ఫరూక్ హుస్సేన్ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[2]

ఫరూక్ హుస్సేన్
ఫరూక్ హుస్సేన్


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 మే 28 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1955-09-06) 1955 సెప్టెంబరు 6 (వయసు 69)
సిద్ధిపేట, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మహ్మద్ హుస్సేన్, మహమూదా బాను
జీవిత భాగస్వామి ఫర్హీన్ బాను
సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు

జీవిత విషయాలు

మార్చు

ఫరూక్ హుస్సేన్ 1955, సెప్టెంబరు 6న మహ్మద్ హుస్సేన్, మహమూదా బాను దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించాడు.[3] బిఏ వరకు చదువుకున్నాడు.[4]

వ్యక్తిగత వివరాలు

మార్చు

ఫరూక్ హుస్సేన్ కు ఫర్హీన్ బానుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.

రాజకీయరంగం

మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2011 మే 28 నుండి 2014 జూన్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జూన్ 2 నుండి 2017 మే 27 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5] 2017, మే 28న టిఆర్ఎస్ పార్టీ తరపున గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] గతంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కూడా పనిచేశాడు.

ఇతర వివరాలు

మార్చు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ మొదలైన దేశాలలో పర్యటించాడు.

మూలాలు

మార్చు
  1. admin (2020-10-02). "Telangana Nominated MLC Farooq Hussain". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-04.
  2. 2.0 2.1 Telangana Legislature, MLCs (3 August 2021). "Members Information - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 3 August 2021. Retrieved 4 August 2021.
  3. "Farooq Hussain | MLC | Bharathnagar | Siddipet | Telangana | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-30. Retrieved 2021-08-04.
  4. తెలంగాణ శాసన మండలి, ఎమ్మెల్సీ (4 August 2021). "తెలంగాణ శాసన మండలి సభ్యులు". www.telanganalegislature.org.in. Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
  5. Reporter, Staff (2016-04-26). "Congress MLC Farooq Hussain joins TRS". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-04.