అమర్ ఉజాలా
అమర్ ఉజాలా అనేది భారతదేశంలో ప్రచురితమయ్యే హిందీ భాషా దినపత్రిక, ఈ పత్రికను 1948లో స్థాపించారు. ఈ పత్రిక ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 22 ఎడిషన్లు కలిగి ఉంది, 180 జిల్లాలలో ఈ పత్రిక ప్రతిరీతమవుతుంది.[1][2] ఈ పత్రిక నాలుగు కోట్ల అమ్మకాలతో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. . 2019 ఇండియన్ రీడర్షిప్ సర్వే ప్రకారం, ఈ పత్రిక తొమ్మిది కోట్ల మంది పాఠకులను కలిగి ఉంది.[3]
అమర్ ఉజాలా | |
---|---|
రకము | దిన పత్రిక |
ఫార్మాటు | |
యాజమాన్యం: | {{{owners}}} |
ప్రచురణకర్త: | అమర్ ఉజాలా పబ్లికేషన్ లిమిటెడ్ |
స్థాపన | 1948 |
భాష | హిందీ |
ప్రధాన కేంద్రము | నోయిడా, ఉత్తరప్రదేశ్ |
సర్క్యులేషన్ | 1,744,512 |
అమర్ ఉజాలా 1948లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా లో స్థాపించబడింది.[4][5] 1994లో అమర్ ఉజాలా, పత్రికకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం మంది పాఠకులు ఉన్నారు ఈ పత్రిక అమ్మకాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది.[6]
అమర్ ఉజాలా పత్రికలో 16 నుండి 18 పేజీలు ఉంటాయి , అలాగే వృత్తి, జీవనశైలి, వినోదం మహిళలు వంటి విషయాలపై దృష్టి సారించే అనుబంధాంశాలను ఈ పత్రిక ప్రచురిస్తుంది
ఎడిషన్లు
మార్చుఅమర్ ఉజాలా ఆరు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. (ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఉత్తర ప్రదేశ్) రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (చండీగఢ్, జమ్మూ & కాశ్మీర్) 22 సంచికలు ఉన్నాయి ఈ పత్రిక ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో పాఠకులని ఎక్కువ కలిగి ఉంది. [<span title="This claim needs references to reliable sources. (December 2022)">citation needed</span>]
అమర్ ఉజాలా దినపత్రిక వెబ్సైటును కూడా కలిగి ఉంది. భారతదేశం అంతటా 60 మిలియన్ + వినియోగదారులకు సేవలు అందించే ప్రముఖ హిందీ వార్తా వెబ్సైట్లలో అమర్ ఉజాలా దినపత్రిక వెబ్ సైట్ ఒకటి.[7] డిసెంబర్ 2022 నాటికి, Amarujala.com కు ఫేస్బుక్లో ఎనిమిది కోట్ల నాలుగు లక్షల మంది ఫాలోవర్లు యూట్యూబ్ 3.8 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు.[8]
మై రెసల్ట్ ప్లస్ కూడా అమర్ ఉజాలా వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది నిర్వహించబడుతుంది.[9]
ప్రముఖ కాలమిస్టులు
మార్చు- వరుణ్ గాంధీ, రాజకీయ నాయకుడు రచయిత
మూలాలు
మార్చు- ↑ "अमर उजाला Epaper: छह राज्य और दो केंद्र शासितों के 22 संस्करणों की बड़ी खबरें यहां पढ़ें". Amarujala.com (in హిందీ). Retrieved 2022-06-11.
- ↑ "Top 10 Best Media Companies In India In 2022 - Inventiva" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-11. Retrieved 2022-06-11.
- ↑ "Archived copy" (PDF). Archived (PDF) from the original on 2 November 2021. Retrieved 10 March 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Ninan, Sevanti (2007-05-03). Headlines From the Heartland: Reinventing the Hindi Public Sphere (in ఇంగ్లీష్). SAGE Publishing India. ISBN 978-93-5280-059-9.
- ↑ "Amar Ujala". india.mom-gmr.org (in ఇంగ్లీష్). Retrieved 2022-06-11.
- ↑ Dilip Awasthi (15 November 1994). "Belligerent as ever, Mulayam Singh Yadav takes on the press". India Today. Retrieved 12 September 2014.
- ↑ "hindi News हिंदी न्यूज़, Latest News In Hindi, Hindi Samachar, Hindi News Headlines". amarujala.com. Retrieved 26 Dec 2022.
- ↑ "Amar Ujala". YouTube. Retrieved 26 December 2022.
- ↑ "UP Board Result 2021". results.amarujala.com. Retrieved 19 July 2021.