బటుకేశ్వర్ దత్

భారతీయ విప్లవకారుడు

బటుకేశ్వర దత్, 1900ల ప్రాంతంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు.[2] అతను భగత్ సింగ్ తో పాటు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1929 ఏప్రిల్ 8 న బాంబు దాడిచేసిన వ్యక్తిగా సుపరిచితుడు. ఆ తర్వాత అతను అరెస్టు అయ్యాడు. జీవిత ఖైదును అనుభవించాడు. అతను జైలులో రాజకీయ ఖైదీల సౌకర్యాలు, హక్కుల విషయంలో చారిత్రాత్మకమైన సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. [3] అతను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కు సభ్యుడుగా ఉన్నాడు.

బటుకేశ్వర్ దత్
జననం(1910-11-18)1910 నవంబరు 18
మరణం1965 జూలై 20(1965-07-20) (వయసు 54)
జాతీయతభారతీయుడు
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, నౌజవాన్ భారత్ సభ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమర యోధుడు

జీవిత విశేషాలు

మార్చు

బటుకేశ్వర్ దత్, బి. కె. దత్, బట్టు, మోహన్ అని కూడా పిలుస్తారు. అతను గోష్ఠ బిహారీ దత్ కుమారుడు. 1910 నవంబరు 18న బర్ద్వాన్ జిల్లాలోని ఒరియా గ్రామంలో  పోలీస్ స్టేషన్: ఖండఘోష్ సమీప బస్టాప్: ఖజుర్హతిలో జన్మించాడు.  బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలోని ఖండా, మౌసులో కూడా నివసించారు. అతను కాన్పూర్‌లోని ఉన్నత పాఠశాల పిపిఎన్ నుండి పట్టభద్రుడయ్యాడు.అతను చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులకు సన్నిహితుడు. అతను 1924 లో కాన్పూర్‌లో భగత్ సింగ్‌ని కలిశాడు.భగత్ సింగ్ కాన్పూర్‌లోని హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో పనిచేస్తున్నప్పుడు బటుకేశ్వర్ దత్ బాంబు తయారీ గురించి తెలుసుకున్నాడు.

1929 లో అసెంబ్లీ పై బాంబ్ పేలుడు ఉదంతం

మార్చు

భారతదేశంలో భగత్ సింగ్ వంటి విప్లవకారుల పెరుగుదలను అణచివేయడానికి, బ్రిటిష్ ప్రభుత్వం డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం 1915 అమలు చేయాలని నిర్ణయించింది, ఈ చట్టం పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది.[4] ఫ్రెంచ్ ప్రజా ప్రతినిధులు చాంబరుపై బాంబు దాడి చేసిన ఫ్రెంచ్ అరాచకవాది ప్రభావంతో [5] భగత్ సింగ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల బాంబు పేల్చే తన ప్రణాళికను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కి ప్రతిపాదించగా, దానికి అది అంగీకరించింది. ప్రారంభంలో బటుకేశ్వర్ దత్, సుఖ్‌దేవ్ ల ద్వారా బాంబును అమర్చాలని నిర్ణయించారు, భగత్ సింగ్ యుఎస్ఎస్అర్ కు వెళ్లాడు.[5] అయితే తర్వాత పథకం మారింది.బాంబు పెట్టేపనిని దత్‌కి అప్పగించాడు.[5] 1929 ఏప్రిల్ 8న, సింగ్, దత్ విజిటర్స్ గ్యాలరీ నుండి పరుగెత్తుకుంటూ అసెంబ్లీ లోపల రెండు బాంబులు విసిరారు. బాంబు నుండి వచ్చిన పొగ హాల్‌ మొత్తాన్ని నింపింది.వారు "ఇంక్విలాబ్ జిందాబాద్!" అంటూ నినాదాలు చేసారు. .(హిందీ-ఉర్దూలో: "విప్లవం లాంగ్ లైవ్!") కరపత్రాల విసిరారు. [6][7][8] వాణిజ్య వివాదాలను వ్యతిరేకించడానికి, లాలా లజపతి రాయ్ మరణంపై బ్రిటీషువారిపై నిరసనగా కరపత్రాలలో పేర్కొనిఉంది.ఆ సమయంలో పబ్లిక్ సేఫ్టీ బిల్లు సెంట్రల్ అసెంబ్లీలో సమర్పించబడుతోంది.[9]ఆ పేలుడులో కొంతమందికి గాయాలు అయ్యాయి.మరణాలు లేవు. ఈ చర్య కావాలని ఉద్దేశపూర్వకంగానే చేసామని సింగ్, దత్ పేర్కొన్నారు.[10] ,సింగ్, దత్ లను పథకం ప్రకారం అరెస్టు చేసారు [10] [11][12]

"ది ట్రిబ్యూన్ ఈ సంఘటనను ఇలా నివేదించింది":

"భారతదేశానికి చెందిన పటేల్ ప్రజా భద్రతా బిల్లుపై తన తీర్పును ఇవ్వడానికి లేచినప్పుడు, జార్జ్ షుస్టర్ సీటు సమీపంలో ఉన్న గ్యాలరీ నుండి రెండు బాంబులు విసిరారు. తీవ్ర భయాందోళనలతో సభ మొత్తం చెదిరిపోయింది. జార్జి షుస్టర్, బి. దలాల్ గాయపడ్డారు, మరికొందరు సభ్యులు స్వల్ప గాయాలతో ఉన్నారు. భగత్ సింగ్, దత్ లను బ్రిటిష్ వారు అరెస్టు చేశారు.

పది నిమిషాల తర్వాత అసెంబ్లీ తిరిగి సమావేశమైంది. ఛాంబర్ పొగతో నిండిపోయింది. పటేల్ సభను వచ్చే గురువారం వరకు వాయిదా వేశారు. బాల్ రాజ్, హోనీ సంతకం చేసిన ఎర్ర కరపత్రం "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ". చీఫ్, మండుతున్న మంటలో వేసాడు.

పోలీసులు కౌన్సిల్ హౌస్‌కు తాళం వేసి సందర్శకుల కదలికలను అడ్డుకున్నారు. బాంబు పడినప్పుడు జె. సైమన్ రాష్ట్రపతి గ్యాలరీలో ఉన్నారు. గాయపడిన వారిలో జి. షస్టర్, బి. దలాల్, రాఘవేంద్రరావు, శంకర్ రావు ఉన్నారు.

బెంగాల్ నుండి బుటుకేశ్వర దత్, పంజాబ్ నుండి భగత్ సింగ్ అరెస్టయ్యారు'' [13]

విచారణ

మార్చు

అతని సహచరులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్‌తో పాటు, బటుకేశ్వర్ దత్‌పై సెంట్రల్ అసెంబ్లీ బాంబ్ కేసులో విచారణ జరిగింది.1929 లో ఢిల్లీ సెషన్స్ న్యాయస్థానం భారత శిక్షాస్మృతి సెక్షన్ 307,  పేలుడు పదార్థాల సెక్షన్ 4 చట్టం కింద జీవిత ఖైదు విధించింది. అతను సెల్యులార్ జైలు, అండమాన్ నికోబార్ దీవులకు బహిష్కరించబడ్డాడు.[14]

చివరి రోజులు

మార్చు

బటకేశ్వర్ దత్ జైలు నుండి విడుదలైన తర్వాత క్షయవ్యాధి బారిన పడ్డాడు. అతను మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు.దానికి అతను మళ్లీ నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అతను మోతిహరి జైలులో ఉన్నాడు (బీహార్ లోని చంపారన్ జిల్లాలో ఉంది). భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను  1947 నవంబరులో అంజలిని వివాహం చేసుకున్నాడు. స్వతంత్ర భారతదేశం అతనికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం. అతను రాజకీయ జీవితానికి దూరంగా, తన మరచిపోయిన రాజకీయనాయకుడుగా తన మిగిలిన జీవితాన్ని గడిపాడు. బటుకేశ్వర్ దత్ తన సహచరులందరినీ మరచిపోయాడు. సుదీర్ఘ అనారోగ్యంతో 1965 జూలై 20 న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలోని హుస్సేనివాలాలో అతడి అంత్యక్రియలు జరిగాయి, అక్కడ అతని సహచరులు భగత్ సింగ్, రాజ్గు రు, సుఖ్‌దేవ్ మృతదేహాలను కూడా చాలా సంవత్సరాల క్రితం దహనం చేశారు. అతను చివరలో తన ఏకైక కుమార్తె, పాట్నాలో నివసిస్తున్న భారతీ బాగ్చి దగ్గర నివసించాడు.అక్కడ అతని ఇల్లు జక్కన్‌పూర్ ప్రాంతంలో ఉంది.

చిన్న విషయం

మార్చు

బి.కె. దత్ కాలనీ న్యూ ఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం ఎదురుగా ఉన్న ప్రధాన ప్రదేశంలో ఉంది. జోర్ బాగ్ ప్రక్కనే ఎయిమ్స్‌లో బటకేశ్వర్ దత్ మరణం పేరు పెట్టబడింది. ఇది న్యూ ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రాంతంలో ఎయిమ్స్  కు సమీపంలోని ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలనీ.

పుస్తకం

మార్చు

ప్రముఖ రచయిత అనిల్ వర్మ (న్యాయమూర్తి) దత్ జన్మదినోత్సవం సందర్భంగా విడుదలైన "బటుకేశ్వర్ దత్: భగత్ సింగ్ కే సహయోగి" అనే పుస్తకాన్ని రాశాడు. దీనిని ప్రభుత్వం ప్రచురించింది. భారతదేశ ప్రచురణ, జాతీయ పుస్తక ప్రచపరణసంస్థ బటుకేశ్వర్ దత్‌పై అన్ని భాషలలో ప్రచురించబడిన మొదటి పుస్తకం ఇది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. "Dutt DOB".
 2. Śrīkr̥shṇa Sarala (1999). Indian Revolutionaries: A Comprehensive Study, 1757-1961. Ocean Books. pp. 110–. ISBN 978-81-87100-18-8. Retrieved 11 July 2012.
 3. Bhagat Singh Documents Hunger-strikers' Demands
 4. "Defence of India Act". Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. Retrieved 28 October 2011.
 5. 5.0 5.1 5.2 Ralhan 1998, pp. 438–439
 6. "INDIA: Jam Tin Gesture". Time (magazine)]]. 22 April 1929. Archived from the original on 22 ఆగస్టు 2013. Retrieved 11 October 2011.
 7. "Bhagat Singh Remembered". Daily Times (Pakistan). Retrieved 28 October 2011.
 8. "Leaflet was thrown in the Central Assembly Hall, New Delhi at the time of the throwing voice bombs". Letter, Writings and Statements of Shaheed Bhagat Singh and his Copatriots. Shahid Bhagat Singh Research Committee, Ludhiana. Retrieved 29 October 2011.
 9. Singh & Hooja 2007, p. 137
 10. 10.0 10.1 "Full Text of Statement of S. Bhagat Singh and B.K. Dutt in the Assembly Bomb Case". Letter, Writings and Statements of Shaheed Bhagat Singh and his Copatriots. Shahid Bhagat Singh Research Committee, Ludhiana. Retrieved 29 October 2011.
 11. "The Trial of Bhagat Singh". India Law Journal. Archived from the original on 1 October 2015. Retrieved 11 October 2011.
 12. Chaman Lal (11 April 2009). "April 8, 1929: A Day to Remember". Mainstream. Retrieved 14 December 2011.
 13. "Bomb explosion in Assembly". The Tribune. India. 9 April 1929. Retrieved 14 December 2011.
 14. R. V. R. Murthy (1 January 2011). Andaman and Nicobar Islands: A Saga of Freedom Struggle. Gyan Publishing House. pp. 176–. ISBN 978-81-7835-903-8.

వెలుపలి లంకెలు

మార్చు