బండ్లమూడి సుబ్బారావు
డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు (1954 - 2016): ఆచార్య ఎన్.జి.రంగా ఫౌండేషన్ అధ్యక్షులు[1], ఎపిసిసి కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, ఒక వ్యవసాయ ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత, రాజకీయ, సామాజిక కార్యకర్త, చరిత్రకారుడు, రైతు నాయకుడు.
డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు | |
---|---|
దస్త్రం:Bandlamudi Subba rao.jpg | |
జననం | మే 22,1954 ప్రకాశం జిల్లా వీరన్నపాలెం గ్రామం |
మరణం | 17 సెప్టెంబర్ 2016 |
విద్య | M.Sc,(Ag), Ph.D |
సంస్థ | ఆచార్య ఎన్.జి.రంగా ఫౌండేషన్ అధ్యక్షులు |
మతం | హిందువు |
భార్య / భర్త | భవాని దేవి |
పిల్లలు | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
తల్లిదండ్రులు | కోటయ్య, సీతారావమ్మ |
జననం, విద్య
మార్చుడాక్టర్ బండ్లమూడి సుబ్బారావు ప్రకాశం జిల్లా వీరన్నపాలెం (పర్చూరు)లో మే 22,1954 న కోటయ్య, సీతారావమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో B.Sc (Ag). బెనారస్ హిందూ యూనివర్శిటీలో వ్యవసాయశాస్త్రంలో డాక్టరేటు పట్టా - M.Sc, (Ag) Ph.D పొందారు.[2]
జీవిత విశేషాలు
మార్చుసుబ్బారావు గారు రైతు నాయకుదు ఎన్.జి. రంగా గారి శిష్యుడు. తొలుత రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ భావజాలంతో రాజకీయ ప్రవేశం చేసారు. ఆ తరువాత రంగాజీ కోరికపై కాంగ్రెస్ లో చేరారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో 1982 ఫిబ్రవరి 2 న ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చే ప్రారంభింపబడిన "ఇండియన్ కిసాన్ మజ్దూర్ కాంగ్రెస్"కు వ్యవస్థాపక అధ్యక్షుడుగా యున్నారు. 1983-85 మధ్య కాలంలో ఇండియన్ ఆయిల్ సీడ్స్ డెవలెప్‌మెంట్ కౌన్సిల్ కు సభ్యునిగా యున్నారు, 1991-94 మధ్య కాలంలో గవర్నింగ్ కౌన్సిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్సన్ మేనేజిమెంట్ కు సభ్యునిగా, 1994-96 లో పారదీప్ పోర్ట్ ట్రస్ట్ కు ట్రస్టీగా కూడా యున్నారు.
రంగాజీ అనుచరునిగా,అభిమాన పాత్రుడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా యుండి రైతుల సంక్షేమం కోసం కృషిచేసారు. ఈయన ఎన్.జి.రంగా పౌండేషన్ కు వ్యవస్థాపక అధ్యక్షునిగా యున్నారు. ఈ పౌండేషన దివంగత నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు ఎన్.జి.రంగా పేరు మీద ప్రారంభించారు. దీనిద్వారా అనేక సమావేశాలు, సెమినార్లు, సభలు నిర్వహించారు. సమకాలీన సమస్యలపై సమగ్ర చర్చలు జరిపి ప్రభుత్వానికి పరిష్కారాలు నివేదించారు.
1982 లో లండన్లో జరిగిన వ్యవసాయ ప్రొడ్యూసర్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ కు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. St.Luis, USA లో జరిగిన ప్రపంచ వ్యవసాయ ఫోరం 2007 వరల్డ్ కాంగ్రెస్ కు మే 8-10, 2007 నుండి భారత ప్రతినిధిగా హాజరయ్యారు. జూలై 4-6 నుండి వాషింగ్టన్ DC వద్ద తానా కాన్ఫరెన్స్ లో గౌరవనీయ వ్యక్తిగా ఆహ్వానించబడ్డాడు. వీరు కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, స్విట్జర్లాండ్,ఇంగ్లాండ్, అమెరికా దేశాలలో పర్యటించారు.
డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు వ్యవసాయరంగంపై రాసిన 25 పరిశోధన పత్రాలను వివిధ సాంకేతిక పత్రికలలోప్రచురించారు. ఒక మేధావిగా సమకాలీన సమస్యలపై తన అభిప్రాయాలను నిర్బయంగా చెప్పేవారు.[3][4]
మరణం
మార్చుడాక్టర్ బండ్లమూడి సుబ్బారావు గారి ధర్మ పత్ని భవాని దేవి. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె, వీరు 62 సంవత్సరాల వయస్సులో 2016 సెప్టెంబరు 17 న హైదరాబాదులో మరణించారు.
రచనలు
మార్చుసుబ్బారావు తెలుగులో "శ్రీ కృష్ణ దేవరాయలు" అనే చారిత్రాత్మక పరిశోధనా గ్రంథాన్ని2004లో ప్రచురించారు. యిది మూడు ఎడిషన్లలో ప్రచురింపబడింది. ఈయన సమకాలీన సమస్యలపై వివిధ పత్రికలలో రాసిన వ్యాసాలను "బూజుపట్టిన రాజ్యాంగం" అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు.
- శ్రీకృష్ణదేవరాయలు
- బూజుపట్టిన రాజ్యాంగం
సూచికలు
మార్చు- ↑ 1.0 1.1 The Hindu : Andhra Pradesh News : Briefly
- ↑ కొడాలి, శ్రీనివాస్ (2018). వీరన్నపాలెం గ్రామ చరిత్ర. గుంటూరు: కొమల చారిటిబుల్ ట్రస్ట్.
- ↑ ఆంధ్రజ్యోతి (2013-07-27). మూడు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్.
- ↑ ఈనాడు (2013-09-13). "విముక్తి కావాలి".
- ↑ The Hindu : `Bid to introduce M.Sc. in food-processing in ANGRAU'