ఫిరోజ్పూర్
ఫిరోజ్పూర్, పంజాబ్ రాష్ట్రంలో సట్లెజ్ నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది ఫిరోజ్పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. దీనిని సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ (1351–88) స్థాపించాడు. అతను 1351 నుండి 1388 వరకు ఢిల్లీని పాలించాడు.[3]
ఫిరోజ్‌పూర్ | |
---|---|
![]() సారాగఢీ స్మారక భవనం | |
నిర్దేశాంకాలు: 30°55′00″N 74°36′00″E / 30.9166°N 74.6°ECoordinates: 30°55′00″N 74°36′00″E / 30.9166°N 74.6°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | ఫిరోజ్పూర్ |
స్థాపించిన వారు | ఫిరోజ్ షా తుగ్లక్ |
పేరు వచ్చినవిధం | Firoz Shah Tughluq |
సముద్రమట్టం నుండి ఎత్తు | 182 మీ (597 అ.) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 110,313 |
• సాంద్రత | 380/km2 (1,000/sq mi) |
పిలువబడువిధం (ఏక) | ఫిరోజ్‌పూరీ, ఫిరోజ్‌పూరియా |
భాషలు | |
• అధికారిక | పంజాబీ[2] |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 152001 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 91-1632 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | PB 05 |
లింగ నిష్పత్తి | 885/1000[ఆధారం చూపాలి] ♂/♀ |
అక్షరాస్యత | 69.80% |
జాలస్థలి | www |
చరిత్రసవరించు
ఫిరోజ్‌పూర్ పట్టణం ఇండో-పాకిస్తాన్ సరిహద్దులో సట్లెజ్ నది ఒడ్డున ఉంది. దీనిని 14 వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు. ఈ పట్టణం దేశంలోని ప్రధాన కంటోన్మెంట్. ఈ పట్టణం 10 గేట్ల మధ్య ఉంది. ఇక్కడి సారాగఢీ స్మారక గురుద్వారాను, 36 వ సిక్కు రెజిమెంట్‌కు చెందిన 21 మంది సిక్కు సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. 1897 సెప్టెంబరు 12 న వజీరిస్తాన్లోని సారాగఢీ కోటను రక్షించేటప్పుడు ఈ సైనికులు మరణించారు.[4]
1965 లో యుద్ధంలో మరణించిన 7 గురు పదాతిదళ డివిజన్ సైనికుల జ్ఞాపకార్థం 1969 లో బార్కి స్మారకాన్ని నిర్మించారు. వీరి వీరోచిత పోరాటం వలన, లాహోర్‌కు ఆగ్నేయంగా 15 మైళ్ల దూరంలో ఉన్న బార్కి పట్టణం పతనానికి మార్గం సుగమమైంది.[5]
శీతోష్ణస్థితిసవరించు
ఫిరోజ్‌పూర్ జిల్లా పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. జిల్లా పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు, ఉత్తర సరిహద్దులో తరణ్‌తరణ్ సాహెబ్ జిల్లా, తూర్పు సరిహద్దులో మోగ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఫరీద్‌కోట్ జిల్లా ఉన్నాయి. నైరుతీ సరిహద్దులో కొత్తగా రూపొందించబడిన ఫాజిల్కా జిల్లా ఉంది. ఉత్తర, ఈశాన్య సరిహద్దులను కపూర్తలా జిల్లా ఉంది. జిల్లా గుండా ప్రవహిస్తున్న సట్లైజ్ నది పాకిస్థాన్ వైపు ప్రవహిస్తూ సరిహద్దులను దాటి పాకిస్థాన్ దేశంలో ప్రవేశిస్తుంది. గంగానది కాలువ జలాలతో ఏర్పడిన హుస్సైనివాలా సరసు ఉంది. సట్లైజ్ ఉత్తర సరిహద్దులో ప్రఖ్యాత " షాహిద్ భగత్ సింగ్ ", రాజ్‌గురు, సహ్‌దేవ్ సమాధులు ఉన్నాయి. ఇంకా స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఫిరోజ్‌పూర్‌లో వేసవి కాలం అత్యధిక వేడి, చలికాలం అత్యధిక చలి ఉంటాయి.
జనాభా వివరాలుసవరించు
2011 నాటి భారత జనాభా లెక్కల ప్రకారం, ఫిరోజ్‌పూర్‌లో మొత్తం జనాభా 1,10,313. వీరిలో 58,451 మంది పురుషులు, 51,862 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 11,684. ఫిరోజ్‌పూర్‌లో మొత్తం అక్షరాస్యులు 78,040, జనాభాలో 70.7% మంది పురుష అక్షరాస్యత 73.3%, స్త్రీ అక్షరాస్యత 67.9%. షెడ్యూల్డ్ కులాల జనాభా 27,395. ఫిరోజ్‌పూర్‌లో 2011 లో 22,263 గృహాలు ఉన్నాయి.[1]
మతంసవరించు
2011 జనాభా లెక్కల ప్రకారం ఫిరోజ్‌పూర్‌లో హిందూ మతం, సిక్కు మతం ప్రధానమైన మతాలు. మైనారిటీ మతాల్లో క్రైస్తవ మతం, ఇస్లాం, బౌద్ధమతం, జైన మతం ఉన్నాయి.
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "Census of India: Firozpur". censusindia.gov.in. Retrieved 2 January 2020.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). Nclm.nic.in. Ministry of Minority Affairs. p. 32. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 3 నవంబరు 2020.
- ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. p. 98. ISBN 978-9-38060-734-4.
- ↑ "Welcome to the official website of District Ferozepur, Punjab, India". Ferozepur.nic.in. Archived from the original on 18 జనవరి 2018. Retrieved 31 January 2018.
- ↑ "Welcome to the official website of District Ferozepur, Punjab, India". Ferozepur.nic.in. 11 September 1969. Archived from the original on 10 ఫిబ్రవరి 2018. Retrieved 31 January 2018.
- ↑ "C-1 Population By Religious Community - Firozpur City". census.gov.in. Retrieved 1 January 2020.