బటర్ ఫ్లై 2022లో విడుదలైన తెలుగు సినిమా. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లమెల్లి నిర్మించిన ఈ సినిమాకు ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించాడు. భూమిక, అనుపమ పరమేశ్వరన్, రావు రమేష్, నిహాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 29న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదలైంది.[1]

బటర్ ఫ్లై
దర్శకత్వంఘంటా సతీష్ బాబు
రచనఘంటా సతీష్ బాబు
నిర్మాతరవిప్రకాష్ బోడపాటి
ప్రసాద్ తిరువళ్ళూరి
ప్రదీప్ నల్లమెల్లి
తారాగణంభూమిక
అనుపమ పరమేశ్వరన్
రావు రమేష్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుమధు
సంగీతంఅర్విజ్, గిడియన్ కట్టా
నిర్మాణ
సంస్థ
జెన్ నెక్స్ట్ మూవీస్
విడుదల తేదీ
29 డిసెంబర్ 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌)
దేశం భారతదేశం
భాషతెలుగు

గీత (అనుపమ పరమేశ్వరన్), వైజయంతి (భూమిక) అనాధలుగా కలిసి పెరుగుతారు. వైజయంతి, (రావు రమేశ్)ను వివాహమాడగా, ఇద్దరు పిల్లలు జన్మించాక రావు రమేష్ ధోరణి నచ్చక విడాకులు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలో జడ్జి పరీక్ష రాయడం కోసం వైజయంతి ఢిల్లీ వెళ్లగా ఆమె ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అవుతారు. గీత తన బాయ్ ఫ్రెండ్ విశ్వ (నిహాల్) తో కలిసి ఆ పిల్లలను వెతకడం ప్రారంభిస్తుంది. అసలు పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఎవరు ? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: జెన్ నెక్స్ట్ మూవీస్
  • నిర్మాత: రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లమెల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఘంటా సతీష్ బాబు
  • సంగీతం: అర్విజ్, గిడియన్ కట్టా
  • సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
  • మాటలు : దక్షిణ్ శ్రీనివాస్
  • పాటలు : అనంత్ శ్రీరామ్

మూలాలు

మార్చు
  1. Eenadu (26 December 2022). "ఇయర్‌ ఎండింగ్‌ స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/OTTలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
  2. ABP Live (29 December 2022). "'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ ఎలా ఉందంటే?". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=బటర్_ఫ్లై&oldid=3789350" నుండి వెలికితీశారు