బడే నాగజ్యోతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా ఇంచార్జి  జడ్పీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తుంది. నాగజ్యోతి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.[2][3]

బడే నాగజ్యోతి
బడే నాగజ్యోతి


పదవీ కాలం
  2023 జూన్ 12 - ప్రస్తుతం

పదవీ కాలం
  జూన్ 2019 - 2023 జూన్ 11

పదవీ కాలం
 2019 - జూన్ 2019

వ్యక్తిగత వివరాలు

జననం 5 జనవరి 1994
కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు బడే నాగేశ్వరరావు, రాజేశ్వరి
జీవిత భాగస్వామి ఎట్టి జగదీష్[1]
సంతానం గహన్ శివన్ ధృవన్

జననం, విద్యాభాస్యం మార్చు

బడే నాగజ్యోతి 1994లో ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామంలో బడే రాజేశ్వరి, నాగేశ్వరరావు దంపతులకు జన్మించింది. ఆమె మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్క దంపతుల కుమార్తె. బడే నాగజ్యోతి కాల్వపల్లి, తాడ్వాయి ఆశ్రమ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు, ఆ తరువాత 9, 10వ తరగతి హనుమకొండ చైతన్య హైస్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసి ఏటూరు నాగారం ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ ఆ తరువాత హనుమకొండ పింగిలి కాలేజీలో పీజీ పూర్తి చేసి ఆ తరువాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది.[4][5][6]

రాజకీయ జీవితం మార్చు

బడే నాగజ్యోతి 2019లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాల్వపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలిచింది. ఆమె ఆ తరువాత తాడ్వాయి జెడ్పీటీసీగా ఎన్నికై ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా భాధ్యతలు చేప్పట్టి[7] 2023లో జడ్పీ చైర్మన్‌గా ఉన్న కుసుమ జగదీశ్ మరణంతో ఇంచార్జ్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది. నాగజ్యోతి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.[8][9][10][11]

మూలాలు మార్చు

  1. Disha Daily (16 May 2020). "ఆదర్శ వివాహం చేసుకున్న జెడ్పీ వైస్ చైర్ పర్సన్". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
  2. Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  3. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
  4. Namasthe Telangana (24 August 2023). "బడే నాగజ్యోతికి ఎమ్మెల్యే సీటు ఎందికిచ్చారంటే…". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  5. Namasthe Telangana (25 August 2023). "సీఎం కేసీఆరే నా గాడ్‌ ఫాదర్‌.. నా గెలుపు అధినేతకు కానుకగా అందిస్తా: బడే నాగజ్యోతి". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
  6. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  7. Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  8. V6 Velugu (21 August 2023). "ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే..." Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Sakshi (22 August 2023). "నియోజకవర్గ అభివృద్ధికి కృషి : నాగజ్యోతి". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  10. Andhra Jyothy (22 August 2023). "నాగజ్యోతి ఎంపిక వ్యూహాత్మకమే!". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  11. The Hindu (21 August 2023). "Hand-picked by KCR, Nagajyothi vows to emerge triumphant from ST-reserved Mulugu Assembly constituency" (in Indian English). Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.