బల్‌రాంపూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బల్‌రాంపూర్ జిల్లా (హిందీ: बलरामपुर जिला) ఒకటి. బల్‌రాంపూర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. బల్‌రాంపూర్ జిల్లా, అవధి ప్రాంతంలో, దేవిపటన్ డివిజన్‌లో భాగంగా ఉంది.
బల్‌రాంపూర్ జిల్లా
बलरामपुर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | దేవీపటన్ |
ముఖ్య పట్టణం | బల్రాంపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,457 కి.మీ2 (1,335 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 21,49,066 |
• జనసాంద్రత | 620/కి.మీ2 (1,600/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 51.76 per cent |
Website | అధికారిక జాలస్థలి |
ఆలయాలు
మార్చుబల్రాంపూర్ నగరంలో పతేశ్వరీదేవి ఆలయం ఉంది. ఇది శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ పురాతన నగర సరస్వతీ నగరం ఉంది. బౌద్ధులకు, జైనులకు ఇది యాత్రాప్రదేశం.
భౌగోళికం
మార్చుబల్రాంపూర్ జిల్లాను 1997 మే 25 న గోండా జిల్లా లోని ఉపవిభాగాన్ని వేరుచేసి ఏర్పాటు చేసారు. జిల్లా వైశాల్యం 3457 చ.కి.మీ. జిల్లాలో 221432 హెక్టార్ల వ్యవసాయభూములు ఉన్నాయి. జిల్లా తరాయ్ భూభాగంలో ఉంది.[1]
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో జిలా ఒకటి. 2001 సాంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం, ఈ జిల్లాను అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.
సరిహద్దులు
మార్చుజిల్లా ఉత్తర సరిహద్దులలో నేపాల్ దేశానికి చెందిన డంగ్‌దేవ్ ఖురి జిల్లా తరువాత శివాలిక్ పర్వతశ్రేనిలోని దౌద్రా పర్వతశ్రేణి ఉంది. ఈశాన్య సరిహద్దులలో నేపాల్ దేశానికి చెందిన కపిలవస్తు జిల్లా, తూర్పు సరిహద్దులలో సిద్ధార్ధనగర్, దక్షిణ సరిహద్దులలో బస్తీ, ఆగ్నేయ సరిహద్దులలో గోండా, పశ్చిమ సరిహద్దులో శ్రావస్తి జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 3,457 చ, కి, మీ.
ఆర్ధికం
మార్చుబల్రాంపూర్ జిల్లా ప్రాంతం మునుపటి తాలూదార్ రాజాస్థానం రాజధానిగా ఉందేది. సా.శ. 1600లో బల్‌రాంపూర్ రాజాస్థానాన్ని బలరాందాస్ స్థాపించాడు.
చరిత్ర
మార్చుప్రస్తుత బల్రాంపూర్ జిల్లా ప్రాంతం పురాతన కోసల రాజ్యంలో భాగంగా ఉండేది.
పురాతన కాలం
మార్చుఉత్తర కోసలకు సరస్వతి రాజధాగా ఉండేది. సాహెత్ (పురాతన సరస్వతి) శిథిలాలు (400 చ.కి.మీ). సాహేత్ ఉత్తరంగా పురాతన నగరం మహేత్ ఉండేది. మహేత్ కోటద్వారం మట్టితో నిర్మించబడింది. ఇది అర్ధచంద్రాకారంలో నిర్మించబడింది. బల్‌రాంపూర్‌లో శోభనాథ్ ఆలయలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించే స్థూపాలు ఉన్నాయి. జిల్లాలో దేశంలోని పురాతన స్థుప్పాలో జీలవాన స్థూపం ఒకటి ఉంది.ఈ స్థూపంలో 12వ శతాబ్ధానికి చెందిన శిలాక్షరాలు ఉన్నాయి. ఇక్కడ పవిత్రమైన రావి చెట్టు ఉంది. ఈ చెట్టుకు మూలం అసలైన బోధివృక్షం నుండి తీసుకు వచ్చిన మొక్క అని విశ్వసిస్తున్నారు.
గౌతం బుద్ధుడు 21 వర్షాకాలలను ఈ పవిత్ర వృక్షం కింద గడిపాడని విశ్వసిస్తున్నారు. అంగుళిమాలుని వృత్తాంతం ఈ వృక్షఛాయలోనే జరిగింది. అంగుళిమాలుడు అంటే మనుషులను చంపి వారి వ్రేళ్ళను మాలగా ధరించిన దొంగ. అంగుళిమాలుకి బుద్ధుని ద్వారా ఙానం లభించింది. ఈ నగరంలో మతపరమైన మరొక ప్రదేశం సరస్వతి నగరం. జైనమత స్థాపకుడు మహావీరుడు, జైనమత 24 వ తీర్ధంకర ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసారు. ఇక్కడ శ్వేతాంబర ఆలయం ఉంది.
మధ్యయుగం
మార్చుమొగల్ పాలనా కాలంలో జిల్లాప్రాంతం అవధ్ రాజ్యంలోని బహరియాచ్ సర్కార్‌లో భాగంగా ఉండేది. తరువాత ఈది అవధ్ పాలకుని ఆధీనంలోకి మారింది. 1856లో ఇది బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేయబడింది. బ్రిటిష్ ప్రభుత్వం బహరియాచ్‌ను గొండా నుండి విడదీసిన తరువాత ఇది గొండాలో భాగంగా మారింది.
బ్రిటిష్ కాలం
మార్చుబ్రిటిష్ కాలంలో ఈప్రాంతానికి గొండా రాజధానిగానూ, సర్కౌరా కొలెనల్‌గంజ్ మిలటరీ కమాండ్‌గా ఉండేది. ఈ సమయంలో ఈ ప్రాంతం గొండా జిల్లాలో ఉత్తరౌలా తాలూకాలో బల్రాంపూర్ తాలూక్దారిగా ఉండేది. దీనిలో 3 తాలూకాలు (గొండా సాదర్, తారబ్‌గంజ్, ఉత్రౌలా) ఉన్నాయి. స్వతంత్రం తరువాత బల్‌రాంపూర్ జమీందారి గొండా జిల్లాలోని ఉత్రౌలా తాలూకాలో భాగంగా మారింది. 1953 జూలై 1 న ఉత్రౌలాను రెండు తాలూకాలుగా (బల్‌రాంపూర్, ఉత్రౌలా) విభజించారు. 1987లో కొత్తాగా 3 తాలూకాలు (తులసీపూర్, మంకాపూర్, కొల్నెల్గంజ్) రూపొందించారు.1997లో గొండా జిల్లా నుండి బల్‌రాంపూర్ జిల్లాను రూపొందించారు.
ఆర్ధికం
మార్చుబల్రాంపూర్ జిల్లాలో ఇండియాలోని అతిపెద్ద చక్కెర మిల్లులలో ఒకటైన " బల్‌రాంపూర్ చీని మిల్ " ఉంది. 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బల్‌రాంపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.
విభాగాల వివరణ
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | 3 - బలరామ్పూర్, తుల్సిపుర్, ఉత్రౌల. |
మండలాలు | బలరామ్పూర్, జైందస్ బుజుర్గ్, గైస్రి, హర్య సత్ఘర్వ, పచ్ పెద్వ, రెహెర బజార్, ష్రిదుత్త్గంజ్, తుల్సిపుర్, ఉత్రౌల.సదుల్లాహ్ నగర్ |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,149,066, [2] |
ఇది దాదాపు. | నమీబియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 213 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 642 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.74%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 922:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 51.76%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
విద్యా సంస్థలు
మార్చు- కేంద్రీయ విద్యాలయ బలరామ్పూర్
- సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల
- జీసస్ & మేరీ పాఠశాల
- శారద పబ్లిక్ స్కూల్
- బ్లూమింగ్ బడ్స్ పబ్లిక్ స్కూల్ గోండా రోడ్డు బలరామ్పూర్
- మోడరన్ స్కూల్
- సిటీ మాంటిస్సోరి బలరామ్పూర్
- సరస్వతీ విద్యా మందిర్ బలరామ్పూర్
మాధ్యమం
మార్చుజిల్లాలో ప్రధానంగా " నార్థ్ ఇండియా టైమ్స్, 'శ్రీ టైమ్స్, దైనిక్ హిందూస్తాన్, దైనిక్ జాగరణ్, అమర్ ఉజాలా, జన్‌సత్తా మొదలైన హిందీ దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఆంగ్ల దినపత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, హిందూస్తాన్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్, ఉన్నాయి, బిజినెస్ లైన్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హాన్స్ ఇండియా మొదలైన ఆంగ్లపత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్సెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ మొబైల్, టాటా డొకోమో, వోడాఫోన్ ఎయిర్టెల్ భారతి ఎయిర్టెల్ ఎప్పటిలాగానే సెల్యులార్ ప్రొవైడర్లు సామాచార సంబంధిత సేవలు అందిస్తున్నాయి.
బయటి లింకులు
మార్చు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-16. Retrieved 2014-12-16.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Namibia 2,147,585
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179