బంగారు రథం
బంగారు రథం (The Golden Chariot) భారతీయ రైల్వేలు నడుపుతున్న విలాసవంతమైన రైలు.
The Golden Chariot | |
---|---|
దస్త్రం:Tgc logo.jpg | |
Manufacturer | Indian Railways |
Built at | Integral Coach Factory, Chennai |
Family name | Luxury Trains |
Constructed | 2008 |
Entered service | 2008 |
Operator | Indian Railways and Karnataka State Tourism Development Corporation (KSTDC) |
Depot(s) | Whitefield, Bangalore |
Line(s) served | Bangalore-Mysore-Hassan-Hospet-Badami-Vasco (Goa)-Bangalore (South Western Railway) |
ఇది భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో నడుస్తుంది. ఇది మొదటి సారిగా 2008 మార్చి 10 ప్రారంభించబడింది.[1]
ఇందులోని 11 పాసింజర్ బోగీలలో ప్రతిదానిలోను ప్లాస్మా టీవీ, స్నానాల గది, సామాన్లు పెట్టుకోవడానికి అల్మరాలు, 6 డి.వి.డి. చానల్లు, 6 ఉపగ్రహ చానల్లు ఏర్పాటుచేశారు.[2] మొత్తం ప్రయాణీకులు 88 మంది మాత్రమే.
సదరన్ స్ప్లెండర్
మార్చుఇది తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ గుండా సాగుతుంది. మొదటి రోజు బెంగుళూరులో బయలుదేరి మద్రాసు, మహాబలిపురం చూపించి రెండవరోజు పాండిచ్చేరి చేరుతుంది. మూడోరోజు తంజావూరు తీసుకెళ్తారు. బృహదీశ్వరాలయం మధురై మీనాక్షి ఆలయం చూసి నాలుగవరోజు నాగర్ కోయిల్ చేరతారు. ఆరవ రోజు కన్యాకుమారి దర్శించి తిరువనంతపురం వెళ్తారు. అక్కడి అనంతపద్మనాభ స్వామి దర్శనం కోవలం, అల్లెప్పీ వెళ్తారు. అక్కడి నుండి తిరిగి చర్చిలు, డచ్ కోట దర్శించి తిరిగి బెంగుళూరు చేరతారు.
ప్రైడ్ ఆఫ్ సౌత్
మార్చుఇది బెంగళూరులో మొదలై 7-8 రోజులపాటు సాగి తిరిగి బెంగళూరు చేరుతుంది.[3]
మొదటిరోజు రాత్రి బందీపూర్ బయలుదేరుతుంది. రెండవరోజు కబిని లోని అడవి బోట్ సఫారీ చూసి మూడవ రోజు మైసూర్ చేరుతుంది. మైసూర్ కోట శ్రీరంగపట్టణం, లలితా మహల్ పాలెస్ చూసి హసన్ బయలుదేరుతుంది. గోమఠేశ్వరుడి విగ్రహం చూపించి హళేబీడు వెళ్తుంది. అయిదో రోజు హంపీలో విరూపాక్ష దేవాలయం చారిత్రక ప్రదేశాలు, విఠలాలయం చూపిస్తారు. మర్నాడు బాదామి చేరతారు. గుహలు చూసిన తర్వాత రాత్రికి గోవా చేరుతారు. అక్కడి ప్రముఖ చర్చిలు, బీచ్ లు చూసి బెంగుళూరు చేరుతుంది.
మూలాలు
మార్చు- ↑ "Golden Chariot train's first commercial run on March 10". The Times of India. 2008-02-28. Retrieved 2009-04-21.
- ↑ దక్షిణాపథం పర్యటనకు "బంగారు రథం" ఈనాడు ఆదివారంలో ప్రచురించిన వ్యాసంలో వివరాలు.
- ↑ "Golden Chariot: Journey". Golden Chariot: Official website. Archived from the original on 2009-05-03. Retrieved 2009-04-21.