లాల్ కున్వర్
ఇంతియాజ్ మహల్ (ఫార్సీ: امتیاز محل; ప్రత్యేకత కలిగొన ప్రదేశం.[1] లాల్ కున్వర్ జన్మస్థలం. (హిందీ: लाल कुंवर). ఆమె మొఘల్ చక్రవర్తినిగా ప్రత్యేకత కలిగిన మహిళ. ఆమె జహందర్ షాను వివాహం చేసుకుంది. ఆమె జహందర్ షాను వివాహం చేసుకోవడానికి ముందుగా నర్తకిగా ఉండేది. ఆమె తన అద్భుత నాట్య ప్రతిభతో మొఘల్ చక్రవర్తిని ప్రభావితం చేసింది. ఆమె మొఘల్ చక్రర్తిని నీచమైన వినోదాలవైపు మళ్ళించి ప్రోత్సహించి చివరికి అది మొఘల్ చక్రవర్తి అవమానకరమైన పతనానికి దారితిసేలా చేసింది.ఆమె మొఘల్ చక్రవర్తి జహందర్ షా అభిమాన స్త్రీగా వ్యవహరించింది. చరిత్రపరిశోధలుకు ఆమెను " లాల్ కున్వర్ " అని పేర్కొన్నారు.[2]
Lal Kunwar लाल कुंवर | |
---|---|
Imtiaz Mahal (امتیاز محل) | |
Empress consort of Mughal Empire | |
Tenure | 27 February 1712 - 12 February 1713 |
జననం | Lal Kunwar लाल कुंवर 17th century |
మరణం | 18th century |
Spouse | Jahandar Shah |
రాజవంశం | Timurid (by marriage) |
తండ్రి | Khasusiyat Khan |
మతం | Islam |
పూర్వీకులు, కుటుంబం
మార్చుఆమె గాయకురాలిగా, నర్తకిగా (నాచ్ గర్ల్ లేక కంచని) గా ప్రాబల్యత కలిగి ఉండేది. ఆమెకు సభతో ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన స్త్రీ కూడా కాదు. అయినప్పటికీ జహందర్ షాకు అభిమానపాత్రురాలైంది. ఆమె తండ్రి ఖసుసియత్ ఖాన్ అక్బర్ కాలంలో ప్రాముఖ్యత సంతరించుకున్న గాయకుడు తాన్‌సేన్ సంతతికి చెందిన వాడని భావించబడుతుంది.[2]
రాజకీయ ప్రభావం
మార్చుజహందర్ భార్యగా రాణి అంతస్తుతో ఆమె తన కుటుంబ సభ్యులకు ఉన్నత స్థానాలను కట్టబెట్టింది. ఆమె కుటుంబ సభ్యులకు బిరుదులు, ముంసుబ్దారి విధానంలో భూములు విలువైన ఆభరణాలు ఇవ్వబడ్డాయి. ఆమె ముగ్గురు సోదరులకు నియామత్ ఖాన్, నాందార్ ఖాన్, ఖంజద్ ఖాన్ అనే బిరుదులు ఇవ్వబడ్డాయి. కలావంత్ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులకు సమున్నత అంతస్తు ఇవ్వబడింది. ఈ చర్యలు మిగిలిన సభాప్రముఖులకు ఆగ్రహం కలిగించాయి. వారు వారి అవకాశాలను దిగువతరగతి కుటుంబానికి చెందిన వారు దోచుకుంటున్నారని భావించారు. అలాంటి వారిలో ఒకరైన వజీరు జుల్ఫిక్వార్ ఖాన్ ఆమె సోదరుడు ఖుషాల్ ఖాన్ ముల్తాన్ సుబేదార్ కాకుండా అడ్డగించడానికి ఆడపిల్లమీద దౌర్జన్యం చేసాడన్న నేరారోణతో ఖైదు చేసాడు.[1] లాల్ కున్వర్‌ను బంధువులకు ఉన్నత పదవులలో నిలబెట్టడం విషయంలో నూర్జహాన్తో పోల్చబడింది. నూర్జహాన్‌లా లాల్ కున్వర్ కూడా పెద్ద మొత్తంలో రాజభరణం, ఆభరణాలు, విలువైన వస్తువులు అందుకున్నది.[3] ఆమె చక్రవర్తితో సమానమైన గౌరవ మర్యాదలు అందుకున్నది. ఆమె 500 మంది సేవకుల సేవలను అందుకున్నది.అయినప్పటికీ ఆమె నూర్జహాన్‌లా రాజకీయాలలో జోక్యం చేసుకోకుండా తన కుటుంబం, చక్రవర్తి పట్ల విశ్వసనీయమైన భక్తిభావం ప్రదర్శించింది.[1]
వివాదాస్పదమైన ప్రవర్తన
మార్చుఆమె దిగువస్థాయి బంధుగణం, చక్రవర్తి మీద ఆమెకున్న ఆధీనత ప్రజలలో ఆమె మీద నీచమైన అభిప్రాయం బలపడడానికి కారణం అయింది. ఫలితంగా ఆమె మీద, మొఘల్ చక్రవర్తి జహందర్ షా మీద రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.చక్రవర్తి, భార్య మద్యపానం పట్ల వ్యామోహితులు అయ్యారు. రాత్రివేళ వారు త్రాగిన మత్తులో ఇంటికి చేరేవారు.ఒకరోజు వారి త్రాగిన మత్తులో ఇంటికి చేరి నిద్రపోవడానికి వెళ్ళారు. తెల్లవారిన తరువాత సేవకులు చక్రవర్తి కొరకు చూడగా ఆయన భవనంలో కనిపించక లాల్ కున్వర్‌ను అడగగా ఆమె చక్రవర్తి గురించిన వివరం చెప్పడంలో విఫలమైంది. చివరగా చక్రవర్తి తాను ప్రయాణం చేసిన వాహనంలో సారథి స్త్యానంలో త్రాగినమత్తులో కనిపించాడు. చక్రవర్తి దిగజారిన ప్రవర్తనకు ఇది నిదర్శనంగా ప్రజలు కథనాలుగా చెప్పుకున్నారు.[4] మరొక సందర్భంలో లాల్ కున్వర్ సూచనతో బోటులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను, సిబ్బంధిని బోటు ఖాళీచేయించి బోటును విడిచి పెట్టిన సంఘటన కూడా వారిని గురించి ప్రజలలో చర్చనీయాంశం అయింది. ఈ సంఘటనలో పలువురు మునిగిపోవడం చూసి ఆమె ఆనందించడం ప్రజలు ఆమెను అసహ్యించుకోవడానికి కారణం అయింది.
చక్రవర్తి ఆంటి " జినత్- ఉన్ - నిస్సా " (ఔరంగజేబు కుమార్తె) ఆమెను అంగీకరించక ఆమెను సందర్శించడం కాని సభలో గుర్తించడం కాని చేయలేదు. అది తనకు జరిగిన అవమానం అని భావించి చక్రవర్తిని ప్రేరేపించిన కారణంగా చక్రవర్తి తన ఆంటీ ఆహ్వానాలను తిరస్కరించి ఆమెను సందర్శించడం నిలిపి వేసాడు. లాల్ కున్వర్ జహందర్ షా కుమారులను ఆదరించలేదు. ఫలితంగా చక్రవర్తి కుమారులను వారిని ఆదరించకపోవడమే కాక వారిని బంధీకృతులను చేసాడు.
ఆమె సాహచర్యంలో జహందర్ షా అమర్యాదకరమైన ప్రవర్తన అలవరచుకున్నాడు. ఆయన బాహ్య ప్రవర్తన, త్రాగుబోతు గాయకులు సభలో అసభ్యంగా మాట్లాడడం కారణంగా ఆయన ప్రజల నిందలకు గురైయ్యాడు.ఆమె ప్రభావం, చక్రవర్తి సభలో ప్రదర్శించిన అసభ్యత మొఘల్ రాజ్యసభ మర్యాద పతనం కావడానికి కారణం అయింది. [2] మొఘల్ రాజ్యంలో ఆమె అపకీర్తి పాలైనా చరిత్ర పరిశోధకులు ఆమె దిగువ తరగతి ప్రజలపట్ల కరుణ చూపి దాతృత్వం కలిగి ఉందని భావిస్తున్నారు. [1]
జహందర్ షా మరణం
మార్చుజహందర్ షా పాలన ముగిసే సమయంలో ఆయన సామ్రాజ్యాన్ని ఫర్రుక్‌సియార్ (ఆగ్రా) కు అప్పగించాడు. తరువాత ఖైదు చేయబడిన జహందర్ షాతో లాల్ కున్వర్ కూడా కలిసి ఖైదుశిక్ష అనుభవించింది. చివరికి జహందర్ షా మరక్షశిక్షకు గురైయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 Misra, Rekha (1967). Women in Mughal India. New Delhi: Munishram Manoharlal. pp. 53–55, 60, 110. OCLC 568760006.
- ↑ 2.0 2.1 2.2 Irvine, William (1971). Later Mughals. New Delhi: Munishram Manoharlal. pp. 180, 192–197. OCLC 952981690.
- ↑ Lal, K.S. (1988). The Mughal Harem. New Delhi: Aditya Prakashan. pp. 194. ISBN 8185179034. OCLC 18431844.
- ↑ Khafi Khan. Muntakhab-ul-Lubab. OCLC 86172620.