బయో ఆసియా సదస్సు

బయో ఏషియా సదస్సు-2022, - ఆసియాలో అతిపెద్ద లైఫ్‌-సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ ఫోరం. హైదరాబాద్‌ వేదికగా 2022 ఫిబ్రవరి 24 ప్రారంభమై వర్చువల్‌ పద్ధతిలో రెండు రోజులపాటు సాగుతుంది.[1] ఈ బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్‌) లో దేశవిదేశాల నుంచి టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు పాల్గొంటారు. తొలిరోజు సాంకేతికత ద్వారా ఆరోగ్య పరిశ్రమలను బలోపేతం చేయడం, కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, హెల్త్‌కేర్‌ డెలివరీ సిస్టమ్‌ను క్రమబద్ధీకరించడం.. అంశాలపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. రెండో రోజున ‘ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధి - నిన్న, నేడు, రేపు’ అనే అంశంపై కీలక చర్చ జరగనుంది. బయో ఆసియా సదస్సుకు సంబంధించిన పూర్తివివరాలకు http://bioasia.in/ వెబ్సైట్ లో చూడవచ్చు.

మూలాలుసవరించు

  1. India, The Hans (2022-02-23). "KTR to inaugurate BioAsia 2022 today". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-24.