నందినీ రెడ్డి (జననం: 4,మార్చి 1980) ఒక భారతీయ చలనచిత్ర దర్శకురాలు.[1] ఈమె అలా మొదలైంది అనే సినిమాతో తన దర్శకవృత్తిని ప్రారంభించింది.[2]

బి.వి.నందినీ రెడ్డి
సినివారంలో నందినీరెడ్డి
జననంమార్చి 4, 1980
వృత్తిసినిమా దర్శకత్వం
క్రియాశీల సంవత్సరాలు2011 నుండి ప్రస్తుతం

ప్రారంభ జీవితం

మార్చు

నందినీ రెడ్డి 1980లో హైదరాబాదులో జన్మించింది. ఈమె తండ్రి భరత్ వి.రెడ్డి బెంగళూరులో ఛార్టర్డ్ అకౌంటెంటుగా స్థిరపడ్డాడు. వీరి కుటుంబం చిత్తూరు జిల్లా నుండి వచ్చింది. ఈమె తల్లి రూపారెడ్డి వరంగల్లు జిల్లాకు చెందిన ఆడపడుచు. నందినీ రెడ్డి సోదరుడు ఉత్తమ్‌రెడ్డి హైదరాబాదులో రాయలసీమ రుచులు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు. ఈమె తన ప్రాథమికవిద్యను సికిందరాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూలు లోను, డిగ్రీని కోఠిలోని ఉమెన్స్ కాలేజీలోను పూర్తిచేసింది. తరువాత న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి అంతర్జాతీయ రాజకీయాలలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది. ఈమె విద్యార్థి దశలోనే నాటకాలలోను, వకృత్వంలోను, క్రికెట్ క్రీడలోను క్రియాశీలకంగా ఉండేది. ఈమె "అదుర్స్" అనే టి.వి.టాలెంట్ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.[3]

వృత్తి

మార్చు

ఈమె ఒక మిత్రుని ద్వారా గుణ్ణం గంగరాజుకు పరిచయమయ్యింది. అతనివద్ద దర్శక విభాగంలో లిటిల్ సోల్జర్స్ సినిమాకు పనిచేసింది. లిటిల్ సోల్జర్స్ తరువాత ఛాయాగ్రాహకుడు ఎల్లోర్ రసూల్ ద్వారా కృష్ణవంశీ కి పరిచయం చేయబడింది. కానీ కృష్ణవంశీ ఆమెను తన టీంలో చేర్చుకోలేదు. ఒక సంవత్సరం ఖాళీగా ఉన్న తర్వాత ఈమెకు కన్నడ చిత్రం "శాంతి శాంతి శాంతి"లో పనిచేయడానికి అవకాశం లభించింది. రమ్యకృష్ణ ఒత్తిడి చేయడంతో కృష్ణవంశీ ఈమెను తన తరువాతి సినిమా చంద్రలేఖలో తీసుకున్నాడు. ఆ తరువాత ఈమె కృష్ణవంశీ టీంలో ముఖ్యవ్యక్తిగా మారిపోయి చంద్రలేఖ నుండి శక్తి (అంతఃపురం సినిమాకు హిందీ రీమేక్) వరకు దర్శకత్వశాఖలో పనిచేసింది. పిమ్మట కృష్ణవంశీ ఈమెను దగ్గుబాటి సురేష్‌బాబు కు పరిచయం చేయడంతో సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సంవత్సరాలు పనిచేసింది. ఈమె సురేష్ ప్రొడక్షన్స్ సినిమా ఒక దానికి దర్శకురాలిగా పనిచేయవలసి ఉంది కానీ కారణాంతరాలవల్ల అది కార్యరూపం దాల్చలేదు.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా నటీనటులు వివరాలు
2011 అలా మొదలైంది నాని, నిత్యా మీనన్, స్నేహా ఉల్లాల్,కృతి కర్బంద, రోహిణి,ఉప్పలపాటి నారాయణరావు, ఆశిష్ విద్యార్థి, తాగుబోతు రమేశ్ ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది పురస్కారం
ఉత్తమ దర్శకుడు ఫిలిం ఫేర్ అవార్డు - తెలుగుకు నామినేషన్
2013 జబర్‌దస్త్ సిద్ధార్థ్, సమంత, నిత్యా మీనన్
2016 కళ్యాణ వైభోగమే నాగశౌర్య,మాళవికా నాయర్, రాశి, తాగుబోతు రమేష్, గీతా సింగ్
2019 ఓహ్ బేబి సమంత, రావు రమేష్, నాగశౌర్య
2023 అన్నీ మంచి శకునములే

నటించినవి

మార్చు
  1. ప్రియతమా నీవచట కుశలమా (2013)[4]

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Tollywood gives kiss a miss - The Times of India". Timesofindia.indiatimes.com. 2003-09-15. Retrieved 2012-10-29.
  2. M. L. Narasimham (2010-07-22). "Arts / Cinema : Charm of romantic comedies". The Hindu. Retrieved 2012-10-29.
  3. BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  4. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 13 July 2019.
  5. "Nandi awards 2010 announced - Telugu cinema news". Idlebrain.com. 2011-08-05. Retrieved 2012-10-29.
  6. "The Hyderabad Times Film Awards 2011". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-07-18. Retrieved 24 June 2012.

బయటిలింకులు

మార్చు