ఫ్రెడ్ ఆస్టైర్

అమెరికన్ నటుడు, గాయకుడు, కొరియోగ్రాఫర్, ప్రెజెంటర్

ఫ్రెడ్ అస్టైర్ (1899 మే 10 – 1987 జూన్ 22) అమెరికన్ నటుడు, గాయకుడు, కొరియోగ్రాఫర్, ప్రెజెంటర్.[1] "గొప్ప ప్రజాదరణ పొందిన-సంగీత నర్తకుడుకి"గా పరిగణించబడ్డాడు. [2] గౌరవ అకాడమీ అవార్డు, మూడు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు, బాఫ్టా అవార్డు, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, గ్రామీ అవార్డులతోపాటు అనేక అవార్డులను అందుకున్నాడు. 1973లో ఫిల్మ్ సొసైటీ ఆఫ్ లింకన్ సెంటర్ ట్రిబ్యూట్, 1978లో కెన్నెడీ సెంటర్ ఆనర్స్, 1980లో ఏఎప్ఐ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డాడు. 1960లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్, 1972లో అమెరికన్ థియేటర్ హాల్ ఆఫ్ ఫేమ్, 1989లో టెలివిజన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి అడుగుపెట్టాడు.

ఫ్రెడ్ ఆస్టైర్
ఫ్రెడ్ ఆస్టైర్ (1941)
జననం
ఫ్రెడరిక్ ఆస్టర్లిట్జ్

(1899-05-10)1899 మే 10
ఒమాహా, నెబ్రాస్కా, యుఎస్‌
మరణం1987 జూన్ 22(1987-06-22) (వయసు 88)
సమాధి స్థలంఓక్‌వుడ్ మెమోరియల్ పార్క్ స్మశానవాటిక
వృత్తినటుడు, గాయకుడు, కొరియోగ్రాఫర్, ప్రెజెంటర్
క్రియాశీల సంవత్సరాలు1904–1981
జీవిత భాగస్వామి
ఫిలిస్ లివింగ్స్టన్ పాటర్
(m. 1933; died 1954)
రాబిన్ స్మిత్
(m. 1980)
పిల్లలు2
బంధువులుఅడిలె ఆస్టైర్(సోదరి)
సంగీత ప్రస్థానం

76 ఏళ్ళపాటు నాటక, టీవి, సినిమారంగాలలో అస్టైర్ కెరీర్ కొనసాగింది. 10 కంటే ఎక్కువ బ్రాడ్‌వే, వెస్ట్ ఎండ్ మ్యూజికల్స్‌లో నటించాడు. 31 సంగీత చిత్రాలు, నాలుగు టెలివిజన్ స్పెషల్‌లు, అనేక రికార్డింగ్‌లు కూడా చేశాడు. 1935లో టాప్ హాట్, 1936లో స్వింగ్ టైమ్, 1937లో షాల్ వి డ్యాన్స్, 1942లో హాలిడే ఇన్, 1948లో ఈస్టర్ పరేడ్, 1953లో ది బ్యాండ్ వాగన్, 1957లో ఫన్నీ ఫేస్, సిల్క్ స్టాకింగ్స్ (1957) వంటి హాలీవుడ్ సినిమాలలో నటించి, గుర్తింపు పొందాడు.[3] అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ 100 ఏళ్ళలో క్లాసిక్ హాలీవుడ్ సినిమాల్లోని 100 స్టార్స్ లో ఐదవ-గ్రేటెస్ట్ మేల్ స్టార్ అస్టైర్‌ని పేర్కొంది.[4][5]

 
1906లో ఫ్రెడ్, అతని సోదరి అడెలె

ఫ్రెడ్ అస్టైర్ 1899 మే 10న జొహన్నా "ఆన్" (నీ గీలస్; 1878-1975), ఫ్రెడ్రిక్ "ఫ్రిట్జ్" ఇమాన్యుయెల్ ఆస్టర్‌లిట్జ్ (18368-18368-19) దంపతులకు యుఎస్‌లోని ఒమాహా, నెబ్రాస్కా నగరంలో జన్మించాడు.[1][6][7][8]

 
1921లో ఫ్రెడ్, అడెలె ఆస్టైర్
 
టాప్ హాట్‌లో జింజర్ రోజర్స్, ఫ్రెడ్ అస్టైర్ (1935)
 
రీటా హేవర్త్‌తో యు వర్ నెవర్ లవ్‌లియర్ (1942)
 
ఇన్ డాడీ లాంగ్ లెగ్స్ (1955)
 
1962లో అస్టైర్
 
రాయల్ వెడ్డింగ్ (1951) నుండి "యు ఆర్ ఆల్ ది వరల్డ్ టు మీ" [9] కోసం గోడలు, పైకప్పుపై డ్యాన్స్ చేస్తున్న అస్టైర్
 
రెండవ కోరస్ (1940)లో అస్టైర్ గానం
 
గ్రామాన్ చైనీస్ థియేటర్ వద్ద అస్టైర్ చేతి, పాదముద్రలు
 
ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లోని లిస్మోర్‌లో అస్టైర్‌ను గౌరవించే ఫలకం
 
ఫ్రెడ్ అస్టైర్, అతని కుమార్తె అవా అరంగేట్రం బాల్ (1959)
 
ఓక్‌వుడ్ మెమోరియల్ పార్క్‌లో ఫ్రెడ్ అస్టైర్ సమాధి

అస్టైర్ 88 సంవత్సరాల వయస్సులో 1987 జూన్ 22న న్యుమోనియాతో మరణించాడు. అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని చాట్స్‌వర్త్‌లోని ఓక్‌వుడ్ మెమోరియల్ పార్క్ స్మశానవాటికలో ఖననం చేశారు.[10]

నటించినవి

మార్చు

సంగీత చలనచిత్రాలు

మార్చు
  • డ్యాన్సింగ్ లేడీ (1933) {జోన్ క్రాఫోర్డ్}
  • ఫ్లయింగ్ డౌన్ టు రియో* (1933)
  • ది గే డైవర్స్* (1934)
  • రాబర్టా* (1935)
  • టాప్ హ్యాట్* (1935)
  • ఫాలో ది ఫ్లీట్* (1936)
  • స్వింగ్ టైమ్* (1936)
  • షెల్ వుయ్ డాన్స్* (1937)
  • ఎ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ (1937) {బర్న్స్ అండ్ అలెన్, జోన్ ఫాంటైన్ (1 నంబర్)}
  • కేర్ ఫ్రీ* (1938)
  • ది స్టోరీ ఆఫ్ వెర్నాన్, ఐరీన్ కాజిల్* (1939)
  • బ్రాడ్‌వే మెలోడీ ఆఫ్ 1940 (1940) {ఎలియనోర్ పావెల్}
  • సెకండ్ కోరస్ (1940) {పాలెట్ గొడ్దార్డ్ (1 సంఖ్య)}
  • యు విల్ నెవర్ గెట్ రిచ్** (1941)
  • హాలిడే ఇన్*** (1942)
  • యు ఆర్ నెవర్ లవ్‌లియర్** (1942)
  • ది స్కైస్ ది లిమిట్ (1943) {జోన్ లెస్లీ}
  • జిగ్‌ఫెల్డ్ ఫోలీస్ (1945) {లూసిల్ బ్రెమెర్ (2), జీన్ కెల్లీ (1)}
  • యోలాండా అండ్ ది థీఫ్ (1945) {లుసిల్లే బ్రెమెర్}
  • బ్లూ స్కైస్*** (1946)
  • ఈస్టర్ పరేడ్ (1948) {జూడీ గార్లాండ్}
  • ది బార్క్లీస్ ఆఫ్ బ్రాడ్‌వే* (1949)
  • త్రీ లిటిల్ వర్డ్స్**** (1950)
  • లెట్స్ డ్యాన్స్ (1950) {బెట్టీ హట్టన్}
  • రాయల్ వెడ్డింగ్ (1951) {జేన్ పావెల్}
  • ది బెల్లె ఆఫ్ న్యూయార్క్**** (1952)
  • ది బ్యాండ్ వాగన్***** (1953)
  • డాడీ లాంగ్ లెగ్స్ (1955) {లెస్లీ కారన్}
  • ఫన్నీ ఫేస్ (1957) {ఆడ్రీ హెప్బర్న్}
  • సిల్క్ స్టాకింగ్స్***** (1957)
  • ఫినియన్స్ రెయిన్‌బో (1968)
  • దట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌! (1974)
  • దట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, పార్ట్ II (1976) (కథకుడు, ప్రదర్శకుడు)
  • అదో ఎంటర్‌టైన్‌మెంట్‌! III (1994)

సంగీతేతర చలనచిత్రాలు

మార్చు
  • ఆన్ ది బీచ్ (1959)
  • ది ప్లెజర్ ఆఫ్ హిస్ కంపెనీ (1961)
  • ది నోటోరియస్ ల్యాండ్‌లేడీ (1962)
  • మిడాస్ రన్ (1969)
  • ది టవరింగ్ ఇన్ఫెర్నో (1974)
  • ది అమేజింగ్ డోబర్‌మాన్స్ (1976)
  • ది పర్పుల్ టాక్సీ (1977)
  • ఘోస్ట్ స్టోరీ (1981)

టెలివిజన్

మార్చు
  • జనరల్ ఎలక్ట్రిక్ థియేటర్ (2) (1957, 1959)
  • యాన్ ఈవినింగ్ విత్ ఫ్రెడ్ అస్టైర్* (1958)
  • ఫ్రెడ్ అస్టైర్‌తో మరో సాయంత్రం* (1959)
  • అస్టైర్ టైమ్* (1960)
  • ఆల్కో ప్రీమియర్ (60 హోస్ట్‌గా, 4 ప్రదర్శకుడిగా) (1961–1963)
  • బాబ్ హోప్ ప్రెజెంట్స్ ది క్రిస్లర్ థియేటర్* (1) (1964)
  • డా. కిల్డేర్ (4) (1965)
  • హాలీవుడ్ ప్యాలెస్* (4) (1966)
  • ది ఫ్రెడ్ అస్టైర్ షో* (1968)
  • ఇట్ టేక్స్ ఎ థీఫ్ (5) (1969–1970)
  • 42వ అకాడమీ అవార్డులు (1970)
  • ది ఓవర్-ది-హిల్ గ్యాంగ్ రైడ్స్ ఎగైన్ (1970)
  • ది డిక్ కావెట్ షో (11/10/1970)
  • శాంతా క్లాజ్ ఈజ్ కమింగ్ టు టౌన్ ఎస్.డి. క్లూగర్ (వ్యాఖ్యాత) (1970)
  • ఇమాజిన్ (1972)
  • ఈస్టర్ బన్నీ ఈజ్ కమిన్ టు టౌన్ ఎస్.డి. క్లూగర్ (వ్యాఖ్యాత) (1977)
  • ఎ ఫ్యామిలీ అప్‌సైడ్ డౌన్ (1978-టివి సినిమా)
  • ది మ్యాన్ ఇన్ ది శాంతా క్లాజ్ సూట్ (1979-టివి సినిమా)
  • బాటిల్‌స్టార్ గెలాక్టికా (1) (1979)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Billman, Larry (1997). Fred Astaire: A Bio-bibliography. Connecticut: Greenwood Press. ISBN 0-313-29010-5.
  2. బ్రిటానికా విజ్ఞాన సర్వస్వము లో ఫ్రెడ్ ఆస్టైర్ సమగ్ర వివరాలు
  3. Oxford illustrated encyclopedia. Judge, Harry George., Toyne, Anthony. Oxford [England]: Oxford University Press. 1985–1993. p. 25. ISBN 0-19-869129-7. OCLC 11814265.{{cite book}}: CS1 maint: others (link)
  4. "1981 Fred Astaire Tribute" afi.com
  5. "AFI'S 100 Years...100 Stars" Archived అక్టోబరు 25, 2014 at the Wayback Machine afi.com. Retrieved October 11, 2017
  6. Flippo, Hyde. "Fred Astaire (1899–1987) aka Friedrich Austerlitz". The German–Hollywood Connection. Archived from the original on January 2, 2009. Retrieved July 10, 2015.
  7. "The Religious Affiliation of Adele Astaire". Adherents. September 20, 2005. Archived from the original on February 28, 2006. Retrieved August 24, 2008.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  8. "Frederick Austerlitz (1899-1987): An American with Austrian Roots". The German Way and More. Retrieved May 25, 2021.
  9. "You're All the World to Me" originated (with different lyrics) as "I Want to Be a Minstrel Man" in the Eddie Cantor musical Kid Millions (1934).
  10. Ginger Rogers, who died on April 25, 1995, was buried in the same cemetery.

గ్రంథ పట్టిక

మార్చు

బాహ్య లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.