ఫిరంగి యుద్దరంగములో ఉపయోగించెడి ఒక ఆయుధము.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి - కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఉన్నది

పనితీరు

మార్చు

అన్ని మందుగుండు ఆయుధాలు, నాటి ఫిరంగులైనా, నేటివైనా, తుపాకులైనా, రివాల్వరులైనా సూత్రం ఒకటే. పేలుడు పదార్థం, గుండు లేదా బుల్లెట్‌సైజు, గుండు బయటకొచ్చే ద్వారం అడ్డుకోత వైశాల్యం, పేల్చే విధానం మొదలైన విషయాల్లోనే తేడా.

ఫిరంగి ఓ వైపు మూసుకొని మరోవైపు తెరచుకొని ఉండే దళసరి లోహపు గోడలున్న ఓ గొట్టం. మూసుకుని ఉన్న చివర అంటిస్తే ఉన్నఫళాన పేలే రసాయనిక పేలుడు పదార్థం ఉంటుంది. మనం దీపావళి సమయంలో అంటిస్తే పేలినట్టే ఇది కూడా పేలుతుంది. ఈ పేలుడు పదార్థాన్ని తెరచి ఉన్న చివరి నుంచే బాగా లోపలికి దట్టిస్తారు. ఆ తర్వాత గుండును ఆ రంధ్రంలోకి జొప్పుతారు. గొట్టం మూసి ఉన్న చివర వత్తి మాత్రమే లోపలికి వెళ్లేలా సన్నని రంధ్రం ఉంటుంది. దాన్ని వెలిగిస్తే కాలుతూ లోపలికి వెళ్లి పేలుడు పదార్థాన్ని పేలుస్తుంది. ఒక్క ఉదుటున పేలుడు వాయువులు విడుదలవుతాయి. అవి అటూ ఇటూ పోవడానికి దారిలేకపోవడం వల్ల గుండును అతివేగంగా నెడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో గుండు విపరీతమైన శక్తితో బయటకు దూసుకు వస్తుంది. పొడవైన గొట్టం సరళమార్గంలో ఉండడం వల్ల గుండు కూడా బయటకు నేరుగా వేగంగా వస్తుంది. గుండు గమ్యాన్ని బట్టి అది ఉన్న దూరాన్ని బట్టి ఫిరంగి గొట్టపు వాలు కోణాన్ని మార్చేలా ఫిరంగిలో యంత్రాంగం ఉంటుంది.

చిత్రమాలిక

మార్చు

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Needham 1987, p. 266
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిరంగి&oldid=3879602" నుండి వెలికితీశారు