ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె

ఫాదర్ పూదోట జోజయ్య , యస్.జె. గారు కతోలిక(క్యాథలిక్) క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు. కతోలిక బైబులులోని పూర్వవేదాన్ని తెలుగులోనికి అనువదించిన ప్రధములు.[1]

ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె

జీవిత విశేషాలు

మార్చు

ఫాదర్ పూదోట జోజయ్య , యస్.జె. గారు, పూదోట మరయ్య, చిన్నమ్మ దంపతులకు 1931 ఫిబ్రవరి 15 న, గుంటూరు జిల్లాలోని కనపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యను కనపర్రులో, ఉన్నతవిద్యను ఫిరంగిపురంలో అభ్యసించారు. మద్రాసు లొయోలాలో కళాశాల విద్యను పూర్తిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.ఏ. (సాహిత్యం) లో పట్టా పుచ్చుకున్నారు. 1955లో తమిళనాడులోని దిండిగల్ నందు యేసుసభలో చేరిన జోజయ్యగారు, అటుపిమ్మట కొడైకెనాల్ లో తత్వశాస్ర్తాన్ని, కర్సియాంగ్ లో వేదాంతశాస్ర్తాన్ని నిశిత పరిశీలనా దృష్టితో క్షుణ్ణంగా అధ్యయనం గావించారు. 1965, మార్చి 27న బిషప్ ముమ్మడి ఇగ్నేష్యస్ గారి చేతుల మీదుగా ఫిరంగిపురంలొ గురుపట్టం పొందారు.

రోమునగరంలోని బిబ్లికల్ ఇన్ స్టిట్యూట్ లో బైబులు విద్యనభ్యసించిన జోజయ్యగారు ఆ తర్వాత తనదైన విశిష్టశైలిలో బైబిలు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. లొయోలా కళాశాలలో 2 సంవత్సరములు ఉపన్యాసకునిగా విద్యార్థులకు చక్కని శిక్షణను అందించారు. పుస్తకరచన, బైబులుబోధ, విద్యార్థులకు నాయకత్వ శిక్షణ వీరి ముఖ్య కార్యక్రమాలు

సాహిత్యరంగంలో

మార్చు
1. అనువాదకునిగా
అకుంఠిత దీక్షతో 17 సం.లు అవిరళకృషిసల్పి క్యాథలిక్ బైబులులోని పూర్వవేదాన్ని జనరంజకంగా తెలుగులోనికి అనువదించారు.
2. ఆధ్యాత్మికవేత్తగా
ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేస్తూ ఆయన నడిపే బైబులు భాష్యం పత్రిక, బైబులు గ్రంథమాల ఆధ్యాత్మికరంగంలో నిత్యకృషీవలుడని చెప్పకనే చెబుతాయి.
3. విద్యార్థి బాంధవునిగా
విద్యార్థిలోకాన్ని ఉత్తే జపరచడానికి, వారిలో నవచైతన్యం నింపడానికి ఆయన నడిపే చైతన్యవాణి పత్రిక, విద్యార్థిహిత గ్రంథమాల, విద్యార్థిలోకానికే నిర్దేశకాలు.
4. వక్తగా
ఆంధ్రరాష్ర్ట మంతటా తిరిగి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపదేశకులకు సామాన్యప్రజానీకానికి వందలకొలది సదస్సులు నిర్వహించి, వారిలో నవ్యోత్సాహాలను నింపారు.

రచనల జాబితా

మార్చు

ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె. గారి రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

చైతన్యవాణి:

మార్చు

చైతన్యవాణి ద్వైమాసపత్రిక. ఇది వ్యాపారపత్రిక కాదు. యువతరానికి ప్రగతి మార్గాలను సూచించి ప్రబోధం కలిగించే హితోపదేశ పత్రిక. మార్చి 2017 నాటికి 217 సంచికలు వెలువడినాయి.

విద్యార్థిహిత గ్రంథమాల:

మార్చు

చైతన్యవాణి పూర్వసంచికల్లోని ఉత్తమరచనలను కొన్నింటిని ఎన్నికచేసి 18 గ్రంథాలుగా ప్రచురించారు.

  1. లోచూపు (వ్యక్తిత్వాన్ని గూర్చి చెప్తుంది)
  2. నీతికథలు (188 నీతికథల సంపుటి)
  3. ఏరిన ముత్యాలు (285 సుభాషితాలు)
  4. నైతికమార్గం (నైతికాంశాలు)
  5. ప్రబోధ కథలు (నీతికథలు, ప్రశ్నలతో)
  6. మంచి అలవాట్లు (మర్యాదా పద్ధతులు)
  7. ఆత్మావలోకనం (ఆత్మపరిశీలనాన్ని గూర్చి)
  8. తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులు
  9. దీప్తికథలు (నీతికథలు, ప్రశ్నలతో)
  10. నైతిక విలువలు (47 నైతికాంశాలు)
  11. హితోపదేశాలు (60 నైతికాంశాలు)
  12. గెలుపు బాట (ఉపదేశాలు, సూచనలూ)
  13. విజయపథం (విజయ సూత్రాలు)
  14. ప్రేరణ కథలు (నీతికథలు, ప్రశ్నలతో)
  15. చైతన్యదీపం (16 నైతికాంశాలు)
  16. మెరుపు తలపులు (49 నైతిక విలువలు)
  17. వెలుగు బాట (సమాచార సాధనాలు, జాతీయ సమైక్యత, దేశభక్తి)
  18. ఆత్మవిశ్వాసాన్ని అవర్చుకోండి (సమస్యను ఎదుర్కోవటంలో నూతన మార్గాలు)

బైబులు భాష్యం :

మార్చు

బైబులు చదువుకొని ప్రార్థన జేసికోవడానికి ఉపయోగపడే పత్రిక. ఏడాదికి ఐదు సంచికలు.

మార్చి 2017 కి 226 సంచికలు వచ్చాయి.

బైబులు గ్రంథమాల:

మార్చు

పై బైబులుభాష్యం సంచికలను కొన్నింటిని ప్రత్యేక గ్రంథాలుగా ప్రచురించారు.

  1. దివ్యనామావళి (క్రీస్తు బిరుదాలు)
  2. బైబులు దృష్టాంతాలు (బైబులు కథలూ, ఉదాహరణలూ)
  3. జ్ఞానస్నానం (జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం)
  4. పాపోచ్చారణం (పాపసంకీర్తనాన్ని గూర్చి)
  5. క్రీస్తు (క్రీస్తును గూర్చి)
  6. కడగతులు (మరణ మోక్ష నరకాదులు)
  7. దేవుని ఆత్మ
  8. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా (వివాహం, కుటుంబజీవితం)
  9. విజ్ఞాన బాధలు (విజ్ఞాన గ్రంథాలమీద వ్యాఖ్య)
  10. కీర్తనామృతం (20 కీర్తనల మీద వ్యాఖ్య)
  11. భక్తవిజయం (బైబులు భక్తుల కథలు)
  12. బైబులు పోటీలు (48 బైబులు క్విస్సులు)
  13. బాధాతత్వం (సిలువమార్గం, సప్తవాక్యాలు)
  14. మన్రేసా (ఇగ్నేష్యసుగారి వడకం)
  15. బైబులు భక్తులు (49 మంది భక్తుల జీవితాలు)

బైబులు వివరణలు:

మార్చు
  1. పునీత లూకా సువిశేష వివరణం
  2. పునీత మత్తయి సువిశేష వివరణం
  3. పునీత మార్కు సువిశేష వివరణం
  4. పునీత యోహాను సువిశేష వివరణం
  5. పునీత యోహాను దర్శనగ్రంథం
  6. ప్రార్థనానుభవం
  7. పునీత పౌలు సందేశ వివరణం
  8. బైబుల్లో స్త్రీలు
  9. ప్రవక్తల వాణి
  10. పునీత పౌలు బోధలు
  11. పునీత మాత
  12. క్రీస్తుసామెతలు
  13. ఆధ్యాత్మిక జీవితం
  14. బైబులు గ్రంథావళి

బైబులుభాష్య సంపుటావళి

మార్చు
  1. మొదటి సంపుటం
  2. రెండవ సంపుటం
  3. మూడవ సంపుటం
  4. నాలుగవ సంపుటం
  5. ఐదవ సంపుటం
  6. ఆరవ సంపుటం
  7. ఏడవ సంపుటం
  8. ఎనిమిదవ సంపుటం
  9. తొమ్మిదవ సంపుటం
  10. పదవ సంపుటం

ఇతర రచనలు

మార్చు
  1. ప్రాత నిబంధన కథలు-1
  2. ప్రాత నిబంధన కథలు-2
  3. ప్రాత నిబంధన కథలు-3
  4. నైతికమార్గం
  5. నూత్న నిబంధన కథలు
  6. పూర్వ నిబంధన కథలు
  7. తోబీతు

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: