అనుపమ పరమేశ్వరన్

భారతీయ నటి

అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించింది.ఆమె భర్త పేరు రాజేష్ గోరువ . ఆమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్‌లోని మేరీ జార్జ్, తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అనుపమ పరమేశ్వరన్
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థమహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, కేరళ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015 నుండి ప్రస్తుతం వరకు

ఆరంభ జీవితం మార్చు

అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18[1]న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది.[2] ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నతవిద్యను అభ్యసించింది.[3]తరువాత సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది.[3]

వృత్తి - టీవిషోలు మార్చు

ఈమె మలయాళ సినిమా ప్రేమమ్‌ సినిమాలో నివిన్ పౌలీతో కలిసి నటించడం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని సాధించింది.[4][5] తరువాత ఈమెకు మలయాళ చిత్రం జేమ్స్ & అలైస్ లో అవకాశం చిక్కింది. తరువాత ఆమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు తన్నుకు వచ్చాయి. వాటిలో సమంత, నితిన్ నాయికా నాయకులుగా నటించిన అ ఆ వంటి సినిమాలు ఉన్నాయి.[6][7]ఈమె మాతృభాష మలయాళమైనా తొలి తెలుగు సినిమా అ ఆలో స్వంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తరువాత ఈమె మలయాళం నుండి తెలుగులోనికి పునర్మించబడిన ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది.[8][9] అటు పిమ్మట ఈమె ధనుష్ హీరోగా వెలువడిన తమిళ సినిమా "కోడి"లో నటించింది. ఇది ఆమెకు తొలి తమిళ సినిమా.[10][11] ఈమె 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జంటగా నటించింది. తర్వాత అదే నెలలో విడుదలైన మలయాళ సినిమా "జొమొంతె సువిశేషంగళ్" అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈమె సరసన ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో "అందమైన జీవితం" అనే పేరుతో డబ్ చేయబడింది.[12] 2017 అక్టోబరులో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రామ్‌ పోతినేని సరసన నటించింది. ఇంకా ఈమె నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నది. ఇవి కాకుండా సాయి ధరమ్ తేజ్ సరసన క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై వెలువడనున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.[13]

ఈమె ఇంతవరకు ఆల్ఫోన్స్ పుత్రేన్, సుజీత్ వాసుదేవ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చందూ మొండేటి, ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్, సతీష్ వేగేశ్న, సత్యన్ అంతికడ్, కిశోర్ తిరుమల, మేర్లపాక గాంధీ, ఎ. కరుణాకరన్ వంటి దర్శకులతో పనిచేసింది. వీరిలో చాలామంది పరిశ్రమకు కొత్తవారు కావడం గమనార్హం.

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు మూలాలు భాష ఇతర విషయాలు పాత్ర
2015 ప్రేమమ్ మేరీ జార్జ్ మలయాళం [14]
2016 జేమ్స్ & ఆలిస్ ఇసాబెల్ / పింకీ అతిధి పాత్ర
అ ఆ నాగవల్లి "వల్లి" తెలుగు [15]

[16]

ప్రేమమ్ సుమ [17]
కోడి మాలతీ తమిళ్ [18]
2017 శతమానం భవతి నిత్య తెలుగు [19]
జోమోంటే సువిశేషాలు కేథరిన్ మలయాళం
వున్నది ఒకటే జిందగీ మహా లక్ష్మి "మహా" తెలుగు [20]
2018 కృష్ణార్జున యుద్ధం సుబ్బ లక్ష్మి
తేజ్ ఐ లవ్ యూ నందిని
హలో గురు ప్రేమ కోసమే అనుపమ "అను" [21]
2019 నటసార్వభౌమ శృతి కన్నడ [22]
రాక్షసుడు కృష్ణవేణి తెలుగు [23]
2020 మనియారయిలే అశోక్ శ్యామా మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా [24]

[25]

2021 కురుప్ సిసిలీ అతిధి పాత్ర [26]
తల్లి పొగతేయ్ పల్లవి తమిళ్ [27]
2022 రౌడీ బాయ్స్ కావ్య తెలుగు [28]
అంటే సుందరానికి సౌమ్య అతిధి పాత్ర [29]
కార్తికేయ 2 ముగ్ధ [30]
18 పేజీలు నందిని [31]
సీతాకోకచిలుక గీత [32]
సైరన్ తమిళ్ [33]
2023 JSK మలయాళం
2024 ఈగల్ నిర్మాణంలో ఉంది [34]

పురస్కారాలు, ప్రతిపాదనలు మార్చు

ఈమె పేరు 6 పురస్కారాలలో మొత్తం 10 విభాగాలలో ప్రతిపాదించ బడగా, మూడింటిలో విజేతగా నిలిచింది. ఆ వివరాలు క్రింది పట్టికలో చూడవచ్చు.

సంవత్సరం అవార్డు విభాగం సినిమా భాష వివరణ
2016 11వ రాము కార్యత్ అవార్డులు అత్యంత జనాకర్షక నటి ప్రేమమ్ మలయాళం గెలుపు
ఆసియానెట్ ఫిలిం అవార్డులు ఉత్తమ నటి - తొలి చిత్రం ప్రేమమ్ మలయాళం నామినేటెడ్
5వ సీమా (SIIMA) అవార్డ్ ప్రేమమ్ మలయాళం నామినేటెడ్
2017 అప్సర అవార్డ్స్ అ ఆ గెలుపు
2వ ఐఫా (IIFA) ఉత్సవం ఉత్తమ సహాయ నటి కోడి తమిళ్ నామినేటెడ్
ప్రేమమ్ తెలుగు గెలుపు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అ ఆ తెలుగు నామినేటెడ్
కోడి తమిళ్ నామినేటెడ్
5వ సీమా (SIIMA) అవార్డ్ అ ఆ తెలుగు నామినేటెడ్
ప్రేమమ్ తెలుగు నామినేటెడ్

మూలాలు మార్చు

  1. "అందాల అనుపమా: బర్త్‌డే స్పెషల్ ఫొటో స్టోరీ". Archived from the original on 2022-09-26. Retrieved 2018-03-08.
  2. James, Anu (25 February 2017). "Confirmed: Anupama Parameswaran no more part of Ram Charan-S Kumar movie; is this the reason?". Archived from the original on 25 February 2017. Retrieved 10 September 2017. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 25 జనవరి 2017 suggested (help)
  3. 3.0 3.1 "' I won't do anything out of my comfort zone'". Times of India. 10 October 2015. Archived from the original on 13 October 2015. Retrieved 10 September 2017.
  4. "Premam fever in Tamil Nadu: Movie completes 224 days; Nivin Pauly watches film with Chennai fans". International Business Times. India. 8 January 2016. Archived from the original on 11 January 2016. Retrieved 16 January 2016.
  5. "Unstoppable 'Premam' extends its run in Chennai". Manorama Online. 13 January 2016. Archived from the original on 15 జనవరి 2016. Retrieved 7 మార్చి 2018.
  6. "Trivikram-Nithiin-Samantha's Film Titled 'A.. Aa': 'Premam' Star Anupama to Play 2nd Heroine". International Business Times. India. 10 September 2015. Archived from the original on 13 September 2015.
  7. "'Premam' heroine Anupama Parameshwaran signs another Telugu film". Daily News and Analysis. India: Diligent Media Corporation. 18 March 2016. Archived from the original on 20 March 2016.
  8. "First look of Naga Chaitanya in Telugu remake of 'Premam'". Daily News and Analysis. India: Diligent Media Corporation. 19 February 2016. Archived from the original on 21 February 2016.
  9. "Anupama in a naadan avatar in Premam remake". The Times of India. 11 December 2015. Archived from the original on 18 December 2015. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 19 డిసెంబరు 2015 suggested (help)
  10. "Anupama Parameswaran replaces Shamlee in Dhanush's 'Kodi'". The Indian Express. 13 February 2016. Archived from the original on 14 February 2016.
  11. "Shaamlee out, Anupama bags role in Dhanush's Kodi". Deccan Chronicle. 13 February 2016. Archived from the original on 13 February 2016.
  12. అందమైన జీవితం యూట్యూబ్‌లో
  13. "Anupama Parameshwaran to romance Sai Dharam Tej". 16 August 2017. Archived from the original on 18 August 2017.
  14. "Nivin Pauly's heroine in Premam - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 17 July 2021.
  15. "Anupama Parameswaran moving to Telugu film industry". sajmedia.in. Archived from the original on 15 October 2015. Retrieved 14 October 2015.
  16. "Anupama Parameshwaran makes Tollywood debut". moviemint. Archived from the original on 23 September 2015. Retrieved 11 September 2015.
  17. "Anupama gears up for 'Premam' remake launch". Malayala Manorama. 30 November 2015. Retrieved 26 December 2019.
  18. "Anupama Parameswaran replaces Shamlee in Dhanush's 'Kodi'". The Indian Express. 13 February 2016. Archived from the original on 14 February 2016.
  19. "Nithya from Sathamanam Bhavati". The Times of India (in ఇంగ్లీష్). 18 February 2021. Retrieved 7 July 2021.
  20. "It is 'Vunnadi Okate Zindagi' for Ram Pothineni!". The Times of India. India. 30 July 2017. Archived from the original on 10 August 2017. Retrieved 30 July 2017.
  21. CH, Murali Krishna (19 October 2018). "'Hello Guru Prema Kosame' review: A thin and predictable love story". The New Indian Express. Retrieved 6 March 2022.
  22. Suresh, Sunayana (7 February 2019). "Natasaarvabhowma Review {3/5}: Watch this film if you want a film that has the commercial elements in place, but also has a little twist". The Times of India. Retrieved 9 May 2022.
  23. "Watch Anupama Parameswaran in 'Ratsasan' remake poster". Malayala Manorama. 6 April 2019. Retrieved 30 December 2019.
  24. "Anupama Parameswaran turns assistant director". The New Indian Express. 29 May 2019. Retrieved 26 January 2020.
  25. "Gregory and Anupama Parameswaran in 'Maniyarayile Ashokan'". Sify (in ఇంగ్లీష్). 2 January 2020. Archived from the original on 2 January 2020. Retrieved 26 January 2020.
  26. ANI (11 November 2021). "Dulquer Salmaan starrer Kurup to open across 1500+ screens worldwide tomorrow". ThePrint. Retrieved 25 March 2022.
  27. Karki, Tripti (19 February 2020). "Anupama Parameswaran and Atharvaa Murali's film titled Thalli Pogathey, see first look" (in ఇంగ్లీష్). India TV. Retrieved 29 February 2020.
  28. "Rowdy Boys Teaser: Campus drama ft Ashish, Anupama".
  29. "Ante Sundaraniki Review: Emotional yet entertaining". Hans India. 10 June 2022. Retrieved 10 June 2022.
  30. "Anupama Parameswaran joins Nikhil Siddhartha's Karthikeya 2, watch video". The Indian Express (in ఇంగ్లీష్). 31 August 2021. Retrieved 25 March 2022.
  31. "Despite rains, Nikhil starts shooting". Deccan Chronicle (in ఇంగ్లీష్). 20 October 2020. Retrieved 5 March 2021.
  32. "Butterfly teaser: Anupama Parameswaran starrer seems like an edge-of-the-seat thriller". The Times of India (in ఇంగ్లీష్). 3 March 2022. Retrieved 25 March 2022.
  33. "Anupama Parameswaran joins the cast of Keerthy Suresh and Jayam Ravi starrer 'Siren'". Pinkvilla (in ఇంగ్లీష్). 5 September 2022. Archived from the original on 15 అక్టోబరు 2022. Retrieved 7 డిసెంబరు 2022.
  34. "Ravi Teja: ఆ చూపె మరణం.. ఆ అడుగె సమరం | eagle title announcement". web.archive.org. 2023-08-21. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు మార్చు