బండారు శారారాణి
బండారు శారారాణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పరకాల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది.[1]
బండారు శారారాణి | |||
పదవీ కాలం 2004 – 2009 | |||
నియోజకవర్గం | పరకాల శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 హుజూర్‌నగర్, సూర్యాపేట జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
మరణం | మే 25, 2019 హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | బండారు సారయ్య | ||
నివాసం | హైదరాబాదు |
జననం
మార్చుశరారాణి 1964లో సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ లో క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది.[2]
కుటుంబం - ఉద్యోగం
మార్చుశారారాణికి బండారు సారయ్య వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. 2004 వరకు హౌసింగ్ బోర్డులో ఉద్యోగం చేసింది. సారయ్య డీఎస్పీగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసి, ఏసీపీగా రిటైర్ అయ్యాడు.
రాజకీయ ప్రస్థానం
మార్చుఉద్యోగానికి రాజీనామా చేసిన శారారాణి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్‌పై పరకాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 34,597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభ్యురాలు అయింది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటన కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంది.[3]
మరణం
మార్చుగత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న శారారాణి 2019, మే 25 సాయంత్రం గుండెపోటుతో హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించింది.[4]
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (25 May 2019). "పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 13 September 2019. Retrieved 13 September 2019.
- ↑ ఈనాడు, నల్లగొండ (27 May 2019). "మాజీ ఎమ్మెల్యే శారారాణికి కన్నీటి వీడ్కోలు - Nalgonda". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 13 September 2019. Retrieved 13 September 2019.
- ↑ ప్రజాశక్తి, తాజావార్తలు (25 May 2019). "పరకాల మాజీ ఎమ్మెల్యే బండారు శారారాణి కన్నుమూత". www.prajasakti.com. Archived from the original on 13 September 2019. Retrieved 13 September 2019.
- ↑ సాక్షి, తెలంగాణ (26 May 2019). "మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత". Sakshi. Archived from the original on 26 May 2019. Retrieved 13 September 2019.