బలివాడ కాంతారావు

భారతీయ రచయిత

బలివాడ కాంతారావు[1] (జూలై 3, 1927 - మే 6, 2000) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు రాశారు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు[2]. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయనకి తెలుగు, ఇంగ్లీషే కాక బెంగాలీ, ఒరియా కూడా వచ్చు.[3] బలివాడ కథలన్నీ 'చదువు-ఆగు-ఆలోచించు-సాగు ' అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, కాంతారావుగారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కరలేని దాన్ని పాఠకులకి వదిలేసి, వెల్లడి చేసినదానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి.[4]

బలివాడ కాంతారావు
జననంబలివాడ కాంతారావు
(1927-07-03)1927 జూలై 3
Indiaమడపాం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2000 మే 06
ఉద్యోగంభారత నౌకాదళం
ప్రసిద్ధిప్రముఖ నవలా,కథా రచయిత
పదవి పేరుడిప్యుటీ జనరల్ మేనేజర్
మతంహిందూ
భార్య / భర్తశారద
తండ్రిసూర్యనారాయణ
తల్లిరవణమ్మ

ఇతర విశేషాలు

మార్చు
  • ఈయన రచన దగాపడిన తమ్ముడు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషలలోకీ విడుదల చేసారు.1972లో పుణ్యభూమీ నవలకు అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
  • 1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు లభించాయి.
  • సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు
  • 1993లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[5]
  • 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం,రావి శాస్త్రి స్మారక పురస్కారం
  • 1998లో విశాలంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన బలివాడ కాంతారావు కథలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
  • అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించాయి.బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సింద్ధాంత వ్యాసాలను రాసి పి.హెచ్.డి. డిగ్రీలు,కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు సంపాదించారు.

రచనలు

మార్చు

నవలలు

మార్చు
  1. జన్మభూమి
  2. అమ్మి
  3. సంపంగి
  4. ఇదే నరకం ఇదే స్వర్గం
  5. మన్నుతిన్నమనిషి
  6. వంశధార
  7. పుణ్యభూమి
  8. గోడమీద బొమ్మ
  9. దగాపడిన తమ్ముడు
  10. ఢిల్లీ మజిలీలు
  11. దేవుళ్ళ దేశం
  12. నాలుగు మంచాలు (ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికం)
  13. మరో రాజశేఖరచరిత్ర

కథాసంపుటాలు

మార్చు
  1. కావడి కుండలు - 1955
  2. బూచీ -1952
  3. దొంగలు - 1952
  4. అంతరాత్మ- 1956
  5. అన్నపూర్ణ - 1968
  6. గోపురం - 1994
  7. బలివాడ కాంతారావు కథలు (1987,1994)
  8. శోధన
  1. అంతరాత్మ
  2. అడవి పూవు
  3. అడ్డదారి
  4. అదృష్టం తెచ్చిన ఇల్లు
  5. అదృష్టచిహ్నం
  6. అదృష్టవంతుడు
  7. అనందం
  8. అన్నదమ్ములు
  9. అన్నపూర్ణ
  10. అన్వేషణ
  11. అభ్యుదయం
  12. అమృతహస్తం
  13. అమ్మ
  14. అరచేయి
  15. అర్ధ భాగాల్లో...
  16. అలుడికి బలుడు
  17. అవతార పురుషులు
  18. అశాంతి
  19. ఆకలి
  20. ఆకాలపు మనిషి
  21. ఆఖరి ఛాన్స్
  22. ఆట
  23. ఆనందం
  24. ఆప్యాయత
  25. ఆరాధన
  26. ఆశల అంతం
  27. ఆశాగానం
  28. ఆస్వాదన
  29. ఇంటికోసం
  30. ఇద్దరు మిత్రులు
  31. ఈగ తేనెటీగ
  32. ఉద్దానంలో ఒకరాత్రి
  33. ఉద్యోగాలు
  34. ఉన్నత శఖరాలు
  35. ఉన్నది లేనిది
  36. ఉపదేశం
  37. ఊపిరి
  38. ఎందుకొచ్చిన చావు
  39. ఎడబాటు
  40. ఓట్ల సంబరం
  41. కథానాయకి
  42. కదలిక
  43. కనకపు సింహాసనం
  44. కన్నకడుపు
  45. కన్నభూమి కనుగొన్నత్రోవ
  46. కలలపంట
  47. కాయకన్ను-పూవుకన్ను
  48. కార్మికులూ-యజమానులూ
  49. కి టి కీ
  50. కుక్కీ చెప్పిన జోస్యం
  51. కుస్తీ
  52. కూలీ
  53. కెంపు
  54. కొండను తవ్వి
  55. కోరికల సత్యం
  56. గడచిపోయిన గాథలు
  57. గర్వకారణం
  58. గాజుబొమ్మ
  59. గుడ్డిప్రేమ
  60. గులకరాళ్లు
  61. గులాబి
  62. గేటు
  63. గొర్రెపిల్ల
  64. గోపురం
  65. చక్ర తీర్ధ
  66. చిరునగవు
  67. చివరి అంకం
  68. చీడు
  69. చైత్రపర్వం
  70. చైనా
  71. జంట
  72. జాగృతి
  73. జాతకం
  74. జీవితార్థం
  75. డోనాపౌలా
  76. తగాదా
  77. తరతరానికీ తేడా
  78. తాజ్ మహల్
  79. తారాజువ్వ
  80. తిరుగులేని న్యాయం
  81. తిరుపతి
  82. తీర్పు
  83. తెగినగాలిపటం
  84. తెర
  85. తెల్లకలువ
  86. తేనెపట్టు
  87. దరిద్రులు
  88. దానం
  89. దారి తప్పిన మనిషి
  90. దారితప్పిన కథ
  91. దాహం తీరేనా?
  92. దివ్యజ్ఞానం
  93. దృష్టి
  94. దేముడానాదేశాన్ని రక్షించు
  95. దేశభక్తి
  96. దొంగలు
  97. దొర-దొమ్మరి
  98. ధర్మసందేహం
  99. నగ్నసుందరి
  100. నమ్మిక
  101. నరకంలో స్వర్గం
  102. నిజాయితీ
  103. నిధి సన్నిధి
  104. నిన్నతెలియని రేపు
  105. నిరపరాధిని ఆత్మ కథ
  106. నీతి అవినీతి
  107. నెత్తరుచుక్కలు
  108. నెమలి సింహాసనం
  109. నేరస్థులు
  110. నైజరు తేనె
  111. నోరు న్యాయం
  112. పంజరంలో చిలక
  113. పట్టబుర్ర-పట్టు తలపాగా
  114. పదమూడోనంబరు గది
  115. పరాజయం
  116. పాడుకల
  117. పాడులోకం! పాడుమనుషులు!
  118. పాపులు
  119. పాల చుక్క
  120. పాలకులు
  121. పావురాల కథ
  122. పిచ్చికుక్క
  123. పులి
  124. పులిబోను
  125. పెళ్ళి
  126. పెళ్ళిపందాలు
  127. పొగరుబోతులు
  128. పోయింది పొల్లు
  129. ప్రకృతిహారం
  130. ప్రతిఘటన
  131. ప్రతిబింబం
  132. ప్రతీక్ష
  133. ప్రయాణం
  134. ప్రేమకథ
  135. ప్రేమరాగం
  136. ప్రేమాయణం
  137. ఫలశ్రుతి
  138. బందీ
  139. బానిస బతుకులు
  140. బుల్ డాగ్
  141. బుల్లెమ్మ బస్సు
  142. బూచీ
  143. బ్రతుకుపంట
  144. భజన
  145. భూతాల పుట్టిల్లు
  146. భూలోకస్వర్గం కథ
  147. భేడాఘాట్ మొసలి
  148. మంచిముత్యం
  149. మంచిముహూర్తం
  150. మంటలు
  151. మతంలేని...
  152. మతి-గతి
  153. మత్స్యగంధి
  154. మధుమాసం
  155. మధుర స్వరం
  156. మనిషి చదువు
  157. మనిషి-పశువు
  158. మనిషికీ మనిషికీ మధ్య
  159. మమకారం
  160. మలుపు
  161. మల్లె పొద
  162. మహాపురుషుల గాథలు
  163. మామిడి మసేను
  164. మాయాబజారు
  165. మారిన మనిషి
  166. మారుతున్న...
  167. మీనాక్షి ఇలారా
  168. ముంగిస కథ
  169. మురికి గుడ్డలు
  170. మురికిపేటవాసులు
  171. ముళ్లపొద
  172. ముసలమ్మ...
  173. మెత్తని దొంగ
  174. మోక్షం
  175. యధాప్రజా తథారాజా
  176. యాత్ర
  177. రంగస్ధలి
  178. రక్తస్పర్శ
  179. రతనాలు
  180. రమణి రాతిబండ
  181. రాజకీయాలు
  182. రాజదూతలూ దేవదూతలూ
  183. రుచులు
  184. రుషీకేశ్ రాయి
  185. రెండు రూపాలు
  186. రెక్కలు కత్తిరించిన పక్షులు
  187. రెక్కల్లేని పక్షులు
  188. రోగులవార్డు
  189. లంచం
  190. లయ
  191. లోకంతీరు
  192. వనజాక్షి...
  193. వరదవెల్లువ
  194. వర్ణాంతర వివాహం
  195. విలువెంత?
  196. వీరులూ ధీరులూ
  197. వెలుగు
  198. వేడుక
  199. వైరాగి నాగు
  200. శవపరీక్ష
  201. శిశు విక్రయం
  202. శోధన
  203. శ్రామికుడు
  204. షోవనార
  205. సంకెళ్ళు
  206. సంక్రమించిన సంపద
  207. సభ్యత
  208. సమన్వయం
  209. సంప్రదాయాలు
  210. సాంబయ్య చావలేదు
  211. సాలెగూడు
  212. సుఖజీవనం
  213. సుగుణ
  214. సూర్యుడు గెంతిన చోటు
  215. స్మారక చిహ్నం
  216. హనుమాన్ సాక్షి
  217. హీప్పీ నాటకం

నాటకాలు

మార్చు
  1. అడవి మనిషి
  • Love in Goa (1998)
  • అజంతా (1998)
  • ఎల్లోరా (1998)

మూలాలు

మార్చు
  1. జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 35-40
  2. "Balivada Kantha Rao". Archived from the original on 2007-09-27. Retrieved 2008-01-19.
  3. https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97/[permanent dead link] బహుభాషాకోవిదులు అయిన తలుగు రచయితలు.
  4. "తెలుగు వెలుగు మాసపత్రిక, రామోజీ ఫౌండేషన్". Archived from the original on 2018-08-01. Retrieved 2018-10-02.
  5. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
  6. "బలివాడ కాంతారావు కథల జాబితా". Archived from the original on 2015-10-22. Retrieved 2014-11-26.