బస్ స్టాప్ (2012 చిత్రం)

బస్ స్టాప్ అనేది దాసరి మారుతి దర్శకత్వం వహించిన 2012 భారతీయ తెలుగు-భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించగా ప్రిన్స్ సిసిల్, శ్రీదివ్య, ఖన్నా, రావు రమేష్‌, అభి, హాసిక, గోపాల్‌సాయి, డి.ఎం.కె, సాయికుమార్‌ పంపన, రావిపల్లి రాంబాబు తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. జెబి సంగీతం అందించారు. 2012 నవంబరు 11న భారతీయ సెన్సార్ బోర్డు అనుమతులతో బస్ స్టాప్ విడుదలైంది.[1][2] ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించింది.[3]

బస్ స్టాప్
దర్శకత్వందాసరి మారుతి
రచననందినిరెడ్డి వల్లూరు
నిర్మాతబెల్లంకొండ సురేష్
తారాగణంప్రిన్స్ సెసిల్
శ్రీ దివ్య
ఆనంది
సాయి కుమార్ పి
రావు రమేష్
ఛాయాగ్రహణంజె. ప్రభాకర్ రెడ్డి
కూర్పుఎస్. బి. ఉద్ధవ్
సంగీతంజె.బి. & అనిల్
పంపిణీదార్లుశ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2012 నవంబరు11
సినిమా నిడివి
139 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు
 • శీనుగా ప్రిన్స్
 • శైలజగా శ్రీ దివ్య
 • ముత్తుగా సాయి కుమార్ పంపన
 • ఖన్నాగా ఖన్నా
 • సీమగా ఆనంది
 • అభి
 • గోపాల్ సాయి
 • రావు రమేష్
 • కోటేశ్వరరావు

సౌండ్‌ట్రాక్

మార్చు

బస్టాప్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం 2012 అక్టోబరు 14న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరిగింది.[4] ప్రిన్స్, శ్రీ దివ్య, సునీల్, సమంత, ఎం.ఎం. కీరవాణి, నందిని రెడ్డి, బెల్లంకొండ సురేష్, సునీల్, నాగ సుధీర్ బాబు ఈ వేడుకకు హాజరయ్యారు. జె.బి., అనిల్ ఆర్ సంగీతం అందించారు. ఈ ఆడియోకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.[5]

# Title Composer Lyricist Singers
1 టైటిల్ సాంగ్ జె.బి మారుతి రేవంత్, సుధా జీవన్
2 కలలకే కనులొచ్చిన జె.బి కాసర్ల శ్యామ్ రేవంత్
3 ఐ లవ్ యూ అనిల్ ఆర్ భాస్కరభట్ల రాహుల్
4 రెక్కలొచ్చిన ప్రేమ అనిల్ ఆర్ వేటూరి కార్తీక్
5 పట్టుకో పట్టుకో అనిల్ ఆర్ వేటూరి చిన్న పొన్ను
6 థీమ్ మ్యూజిక్ జె.బి ఇంస్ట్రుమెంటల్

మూలాలు

మార్చు
 1. "Maruthi's Bus Stop to release on Nov 9". IndiaGlitz. Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 3 November 2012.
 2. "Maruthi's Bus Stop set to release on Nov 11". 123telugu.com. Retrieved 10 November 2012.
 3. "Tollywood 2012 Film Roundup – Hit Films, Flop Films 2012". filmsadda.com. Retrieved 31 December 2012.
 4. "Bus Stop Audio Release Function". Oneindia Entertainment. Archived from the original on 15 October 2012. Retrieved 14 October 2012.
 5. "Bellamkonda: Bus Stop audio is a super hit". IndiaGlitz. Archived from the original on 24 అక్టోబరు 2012. Retrieved 23 October 2012.