ఫిన్ అలెన్

న్యూజీలాండ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు

ఫిన్లీ హ్యూ అలెన్ (జననం 1999, ఏప్రిల్ 22) న్యూజీలాండ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. 2021 మార్చి నుండి న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు.[1] ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు, గతంలో వెల్లింగ్టన్ తరపున ఆడాడు. ఐపిఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సహా పలు రకాల టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడాడు.

ఫిన్ అలెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫిన్లీ హ్యూ అలెన్
పుట్టిన తేదీ (1999-04-22) 1999 ఏప్రిల్ 22 (వయసు 25)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రటాప్-ఆర్డర్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 203)2022 జూలై 10 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 మార్చి 25 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.16
తొలి T20I (క్యాప్ 87)2021 మార్చి 28 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 5 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.16
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–2020, 2023–presentAuckland
2020–2023వెల్లింగ్టన్
2021–presentరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2021లాంకషైర్
2022యార్క్‌షైర్
2023San Francisco Unicorns
2023Southern Brave
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 19 32 17 48
చేసిన పరుగులు 533 739 529 1,372
బ్యాటింగు సగటు 29.61 23.09 19.59 29.19
100లు/50లు 0/5 1/3 0/3 1/9
అత్యుత్తమ స్కోరు 96 101 66 128
వేసిన బంతులు 18 162
వికెట్లు 1 1
బౌలింగు సగటు 15.00 157.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/15 1/32
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 16/– 18/– 29/–
మూలం: Cricinfo, 16 September 2023

క్రికెట్ రంగం

మార్చు

అలెన్ 2017, జనవరి 3న 2016–17 సూపర్ స్మాష్‌లో ఆక్లాండ్ తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] ట్వంటీ20 అరంగేట్రం ముందు, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[3]

2017 డిసెంబరులో, అలెన్ 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[4] పోటీ ప్రారంభ రోజున వెస్టిండీస్‌పై 115 నాటౌట్‌తో టోర్నమెంట్‌లో మొదటి సెంచరీని సాధించాడు.[5] టోర్నమెంట్‌లో న్యూజీలాండ్ రెండవ గేమ్‌లో, కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో, అలెన్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు, ఇది అండర్ 19 వన్డే చరిత్రలో ఉమ్మడి-రెండవ వేగవంతమైనది.[6] టోర్నమెంట్‌లో 338 పరుగులతో న్యూజలాండ్ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[7]

అలెన్ 2018 ఫిబ్రవరి 17న 2017–18 ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరపున తన లిస్ట్ ఎ జట్టుతో అరంగేట్రం చేశాడు.[8] 2018, మార్చి 9న 2017–18 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[9] 2018 సెప్టెంబరులో, 2018 అబుదాబి టీ20 ట్రోఫీ కోసం ఆక్లాండ్ ఏసెస్ జట్టులో ఎంపికయ్యాడు.[10] 2019 నవంబరులో, ఇంగ్లాండ్‌తో జరిగిన న్యూజీలాండ్ XI టూర్ మ్యాచ్‌లో, అలెన్ అజేయ శతకం సాధించాడు.[11]

2020 జూన్ లో, 2020-21 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు అలెన్‌కి వెల్లింగ్టన్ ఒక ఒప్పందాన్ని అందించాడు.[12][13] ఓపెనింగ్ భాగస్వామి డెవాన్ కాన్వే (455) రెండో స్థానంలో ఉన్నాడు.[14] 2021 మార్చిలో, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి జోష్ ఫిలిప్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సంతకం చేశాడు.[15]

2022 జూన్ లో ఐర్లాండ్, స్కాట్లాండ్ పర్యటనల కోసం న్యూజీలాండ్ వన్డే స్క్వాడ్‌లలో అలెన్ ఎంపికయ్యాడు.[16] 2022 జూలై 10న న్యూజీలాండ్ తరపున ఐర్లాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[17] జూలై 27న, స్కాట్లాండ్‌తో జరిగిన న్యూజీలాండ్ తొలి మ్యాచ్‌లో, అలెన్ టీ20 క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. [18]

2000 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో అలెన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.[19] 2022 ఏప్రిల్ లో, ఇంగ్లాండ్‌లో టీ20 బ్లాస్ట్‌లో ఆడేందుకు యార్క్‌షైర్‌తో సంతకం చేశాడు.[20]

2021 మార్చిలో, బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం న్యూజీలాండ్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ జట్టులో అలెన్ ఎంపికయ్యాడు.[21] 2021 మార్చి 28న న్యూజీలాండ్ తరపున బంగ్లాదేశ్‌పై తన టీ20 అరంగేట్రం చేసాడు.[22] తన 3వ మ్యాచ్ లో 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు, మార్టిన్ గప్టిల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు.[23] 2021 ఆగస్టులో, అలెన్ పాకిస్తాన్ పర్యటన కోసం న్యూజీలాండ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[24]

మూలాలు

మార్చు
  1. "Finn Allen". ESPN Cricinfo. Retrieved 13 December 2017.
  2. "Super Smash at Auckland, Jan 3 2017". ESPN Cricinfo. Retrieved 13 December 2017.
  3. "NZ appoint Finnie as captain for Under-19 World Cup". ESPNCricinfo. Retrieved 24 December 2015.
  4. "New Zealand name squad for ICC Under19 Cricket World Cup 2018". New Zealand Cricket. Archived from the original on 13 December 2017. Retrieved 13 December 2017.
  5. "Allen century decorates comfortable New Zealand win". International Cricket Council. Retrieved 13 January 2018.
  6. "Stats: The records broken as New Zealand smash Kenya". International Cricket Council. Retrieved 17 January 2018.
  7. "ICC Under-19 World Cup, 2017/18 - New Zealand Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 February 2018.
  8. "1st Preliminary Final, The Ford Trophy at New Plymouth, Feb 17 2018". ESPN Cricinfo. Retrieved 17 February 2018.
  9. "Plunket Shield at Auckland, Mar 9-12 2018". ESPN Cricinfo. Retrieved 9 March 2018.
  10. "Auckland Aces to face the world in Abu Dhabi". Scoop. Retrieved 27 September 2018.
  11. "Young Auckland batsman Finn Allen hits century against England in tour match". Stuff. Retrieved 13 November 2019.
  12. "Daryl Mitchell, Jeet Raval and Finn Allen among major domestic movers in New Zealand". ESPN Cricinfo. Retrieved 15 June 2020.
  13. "Auckland lose Jeet Raval to Northern Districts, Finn Allen to Wellington in domestic contracts". Stuff. Retrieved 15 June 2020.
  14. "Finn Allen the breakout star in Super Smash as Wellington defend title". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
  15. "IPL 2021: Royal Challengers Bangalore sings Finn Allen as Josh Philippe replacement". The Sports News (in అమెరికన్ ఇంగ్లీష్). 10 March 2021. Retrieved 10 March 2021.
  16. "Left-arm wristspinner Michael Rippon earns maiden call-up for New Zealand". ESPN Cricinfo. Retrieved 21 June 2022.
  17. "1st ODI, Dublin (Malahide), July 10, 2022, New Zealand tour of Ireland". ESPN Cricinfo. Retrieved 10 July 2022.
  18. "Cricket: Finn Allen century leads Black Caps to big win over Scotland". New Zealand Herald. Retrieved 27 July 2022.
  19. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  20. "Finn Allen signs up for Yorkshire T20 Blast stint". ESPN Cricinfo. Retrieved 4 April 2022.
  21. "Finn Allen gets New Zealand T20I call-up, Adam Milne returns". ESPN Cricinfo. Retrieved 23 March 2021.
  22. "1st T20I, Hamilton, Mar 28 2021, Bangladesh tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 28 March 2021.
  23. "Finn Allen after his 29-ball 71: 'From the beginning, I felt I was in the zone'". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
  24. "Black Caps announce Twenty20 World Cup squad, two debutants for leadup tours with stars absent". Stuff. Retrieved 9 August 2021.

బాహ్య లింకులు

మార్చు