత ఇది 1948 లో పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్‌యు) లో భాగమైంది. ఫరీద్‌కోట్ 1972 ఆగస్టు 7 న పూర్వ భటిండా జిల్లా (ఫరీద్‌కోట్ తహసీలు), ఫిరోజ్‌పూర్ జిల్లా (మోగా, ముక్త్‌సర్ తహసీళ్ళు) ప్రాంతాలను కలిపి ఫరీద్‌కోట్ జిల్లాగా ఏర్పరచారు. మళ్ళీ 1995 నవంబరులో ఫరీద్‌కోట్ జిల్లాను, ఫరీద్‌కోట్, మోగా, ముక్త్‌సర్ అనే జిల్లాలుగా మూడు ముక్కలు చేసారు.

పాలక సంస్థ

మార్చు

ఫరీద్‌కోట్ మున్సిపల్ కౌన్సిల్ 1948 సంవత్సరంలో ఆవిర్భవించింది. ఇప్పుడు దీనికి క్లాస్-I హోదా ఉంది. 2019 లో కౌన్సిల్ అధ్యక్షుడిగా అమర్ కుమార్ బిన్ను ఎన్నికయ్యాడు. 2017 లో పట్టణం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెసు పార్టీకి చెందిన కుషాల్దీప్ సింగ్ ధిల్లాన్.

రవాణా

మార్చు

ఫరీద్‌కోట్ నగరం జాతీయ రహదారి 54 ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. నగరంలో ఉన్న ఫరీద్‌కోట్ రైల్వే స్టేషన్ భటిండా - ఫిరోజ్‌పూర్ మార్గంలో ఉంది. చాలా రైళ్లు ఫరీద్‌కోట్‌ను పంజాబ్ నగరాలకు, ఇతర రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాలకూ కలుపుతాయి. సమీప విమానాశ్రయం, శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం అమృత్‌సర్ లో ఉంది.[1]

ఈ నగరంలో బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది, ఇది పంజాబ్ లోని ప్రధానమైన వైద్య విశ్వవిద్యాలయం. గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ను 1973 లో స్థాపించారు. దశ్మేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ & డెంటల్ సైన్సెస్ నగరంలోని మరొక వైద్య కళాశాల. ప్రభుత్వ బ్రజీంద్ర కాలేజీని 1942 లో ఫరీద్‌కోట్ రాజవంశీకులు స్థాపించారు. దశ్మేష్ పబ్లిక్ స్కూల్, బాబా ఫరీద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్, మౌంట్ లిటెరా జీ స్కూల్, దశ్మేష్ గ్లోబల్ స్కూల్, బాబా ఫరీద్ లా కాలేజ్, ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్, బల్బీర్ స్కూల్, డాక్టర్ మొహిందర్ బ్రార్ సాంబి ప్రభుత్వ బాలికల సీనియర్ పాఠశాల వంటి అనేక ఇతర విద్యా సంస్థలు పట్టణాంలో ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ, న్యూ మోడల్ సేన్. సెకండ్ స్కూల్ కూడా పట్టణంలో ఉన్నాయి. పట్టణంలో ఆదేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది.

నగరంలో 96 ప్రైవేట్ ఆంగ్ల భాషా పాఠశాలలు ఉన్నాయి.[2]

ఆసుపత్రులు

మార్చు
  • గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజీ, ఫరీద్‌కోట్
  • సంత్ బాబా కర్నైల్ దాస్ మెడికల్ ఛారిటబుల్ హాస్పిటల్, వివేక్ ఆశ్రమం
  • దశ్మేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ & డెంటల్ సైన్సెస్, ఫరీద్‌కోట్
  • సివిల్ హాస్పిటల్, ఫరీద్‌కోట్
  • మధు నర్సింగ్ హోమ్, ఫరీద్‌కోట్
  • బల్బీర్ హాస్పిటల్, ఫరీద్‌కోట్
  • ప్రీత్ హాస్పిటల్, ఫరీద్‌కోట్
  • సుఖ్మని ఆసుపత్రి, గుండె సంరక్షణ కేంద్రం

పట్టణ ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "How to reach Faridkot". Faridkot district official website. Retrieved 25 August 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Salopek, Paul (12 July 2018). "Walking Through a Youthful Exodus in India". National Geographic Society. Faridcot has a battered three-star hotel called the Trump Plaza and 96 private English language schools.