హుజూర్‌నగర్

తెలంగాణ, సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలం లోని గ్రామం

హుజూర్‌నగర్, తెలంగాణ రాష్ట్రంలోని, సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2013లో హుజూర్‌నగర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.

హుజూర్‌నగర్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో సవరించు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామం పేరు వెనుక చరిత్ర సవరించు

హుజూర్‌నగర్ కు పూర్వం పోచమచర్ల అనే పేరు ఉండేది. 1935లో నిజాం నవాబ్ ఈ పేరు పెట్టి ఫర్మానా జారీచేసాడు[3][4]. హుజూర్ అనే నవాబు దీన్ని పాలించడంవల్ల హూజూర్ నగర్ అని పేరు వచ్చింది.

గణాక వివరాలు సవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 9474 ఇళ్లతో, 35850 జనాభాతో 4213 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 17946, ఆడవారి సంఖ్య 17904. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 5175 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1234. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577579[5].పిన్ కోడ్: 508204.

విద్యా సౌకర్యాలు సవరించు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.హూజూర్ నగరులో రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి. ఇవికాక రెండు ప్రైవేట్ కళాశాలలు (ప్రియదర్శిని కళాశాల, చైతన్య కళాశాల) ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల పాలెఅన్నారంలో ఉంది. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, పాలీటెక్నిక్‌ కోదాడలోను, మేనేజిమెంటు కళాశాల పాలెఅన్నారంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కోదాడలోను, అనియత విద్యా కేంద్రం మిర్యాలగూడలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నల్గొండ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం సవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యం సవరించు

హుజూర్ నగర్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం సవరించు

గ్రామంలో16 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 8 మంది, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఏడుగురు ఉన్నారు. 16 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు సవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం సవరించు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు సవరించు

హుజూర్ నగర్లో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

హుజూర్ నగరుకు రైలు సౌకర్యము లేదు. సమీప రైల్వే స్టేషను 33 కిలోమీటర్ల దూరములో మిర్యాలగూడలో ఉంది. హుజూర్ నగరుకు బస్సులో చేరుకొనవచ్చు.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు సవరించు

పట్టణములో రెండు జాతీయ బ్యాంకులు : ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, ఒక సహకార కేంద్రీయ బ్యాంకు గ్రామీణ బ్యాంకు ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు సవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామ జన్మించిన ప్రముఖులు సవరించు

 
పశ్య రామిరెడ్డి : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు

విద్యుత్తు సవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం సవరించు

హుజూర్ నగర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 453 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 333 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 569 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 265 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 222 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 348 హెక్టార్లు
 • బంజరు భూమి: 2023 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1249 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1122 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు సవరించు

హుజూర్ నగర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 1122 హెక్టార్లు

ఉత్పత్తి సవరించు

హుజూర్ నగర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు సవరించు

వరి

శాసనసభా నియోజకవర్గం సవరించు

1977 వరకు హుజూర్‌నగర్ శాసనసభా నియోజకవర్గంగా ఉండేది. అయితే 1977 నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని రద్దుచేశారు. కానీ తిరిగి 2007లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గాన్ని 2009లో శాసనసభా ఎన్నికలకు పునరుద్ధరించారు.

దేవాలయాలు సవరించు

హుజూర్‌నగర్లో రామాలయం, ముత్యాలమ్మ గుడి, దుర్గ గుడి, షిర్డీ సాయిబాబా గుడి ఉన్నాయి. పట్టణంలో ప్రతి సంవత్సరమూ నిర్వహించే ముత్యాలమ్మ జాతర ప్రసిద్ధి చెందినది. హుజూర్ నగర్ సీతారామచంద్రస్వామి ఆలయము 900 సంవత్సరాల పురాతనమైనది. జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని ఇటీవలే కొందరు స్థానిక దాతల సహాయంతో పునరుద్ధరించారు.

పరిశ్రమలు సవరించు

హుజూర్ నగర్ పట్టణంలో అనేక బియ్యపు మిల్లులున్నవి. పట్టణం చుట్టూ ప్రియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, నాగార్జునా సిమెంట్స్, అంజనీ సిమెంట్స్, మహా సిమెంట్స్, సువర్ణా సిమెంట్స్, కామాక్షీ సిమెంట్స్ చిన్నా పెద్ద సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి.

అభివృద్ధి పనులు సవరించు

హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో 30 కోట్లతో నిర్మించిన డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళను, ఈఎస్‌ఐ దవాఖానను, ఎస్టీవో కార్యాలయం, బస్తీ దవాఖాన, కోటి రూపాయలతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని 2022 జనవరి 6న తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7][8]

గ్రామ ప్రముఖులు సవరించు

 1. ఎం. పురుషోత్తమాచార్యులు: కవి, రచయిత, సినీ విమర్శకుడు. మిసిమి మాస పత్రికలో సినిమా పాటలపై విమర్శనాత్మక వ్యాసాల రచనకు 2021 సంవత్సరానికి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా ఎంపికయ్యాడు.[9][10]

మూలాలు సవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. నీలగిరి పత్రిక 1935 డిసెంబరు 4 లో ఫర్మానా యదాతథంగా ముద్రణ జరిగింది.
 4. ఆసూరి మఱింగంటి వేంకట నరసింహాచార్య, శ్రీరంగాచార్య(సం ) (1980). తాలాంక నందినీ పరిణయము.
 5. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (18 May 2019). "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పశ్య రామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 18 May 2019. Retrieved 18 May 2019.
 7. telugu, NT News (2023-01-06). "హుజూర్‌నగర్‌లో ఈఎస్‌ఐ దవాఖాన ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-13.
 8. "మూడేళ్లలో రూ. 3 వేల కోట్ల అభివృద్ధి: కేటీఆర్‌". EENADU. 2023-01-07. Archived from the original on 2023-01-07. Retrieved 2023-01-13.
 9. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
 10. Eenadu (26 August 2023). "సాహితీ వారసుడు పురుషోత్తమాచార్యులు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.

వెలుపలి లంకెలు సవరించు