తాడ్వాయి మండలం (సమ్మక సారక్క)
తాడ్వాయి మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 91 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 73 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 32 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, తాడ్వాయి
తాడ్వాయి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, తాడ్వాయి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°14′14″N 80°18′38″E / 18.237177°N 80.310631°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ములుగు జిల్లా |
మండల కేంద్రం | తాడ్వాయి |
గ్రామాలు | 41 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 22,879 |
- పురుషులు | 10,893 |
- స్త్రీలు | 11,986 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.17% |
- పురుషులు | 68.09% |
- స్త్రీలు | 42.13% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 22,879 - పురుషులు 10,893 - స్త్రీలు 11,986.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 839 చ.కి.మీ. కాగా, జనాభా 22,879. జనాభాలో పురుషులు 10,893 కాగా, స్త్రీల సంఖ్య 11,986. మండలంలో 5,576 గృహాలున్నాయి.[4]
జిల్లా మార్పులు
మార్చువరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు
మార్చుగతంలో తాడ్వాయి గ్రామం / మండలం వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తాడ్వాయి మండలాన్ని (1+72) డెబ్బైమూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].
జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు
మార్చు2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు తాడ్వాయి మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[6]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- కాల్వపల్లి
- బంజర్ఎల్లాపూర్
- ఆశన్నగూడెం ఎల్లాపూర్
- మేడారం (సమ్మక్క జాతర)
- సెరిగరం
- వీరపురం
- ఊరట్టం
- భూపతిపురం
- కామారం (పి.టి)
- జంపంగవాయి
- గంగారం (పి.ఎ)
- బీరెల్లి
- కన్నెబోయినపల్లి
- అన్నారం
- రంగాపురం (పి.ఎ)
- బయ్యక్కపేట్
- దామెర్వాయి
- నార్లపూర్
- కాటపురం
- గోనేపల్లి
- పంబాపురం
- వెంగళాపురం
- నర్సాపూర్ (పి.ఎ)
- పడిగపురం (పి.పి)
- చౌలేడ్
- ఎల్బాక
- లవ్వల్
- కొండపర్తి
- పోచపల్లి
- ఇమ్మడిగూడెం
- లింగాల
- బిట్టుపల్లి (పి.ఎల్)
- బొల్లేపల్లి (పి.ఎల్)
- వడ్డెగూడెం
- నర్సాపూర్ (పి.ఎల్)
- బొందల్
- అల్లిగూడెం
- తాడ్వాయి
- కౌసెట్టివాయి
- కామారం (పి.ఎ)
- అంకంపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు 32 పరిగణనలోకి తీసుకోబడలేదు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-01-13.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 February 2019. Retrieved 17 February 2019.