బయో ఏషియా సదస్సు-2023

తెలంగాణలోని హైదరాబాదులో 2023లో జరుగనున్న బయో ఏషియా సదస్సు.

బయో ఏషియా సదస్సు-2023, అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 2023లో జరిగిన బయో ఏషియా సదస్సు. ఆసియాలో అతిపెద్ద లైఫ్‌-సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ ఫోరమైన ఈ సమావేశం 2023 ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హెచ్‌ఐసీసీలో జరిగింది.[1] జీవశాస్ర్తాలు, ఔషధ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహించింది. అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌-షేపింగ్‌ ది నెక్స్‌ జనరేషన్‌ ఆఫ్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌ అనే థీమ్​తో నిర్వహించబడిన ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.[2]

బయో ఏషియా సదస్సు-2023
బయో ఏషియా సదస్సు-2023 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రతినిధులు
ప్రక్రియసదస్సు, సమావేశాలు
ప్రారంభంఫిబ్రవరి 24, 2023 (2023-02-24)
ముగింపుఫిబ్రవరి 26, 2023 (2023-02-26)
స్థలంహెచ్‌ఐసీసీ, హైదరాబాదు
ప్రదేశంతెలంగాణ
దేశంభారతదేశం
మునుపటి2022
తరువాతి2024
పాల్గొనువారుదేశవిదేశ ప్రతినిధులు
నిర్వహణతెలంగాణ ప్రభుత్వం

రెండురోజులపాటు లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు, చివరిరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన, జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదానోత్సవం మొదలైనవి జరిగాయి.

175 ఎగ్జిబిటర్లతో ట్రేడ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయగా, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రోజుకు దాదాపు 1,100 మంది చొప్పున రెండున్నర రోజుల్లో 2,300 మందికి పైనే సందర్శించారు. ఈ సదస్సులో 2015 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, వీరిలో 50కి పైగా దేశాల నుంచి ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.[3]

లోగో, థీమ్​లను ఆవిష్కరణ

మార్చు
 
బయో ఏషియా సదస్సు-2023 లోగో, థీమ్​లను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్

ఈ సదస్సుకు సంబంధించిన లోగో, థీమ్​లను ప్రగతిభవన్‌లో 2022 ఆగస్టు 23న తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తినాగప్పన్‌లు పాల్గొన్నారు.[4]

ప్రారంభం

మార్చు

2023 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో ఉదయం 10 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించాడు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.[5][6]

మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం అనే నినాదంతో నిర్వహించబడుతున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి దాదాపు 5,600 మంది (సగటున రోజూ 1100 మంది సందర్శన) ప్రభుత్వ ప్రముఖులు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, నోబెల్‌ పురస్కార విజేతలు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధుల పాల్గొన్నారు.[7] వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచస్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్‌ సెషన్స్‌, సీఈవో కాంక్లేవ్‌, స్టార్టప్‌ షోకేస్‌, బయోపార్క్‌ సందర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

సదస్సు షెడ్యూల్

మార్చు

24-02-2023 (శుక్రవారం)

  • ఉదయం 11.30 గంటలకు ఫార్మా రంగంపై వాస్ నరసింహన్ కీలకోపన్యాసం.
  • మ్యధ్యాహ్నం 12.30 గంటలకు 'వన్ హెల్త్- సైన్స్, దేశీయ పరిజ్ఞానం, విధానాలు' అనే అంశంపై బృంద చర్చ. సీఈపీఐ సీఈవో రిచర్డ్ హ్యాచెట్ ప్లీనరీ టాక్.
  • మ్యధ్యాహ్నం 2.30 గంటలకు 'హెల్త్కేర్ ఫర్ ఆల్- సక్సెస్, చాలెంజెస్' అనే అంశంపై బృంద చర్చ.
  • మ్యధ్యాహ్నం 3.50 గంటలకు 'హెల్త్కేర్ రీఇమాజిన్డ్- టెలీ మెడిసిన్, వేరియబుల్స్, మెటావెర్స్'లో హెల్త్కేర్ అంశంపై బృంద చర్చ.
  • సాయంత్ర 5.45 గంటలకు జీనోమ్ వ్యాలీ ఎక్స్ లెన్స్ అవార్డ్-2028 ప్రదానోత్సవం.
  • సాయంత్రం 6.10 గంటలకు 'ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్- వాట్ ఈజ్ నెక్ట్స్ ఫర్ ఇండియా' అనే అంశంపై సీఈవో కాంక్లేవ్ బృంద చర్చ. ఇందులో మంత్రి కేటీఆర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్ రెడ్డి, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, బయొలాజి కల్ ఈ ఎండీ మహిమా దాట్ల, గ్లెన్మార్క్ ఫార్మా సీఎండీ గ్లెన్ సల్దానా, జుబిలెంట్ భాటియా గ్రూప్ వ్యవస్థాపకుడు హరి ఎస్ భాటియా తదితరులు పాల్గొన్నారు.


25-02-2023 (శనివారం)

  • ఉదయం 10.30 గంటలకు ఫైర్సైడ్ చాట్. ఆపిల్ వైస్ ప్రెసి డెంట్(హెల్త్) సంబుల్ దేశాయ్, అపోల్ హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి పాల్గొన్నారు.
  • ఉదయం 11.20 గంటలకు 'డాటా అనలెటిక్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్సఫార్మ్ డ్రగ్ ఆర్అండ్ డీ-రీడిఫైనింగ్ ఇన్నోవేషన్' అనే అంశంపై బృందచర్చ. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్. చంద్రశేఖర్ పాల్గొన్నారు.
  • మ్యధ్యాహ్నం 12.30 గంటలకు 'ఇండియా ఫర్ ఇండియా అండ్ ఇండియా ఫర్ వరల్డ్- వేర్ డజ్ క్వాలిటీ స్టాండ్' అనే అంశంపై బృందచర్చ. 2.30 గంటలకు 'మెడ్-టెక్ పెనెట్రేషన్- వాట్ ఈజ్ ద వే అహెడ్' అనే అంశంపై బృందంతో చర్చ
  • మ్యధ్యాహ్నం 3.35 గంటలకు 'ఇంటిగ్రేటెడ్ హెల్త్కేర్- ది ఫ్యూచర్ ఆఫ్ కేర్ డెలివరీ మాడల్' అనే అంశంపై బృందచర్చ. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
  • మ్యధ్యాహ్నం 4.40 గంటలకు 'గ్లోబల్ సప్లై చెయిన్ ట్రాన్స్ఫర్మేషన్'పై బృందంతో చర్చ.
  • సాయంత్రం 5.45 గంటలకు స్టార్టప్ షోకేస్ అండ్ వ్యాలిడిక్టరీ సెర్మనీ. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
  • రాత్రి 7.00 గంటలకు ఆహ్వానితులకు గాలా డిన్నర్.


26-02-23 (ఆదివారం)

  • ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జిబిషన్ అండ్ నెట్వర్కింగ్ తో సదస్సు ముగింపు

ప్రతినిధులు

మార్చు

ఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌, కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ఎస్‌. చంద్రశేఖర్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు (హెల్త్‌) వీకే పాల్‌, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ అదనపు సీఈవో బసంత్‌ గార్గ్‌, కేంద్ర ఔషధ శాఖ కార్యదర్శి ఎస్‌ అపర్ణ, ప్రపంచ వాణిజ్య వేదిక ఆరోగ్య సంరక్షణ హెడ్‌ శ్యామ్‌ బిషెన్‌, నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌, నోవార్టిస్‌ కంట్రీ ప్రెసిడెంట్‌ అమితాబ్‌ దూబే, మోడర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్‌ లాంగర్‌, సీఈపీఐ సీఈవో రిచర్డ్‌ హ్యాచెట్‌, యూఎస్‌ ఎఫ్‌డీఏ అసోసియేట్‌ కమిషనర్‌ మార్క్‌ అబ్డో, యూఎస్‌ ఎఫ్‌డీఏ డైరెక్టర్‌ కార్మెల్‌ రోసా, జీఎస్‌కే సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ అగమ్‌ ఉపాధ్యాయ్‌, బ్రిస్టల్‌ మైర్స్‌ స్కిబ్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సమిత్‌ హీరావత్‌, ఆపిల్‌ హెల్త్‌ ఉపాధ్యక్షురాలు సంబుల్‌ దేశాయ్‌, పిరమల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌, సన్‌ ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వీ, బయొలాజికల్‌ ఈ ఎండీ మహిమా దాట్ల, అపోలో దవాఖానల సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[8]

మూలాలు

మార్చు
  1. G 2346, Naga Sridhar (2022-08-24). "BioAsia 2023 to be held in February 24-26". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Bio Asia Summit 2023 ఫిబ్రవరి 24 నుంచి హైదరాబాదులో బయో ఆసియా సదస్సు". ETV Bharat News. 2022-08-24. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.
  3. telugu, NT News (2023-02-27). "భవితకు భరోసా.. బయో ఏషియా". www.ntnews.com. Archived from the original on 2023-02-27. Retrieved 2023-02-27.
  4. Today, Telangana (2022-08-23). "BioAsia 20th edition to be held in Hyderabad from Feb 24-26". Telangana Today. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.
  5. India, The Hans (2023-02-24). "Minister KTR opens 20th Edition of BioAsia in Hyderabad". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-24.
  6. "Bio Asia: హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు". EENADU. 2023-02-24. Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-24.
  7. telugu, NT News (2022-08-24). "ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు". Namasthe Telangana. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.
  8. telugu, NT News (2023-02-24). "Bio Asia2023 | నేటి నుంచి బయోఏషియా సదస్సు.. ఇదీ షెడ్యూల్‌". www.ntnews.com. Archived from the original on 2023-02-24. Retrieved 2023-02-24.

బయటి లింకులు

మార్చు