రజిత ఒక సినీ సహాయ నటి.[1] తెలుగులోనే కాక ఒరియా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 300 పైగా సినిమాల్లో నటించింది. 1998 లో పెళ్ళికానుక సినిమాలో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది.

రజిత
జననం
మల్లెల రజిత

(1972-10-18) 1972 అక్టోబరు 18 (వయసు 52)
విద్యఇంటర్మీడియట్
వృత్తిసినీ నటి
తల్లిదండ్రులు
  • మల్లెల రామారావు (తండ్రి)
  • మల్లెల విజయలక్ష్మి (తల్లి)

వ్యక్తిగత వివరాలు

మార్చు

ఆమె తల్లిదండ్రులు మల్లెల రామారావు, విజయలక్ష్మి. వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, కొల్ల. తండ్రి రజిత చిన్నతనంలో ఉండగానే చనిపోయారు. తల్లే ఆమెను శ్రద్ధగా చదివించింది. ఆమె బాగా చదువుకుని డాక్టరు కావాలని అనుకునేది. రజితకు ఇద్దరు అక్కలు ఉన్నారు. పదో తరగతి దాకా కాకినాడలో చదివింది. ఇంటర్మీడియట్ చెన్నై లో చదివింది. రజిత పుస్తకాలు బాగా చదువుతుంది.[2] సహాయ నటీమణులు కృష్ణవేణి, రాగిణి ఆమెకు పినతల్లులు అవుతారు. వారు ఆ రంగంలోనే ఉన్నా ఆమెకు నటనపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. రజిత పెళ్ళి చేసుకోలేదు. తల్లితో కలిసి ఉంటున్నారు.

కెరీర్

మార్చు

1987లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్నిపుత్రుడు ఆమె మొదటి సినిమా. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే చెన్నైలో ఉన్న పిన్నమ్మ కృష్ణవేణి దగ్గరికి వెళ్ళింది. ఆమెతో కలిసి నాగార్జున హీరోగా అగ్నిపుత్రుడు సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆమెను చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఆమెను చూసి ఆమెను రాఘవేంద్రరావుకు పరిచయం చేశాడు. ఆయన ఆమెను ఆ సినిమాలో నాగేశ్వరరావు కూతురుగా నటించమన్నారు. సినిమాల మీద ఆసక్తిలేక మొదట్లో వద్దని చెప్పినా వారు నచ్చచెప్పటంతో అందుకు అంగీకరించింది. తరువాత ఆమెకు వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాల్లో నటించిన తర్వాత మళ్లీ కాకినాడకు వచ్చి పదో తరగతి పూర్తి చేసింది. మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం చెన్నై వెళ్ళినపుడు చదువుకుంటూనే సినిమాల్లో నటించేది.

సాహసం చేయరా ఢింబకా, వివాహ భోజనంబు, చినరాయుడు లాంటి సినిమాల్లో నటించింది. తమిళం, కన్నడ భాషల్లో కథానాయికగా కూడా నటించింది. 1995 నుంచి నటన వైపు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 1998 లో పెళ్ళికానుక సినిమాలో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది. తమిళం, కన్నడ సినిమాల్లో కథానాయికగా నటించింది.

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "మా వెబ్ సైటులో రజిత ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 10 November 2016.
  2. "సినిమా కంటే పుస్తకమే మిన్న-సినీ నటి రజిత". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 26 జనవరి 2016. Retrieved 10 November 2016.
  3. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
  4. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  5. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
  6. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  7. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.
  8. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
"https://te.wikipedia.org/w/index.php?title=రజిత&oldid=4195691" నుండి వెలికితీశారు