బర్ఫీ (హిందీ సినిమా)

2012 హిందీ చలన చిత్రం

బర్ఫీ! 2012లో విడుదలైన భారతీయ కామెడీ డ్రామా సినిమా. ఈ సినిమాకు అనురాగ్ బసు కథా రచయితగా, దర్శకుడిగా, సహనిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా 1970ల నాటి కథను వర్ణిస్తుంది. ఇది డార్జలింగ్ లో నివసించే మర్ఫీ బర్ఫీ జాన్సన్ అనే ఒక చెవిటి, మూగ నేపాలీ కుర్రవాడు, అతనికి శృతి, జిల్‌మిల్ అనే ఇద్దరు యువతులతో ఉన్న సంబంధాల గురించిన కథ.రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో సౌరభ్ శుక్లా, ఆశిష్ విద్యార్థి, జిస్సు సేన్‌గుప్తా, రూపా గంగూలీ సహాయక పాత్రలలో నటించారు.

బర్ఫీ!
బర్ఫీ! సినిమా పోస్టర్
దర్శకత్వంఅనురాగ్ బసు
స్క్రీన్ ప్లేఅనురాగ్ బసు
కథఅనురాగ్ బసు
తని బసు
నిర్మాతరోనీ స్క్రూవాలా,
సిద్ధార్థ్ రాయ్ కపూర్
తారాగణం
Narrated byఇలియానా
ఛాయాగ్రహణంరవి వర్మన్
కూర్పుఆకివ్ అలీ
సంగీతంప్రీతమ్
నిర్మాణ
సంస్థ
ఇషానా మూవీస్
పంపిణీదార్లుయుటివి మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
14 సెప్టెంబరు 2012 (2012-09-14)
సినిమా నిడివి
150 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్40 కోట్లు[2]
బాక్సాఫీసుest. అంచనా 175 కోట్లు[3]

సుమారు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 2012 సెప్టెంబరు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని పొంది 2012లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా పేరు గడించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల వ్యాపారాన్ని చేసింది.

ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగరీలో 85వ ఆస్కార్ అవార్డు కొరకు అధికారికంగా భారతదేశం తరఫున నామినేషన్ కొరకు ఎంపిక చేయబడింది. ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది. అనేక అవార్డుల కొరకు ప్రతిపాదించబడింది. ఈ సినిమా 58వ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలకు 13 విభాగాలలో పోటీపడి ఏ ఇతర సినిమాలకన్నా ఎక్కువగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు మొదలైన 7 విభాగాలలో అవార్డులను గెలుచుకుంది.

మర్ఫీ బర్ఫీ జాన్సన్ (రణబీర్ కపూర్) డార్జిలింగ్‌లోని ఒక నేపాలీ జంటకు జన్మించాడు. ఇతని తల్లి ఇతని బాల్యంలోనే చనిపోతుంది. ఇతని తండ్రి డ్రైవర్‌గా పనిచెస్తూ ఇతన్ని పెంచి పెద్ద చేస్తాడు. బర్ఫీ అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. అమాయకులపై ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ, అందరినీ ఇబ్బంది పెడుతుంటాడు. స్థానిక పోలీసు ఆఫీసర్ సుధాంశు దత్తా ఎప్పుడూ ఇతడిని తరుముతూ ఉంటాడు. బర్ఫీకి అప్పుడే డార్జిలింగ్‌కు వచ్చిన శృతీఘోష్‌ (ఇలియానా) తారసపడుతుంది. శృతికి రంజిత్ సేన్‌గుప్తాతో ఎంగేజ్‌మెంట్ కుదిరి ఉంటుంది. మరో మూడు నెలల్లో వారి పెళ్ళి ఉంటుంది. బర్ఫీ శృతిపై మోజును పెంచుకుంటాడు. శృతి కూడా బర్ఫీని ప్రేమిస్తుంది. అయితే శృతి అమ్మ శృతికి బర్ఫీ పేదరికం గురించి నూరిపోస్తుంది. శృతి తల్లి మాట విని బర్ఫీతో తెగతెంపులు చేసుకుని కలకత్తాకు వెళ్లిపోతుంది.

ఈలోగా బర్ఫీ తండ్రి మంచాన పడతాడు. అతనికి వైద్యం చేయడానికి బర్ఫీకి ఎలాగైనా డబ్బు సంపాదించాల్సి ఉంది. స్థానిక బ్యాంకును దోచుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానితో తన బాల్య స్నేహితురాలు జిల్‌మిల్ చటర్జీ (ప్రియాంక చోప్రా)ను కిడ్నాప్ చేసి ధనవంతుడైన ఆమె తాత నుండి డబ్బు గుంజాలని పథకం వేస్తాడు. కానీ అప్పటికే జిల్‌మిల్ కిడ్నాప్ చేయబడిందని గుర్తిస్తాడు. వ్యాన్‌లో బంధించబడి ఉన్న జిల్‌మిల్‌ను చూచి బర్ఫీ ఆ వ్యాన్‌ను దూరంగా తీసుకు వెళ్లి ఆమెను పోలీసులకు చిక్కకుండా తన అపార్ట్‌మెంట్‌లో దాచిపెడతాడు. బర్ఫీ ఆమెను కిడ్నాప్ చేసినందుకు డబ్బును సంపాదిస్తాడు కానీ అప్పటికే అతని తండ్రి మరణిస్తాడు. ఖిన్నుడైన బర్ఫీ జిల్‌మిల్‌ను ఆమె గ్రామంలో ఆమె సంరక్షకుని వద్ద వదిలి పెట్టడానికి చూస్తాడు కానీ ఆమె బర్ఫీని వదిలి వెళ్లడానికి నిరాకరిస్తుంది. ఇద్దరూ కలకత్తా వెడతారు.

ఆరేళ్ల తర్వాత అనుకోకుండా శృతి, బర్ఫీ ఒకరికొకరు తారసపడతారు. శృతి తన వివాహంతో అసంతృప్తిగా ఉండి, బర్ఫీతో తన పాత స్నేహాన్ని కొనసాగించాలనుకుంటుంది. వీరిద్దరినీ చూసిన జిల్‌మిల్ మనస్తాపం చెంది వెళ్లిపోతుంది. శృతి జిల్‌మిల్ తప్పిపోయినట్లు పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేస్తుంది. డార్జిలింగ్ పోలీసులు ఈ రిపోర్టు గురించి తెలుసుకుని కలకత్తా వచ్చి బర్ఫీని అంతకు ముందు కేసులో అరెస్టు చేస్తారు. విచారణలో ఆమెను కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకునే క్రమంలో ఆమెను చంపివేసినట్లు, ఆమె మృతశరీరం లభించనట్లు తేలుతుంది. ఈ కేసును మూసివేయడానికి నేరాన్ని బర్ఫీ మీదకు త్రోసివేయడానికి పోలీసులు ప్రయత్నిస్తాడు. అయితే బర్ఫీమీద ఇష్టం ఉన్న సుధాంశు దత్త బర్ఫీని తీసుకుని దూరంగా వెళ్లిపొమ్మని శృతికి చెబుతాడు. ఆమె దానికి అంగీకరించి జిల్‌మిల్ ఇప్పుడు తనకు అడ్డంగా లేదు కనుక బర్ఫీతో సుఖంగా ఉండాలని అనుకుంది.

బర్ఫీ జిల్‌మిల్‌ మరణంతో క్రుంగి పోయి ఉంటాడు. శృతితో కలిసి జీవించడానికి అంగీకరించడు. జిల్‌మిల్ చిన్నతనంలో నివసించిన ప్రాంతానికి బర్ఫీ శృతిని తీసుకువెడతాడు. అక్కడ జిల్‌మిల్ బ్రతికే ఉన్నట్టు వారు కనుగొంటారు. రెండు సార్లు కిడ్నాప్ చేయడం అనేది ఆమె తండ్రి ఆడిన నాటకమని, ఆమె ఆస్తిని కాజేయడానికి పన్నిన పన్నాగమని తెలుస్తుంది. రెండవసారి జిల్‌మిల్ మరణించినట్లు కథను సృష్టించి ఆమెను తన తాగుబోతు తల్లి నుండి దూరంగా ఉంచడానికి ఆడిన నాటకం అని తెలుస్తుంది. బర్ఫీ జిల్‌మిల్‌ను కలుసుకోవడంతో సంతోషిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. శృతి తన శేషజీవితాన్ని ఒంటరిగా గడుపుతుంది.

చాలా యేళ్ల తర్వాత బర్ఫీ చావుబతుకుల్లో ఉంటూ ఆసుపత్రి పడకపై పడుకుని ఉంటాడు. జిల్‌మిల్ వచ్చి ఆ పడకపైన బర్ఫీ ప్రక్కగా పడుకుంటుంది. శృతి వారిద్దరూ ప్రశాంతంగా మరణించి ఉండడాన్ని గమనిస్తుంది.

నటీనటులు

మార్చు
 • రణబీర్ కపూర్ - మర్ఫీ బర్ఫీ బహదూర్
 • ప్రియాంక చోప్రా - జిల్‌మిల్ చటర్జీ
 • ఇలియానా- శృతి ఘోష్ సేన్‌గుప్తా
 • సౌరభ్ శుక్లా - సుధాంశు దత్తా, సీనియర్ పోలీసు అధికారి
 • ఆకాశ్ ఖురానా - జంగ్ బహదూర్, బర్ఫీ తండ్రి
 • ఆశిష్ విద్యార్థి - దుర్జయ్ చటర్జీ, జిల్‌మిల్‌ తండ్రి
 • రూపా గంగూలీ - శృతి తల్లి
 • హరధన్ బందోపాధ్యాయ్ - డాబు
 • ఉదయ టికేకర్ - శృతి తండ్రి
 • అరుణ్ బాలి - జిల్‌మిల్ తాత
 • భోలరాజ్ సప్కోట - బర్ఫీ మిత్రుడు
 • జిష్షూసేన్ గుప్తా - రంజీత్ సేన్ గుప్తా
 • సుమన చక్రవర్తి - శృతి స్నేహితురాలు

నిర్మాణం

మార్చు

అనురాగ్ బసు తాను ముందు దర్శకత్వం వహించిన సినిమా కైట్స్ (2010) నిర్మాణ సమయంలో రెండు పేజీల కథను వ్రాసుకున్నాడు. అదే తరువాత బర్ఫీ సినిమాగా రూపాంతరం చెందింది.[4]

రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా ముఖ్య భూమికలను పోషించారు

మొదట దర్శకుడు అనురాగ్ బసు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌లను తీసుకోవాలనుకున్నాడు. 2010, మార్చి 10న టైమ్స్ ఆఫ్ ఇండియాలో "కామోషి" అనే సినిమా (తరువాత "సైలెన్స్" అనుకున్నారు) కోసం కత్రినా కైఫ్, రణబీర్ కపూర్‌లు సంతకం చేశారని వార్త వచ్చించి.[5] బసు మూడవ పాత్రకు కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నాడు.[6] బసు భార్య తని ప్రియాంక చోప్రా పేరును ఆ పాత్రకు సూచించింది.[6] చోప్రా ఎంపికైన తర్వాత కైఫ్ ఈ ప్రాజెక్టు నుండి తెలియని కారణాలతో వైదొలగింది.[7] ప్రియాంక చోప్రాకు మంచి పాత్ర లభించడంతో కత్రినా కైఫ్ వైదొలగిందని మీడియాలో వార్తలు వచ్చాయి.[8] తరువాత ఆసిన్ ఈ పాత్రను వేయడానికి ముందుకు వచ్చినట్లు మీడియా రిపోర్ట్ చేసింది.[9] చివరకు 2010, డిసెంబరులో ఆ పాత్రకు ఇలియానాను ఎంపిక చేశారు.[10] ఈ సినిమా ప్రధాన చిత్రీకరణ 2011, మార్చిలో ప్రారంభమైంది.[11][12] బర్ఫీ! 2011 జూన్ - 2012 ఫిబ్రవరి మధ్య చిత్రీకరణ ముఖ్యంగా డార్జిలింగ్‌లో పూర్తి చేసుకుంది.[13]

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటలకు ప్రీతమ్‌ సంగీతం అందించగా స్వానంద్ కిర్కిరే, ఆశిష్ పండిట్, నీలేష్ మిశ్రా, సయీద్ ఖాద్రి పాటలను రచించారు.[14] ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఒక పాట పాడవలసి ఉంది. అయితే ఆమె యూనివర్సల్ మ్యూజిక్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంతో ఆ అవకాశాన్ని వదులుకుంది.[15]

పాటల జాబితా
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."ఆలా బర్ఫీ"స్వానంద్ కిర్కిరేప్రీతంమోహిత్ చౌహాన్5:19
2."మై క్యా కరూ"ఆశిష్ పండిట్ప్రీతంనిఖిల్ పౌల్ జార్జ్4:30
3."క్యోఁ"నీలేష్ మిశ్రాప్రీతంపాపన్, సునిధి చౌహాన్4:26
4."ఫిర్ లే ఆయా దిల్"సయీద్ ఖాద్రిప్రీతంఆరిజిత్ సింగ్5:05
5."ఆషియాఁ"స్వానంద్ కిర్కిరేప్రీతంశ్రేయ ఘోషాల్, నిఖిల్ పౌల్ జార్జ్3:56
6."సావలీ సీ రాత్"స్వానంద్ కిర్కిరేప్రీతంఆరిజిత్ సింగ్5:08
7."ఆలా బర్ఫీ"స్వానంద్ కిర్కిరేప్రీతంస్వానంద్ కిర్కిరే5:41
8."ఫిర్ లే ఆయా దిల్"సయీద్ ఖాద్రిప్రీతంరేఖా భరద్వాజ్4:45
9."ఫిర్ లే ఆయా దిల్"సయీద్ ఖాద్రిప్రీతంషాఫక్త్ అమానత్ అలీ5:03
10."ఆషియాఁ (సోలో)"స్వానంద్ కిర్కిరేప్రీతంనిఖిల్ పౌల్ జార్జ్4:08
11."ఫటాఫటీ"అమితాబ్ భట్టాచార్యప్రీతంప్రీతం, రణబీర్ కపూర్3:46

విడుదల

మార్చు

బర్ఫీ! సినిమా 2012, సెప్టెంబరు 14వ తేదీన దేశవ్యాప్తంగా 700 సినిమా థియేటర్లలో 1300 తెరలపై విడుదలయ్యింది.[16]

బాక్స్ ఆఫీస్

మార్చు

ఈ సినిమా విడుదల రోజు 8.56 కోట్లు వసూలు చేసింది.[17] రెండవ రోజు ఇది 115కోట్లకు పెరిగింది.[18] మొదటి వారం ఈ సినిమా మొత్తం 56.5 కోట్లను వసూలు చేసింది.[19] ఈ సినిమా మూడవ వారం తరువాత "సూపర్ హిట్"గా ప్రకటించబడింది.[20] ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్లను గడించింది.[3][21]

పురస్కారాలు

మార్చు

బర్ఫీ!ఛాయాగ్రహణం, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటీనటుల విభాగాలలో అనేక అవార్డుల కొరకు పరిశీలింపబడడమే కాక కొన్నింటిని కైవసం చేసుకుంది. ఈ సినిమా అకాడమీ పురస్కారాలు - ఉత్తమ విదేశీ చిత్రం కేటగరీలో 85వ అకాడమీ పురస్కారాలకు భారతదేశం తరఫున అధికారికంగా ప్రతిపాదించ బడింది.[22] ఈ సినిమా 58వ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలకు 13 నామినేషన్లు లభించగా వాటిలో ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు వంటి ఏడు అవార్డులను గెలుచుకుంది.[23][24] ఈ సినిమా 19వ స్క్రీన్ అవార్డులకు 23 విభాగాలలో పోటీ పడగా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ జంట వంటి 9 అవార్డులను కైవశం చేసుకుంది.[25][26][27] 14వ జీ సినీ అవార్డులలో 9 నామినేషన్లలో 8 అవార్డులను గెలుచుకుంది. వాటిలో ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులున్నాయి.[28][29]

మూలాలు

మార్చు
 1. "Barfi! (PG)". British Board of Film Classification. 11 September 2012. Archived from the original on 31 January 2016. Retrieved 1 October 2012.
 2. Thakkar, Mehul S (22 September 2012). "Directors who got their mojo back". The Times of India. Archived from the original on 25 అక్టోబరు 2012. Retrieved 11 April 2013.
 3. 3.0 3.1 "Top Ten Worldwide Grossers 2012". Box Office India. 17 January 2013. Archived from the original on 2 జూన్ 2013. Retrieved 13 మార్చి 2018.
 4. Prabhakaran, Mahalakshmi (13 September 2012). "Anurag Basu's happy state of mind the reason behind Barfi!". Daily News and Analysis. Archived from the original on 29 October 2012. Retrieved 11 April 2013.
 5. "Priyanka to act with Katrina". Mid Day. 29 March 2010. Archived from the original on 4 October 2013. Retrieved 3 February 2013.
 6. 6.0 6.1 Barfi! Bonus Disc: The Making of Barfi!. Event occurs at approximately 13:40
 7. "Priyanka's powerful 'Silence'". The Times of India. 23 July 2010. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 9 January 2013.
 8. "Katrina quits Ranbir's film". Mid Day. 31 March 2010. Archived from the original on 4 October 2013. Retrieved 3 February 2013.
 9. Jha, Subhash K. (18 November 2010). "Asin, Priyanka in Anurag's next!". The Times of India. Archived from the original on 3 జూన్ 2013. Retrieved 9 January 2013.
 10. Jha, Subhash K. (13 December 2010). "Anurag Basu confirms Telugu actress Ileana D'Cruz opposite Ranbir in Barfii". Bollywood Hungama. Archived from the original on 3 October 2012. Retrieved 9 January 2013.
 11. Jha, Subhash K. (26 March 2011). "Priyanka Chopra begins shooting for Anurag Basu's Barfi". Bollywood Hungama. Archived from the original on 1 May 2011. Retrieved 12 April 2011.
 12. Jha, Subhash K. (5 October 2011). "Release Dates". Bollywood Hungama. Archived from the original on 7 October 2011. Retrieved 5 October 2011.
 13. Banerjee, Amitava (24 September 2012). "Barfi! emerges as Darjeeling's brand ambassador". Hindustan Times. Archived from the original on 21 June 2016. Retrieved 30 December 2012.
 14. Holla, Anand. "On Record — Yum this Barfi!". The Times of India. Retrieved 11 April 2013.[permanent dead link]
 15. "Why did Priyanka Chopra refuse to sing for 'Barfi!'?". NDTV. 7 August 2012. Archived from the original on 14 సెప్టెంబరు 2015. Retrieved 13 మార్చి 2018.
 16. "Barfi! Has Excellent Weekend". Box Office India. 17 September 2012. Archived from the original on 19 September 2012. Retrieved 11 April 2013.
 17. "Barfi! First Day Territorial Breakdown". Box Office India. 15 September 2012. Archived from the original on 17 September 2012. Retrieved 11 April 2013.
 18. "Barfi! Has Huge Growth On Saturday". Box Office India. 16 September 2012. Archived from the original on 18 September 2012. Retrieved 11 April 2013.
 19. "Barfi! Week One Territorial Breakdown". Box Office India. 24 September 2012. Archived from the original on 27 September 2012. Retrieved 11 April 2013.
 20. "New Releases Poor OMG! Oh My God Excellent Barfi! Closing In On 100 Crore". Box Office India. 5 October 2012. Archived from the original on 2 December 2012. Retrieved 11 April 2013.
 21. "Fastest To The Century: Barfi! In 17 Days". Box Office India. 9 October 2012. Archived from the original on 11 October 2012. Retrieved 11 April 2013.
 22. "Ranbir Kapoor's Barfi! out of the Oscar race". Hindustan Times. 5 December 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 13 మార్చి 2018.
 23. "58th Idea Filmfare Awards nominations are here!". Filmfare. 13 January 2013. Archived from the original on 27 డిసెంబరు 2014. Retrieved 13 మార్చి 2018.
 24. "Winners of 58th Idea Filmfare Awards 2012". Bollywood Hungama. 20 January 2013. Archived from the original on 23 January 2013. Retrieved 21 January 2013.
 25. "Nominations: 19th Annual Colors Screen Awards". Bollywood Hungama. 2 January 2013. Archived from the original on 5 January 2013. Retrieved 4 January 2013.
 26. "Winners of 19th Annual Colors Screen Awards". Bollywood Hungama. 12 January 2013. Archived from the original on 25 September 2013. Retrieved 13 January 2013.
 27. "Winner's of 19th Annual Screen Awards". The Indian Express. Archived from the original on 14 జనవరి 2013. Retrieved 13 మార్చి 2018.
 28. "Nominations for Zee Cine Awards 2013". Bollywood Hungama. 29 December 2012. Archived from the original on 2 January 2013. Retrieved 4 January 2013.
 29. "Winners of Zee Cine Awards 2013". Bollywood Hungama. Archived from the original on 27 December 2013. Retrieved 14 January 2013.

బయటి లింకులు

మార్చు