బాగ్దాద్ గజదొంగ (1960 సినిమా)
బాగ్దాద్ గజదొంగ 1960. నవంబర్ 9 వ తేది విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి అదే ఏడాది విడుదలైన బాగ్దాద్ తిరుడన్ అనే తమిళ సినిమా మూలం.ఎం.జి.రామచంద్రన్ , వైజయంతి మాల. నటించిన ఈ చిత్రానికి రచన పాలగుమ్మి పద్మరాజు కాగా,దర్శకత్వం , టీ. పి. సుందరం.సంగీతం, పి. ఎస్. దివాకర్ సమకూర్చారు.
బాగ్దాద్ గజదొంగ (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.పి.సుందరం |
---|---|
రచన | పాలగుమ్మి పద్మరాజు |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, వైజయంతిమాల, నంబియార్, టి.ఎస్.బాలయ్య, సంధ్య, అశోకన్, సహస్రనామం |
సంగీతం | పి.ఎస్.దివాకర్ |
గీతరచన | వడ్డాది |
ఛాయాగ్రహణం | ఎం.కృష్ణస్వామి |
నిర్మాణ సంస్థ | డీలక్స్ ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- వైజయంతిమాల
- ఎం.ఎన్.రాజం
- ఎం.జి.రామచంద్రన్
- నంబియార్
- టి.ఎస్.బాలయ్య
- టి.ఆర్.రామచంద్రన్
- సంధ్య
- హెలెన్
- అశోకన్
- సహస్రనామం
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: టి.పి.సుందరం
- మాటలు: పాలగుమ్మి పద్మరాజు
- పాటలు: వడ్డాది బుచ్చి కూర్మనాథం
- సంగీతం: పి.ఎస్.దివాకర్
- కూర్పు: కందస్వామి, చెన్నకేశవులు
- ఛాయాగ్రహణం: ఎం.కృష్ణస్వామి
- శబ్దగ్రహణం: పి.వి.కోటేశ్వరరావు
కథ
మార్చుబాగ్దాద్ నగరంలో వజీర్ ఖాసిం రజ్వీ కుట్ర పన్ని సేనాధిపతి ఖయూం సహాయంతో కోటను ఆక్రమించుకుంటాడు. ముసలి పాదుషాను జైలు పాలు చేస్తాడు. రాకుమారుని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించిన రాణి ప్రాణాలను కోల్పోతుంది. కానీ మరణించే ముందు యువరాజును మూడంతస్తుల మేడపై నుండి క్రిందకు వదిలేస్తుంది. అంతఃపుర వైద్యుడు అబ్దుల్లా ఆ యువరాజును కాపాడతాడు.ఆ యువరాజే అబూ. అతని స్థానంలో హైదర్ యువరాజుగా పెరిగి పెద్దవాడౌతాడు. హైదర్ వ్యసనాల పుట్ట. అతడి ఉత్తరకుమార ప్రజ్ఞలు రజ్వీ కుమార్తె జుబేదాకు నవ్వు పుట్టిస్తాయి. జరీనా ఒక బానిస పిల్ల. ఆమె యజమాని వట్టి పశువు. అతని కోసం ఆమె ప్రతిరోజూ డబ్బు ఎక్కడైనా దొంగిలించి తేవాలి. లేకపోతే అతడు ఆమెను చిత్రహింసల పాలు చేస్తాడు. ఆమె అబూ వద్ద నుండి ధనాన్ని దొంగిలించి పట్టుబడింది. ఆమె దీనగాథ విన్నాక అబూకి ఆమెపై జాలి కలిగింది. ఆ తొలి పరిచయం ప్రణయంగా మారింది. అబూ మారువేషంలో ఆమె యజమాని వద్దకు వెళ్ళి వేలంపాటలో జరీనాను కొని తన నివాసానికి తీసుకుపోతాడు. జుబేదా బండిలో వస్తున్నప్పుడు రాజభటులు నిర్దాక్షిణ్యంగా ప్రజలను పశువుల్లాగా తోలుతుంటారు. అబూ ఇది సహించలేక తన మిత్రుడు భాషాతో కలిసి బండిని బోల్తా కొట్టిస్తాడు. కింద పడిపోబోయిన జుబేదాను పట్టుకుంటాడు. ఆ స్పర్శతో జుబేదాలోని అహంకారం అబూపై మమకారంగా మారుతుంది. అతని శౌర్యప్రతాపాలకు ముగ్ధురాలై రాత్రింబవళ్ళు అతని గురించే కలగంటూ ఉంటుంది. అబూ ఇటు జరీనాను అనేక ఆటంకాల మధ్య వివాహం చేసుకుంటాడు. అబూను తన అనుచరులు పట్టుకోలేక పోయినందుకు రజ్వీ మండిపడి తనే ఒక పన్నాగం పన్నుతాడు. నగరంలోని మంచినీటి కొలనులన్నింటిలోను విషం కల్పించి ఆ పని చేసింది అబూయేనని ప్రచారం చేశాడు. మంచినీటిని ప్రజలు అంతఃపురం నుండి కొనుక్కోవలసి వచ్చింది. దానితో ఖజానా నిండింది. ప్రజలకు అబూపై వ్యతిరేకభావం ఏర్పడింది. నీటిలో కలిపిన విషానికి విరుగుడు రజ్వీకి, జుబేదాకు మాత్రమే తెలుసు. దానికోసం జుబేదాపై ప్రేమనటించి అబూ విషానికి విరుగుడు మందు గ్రహిస్తాడు. తరువాత తన మనసు జరీనాకు అంకితమైపోయిందనీ, జుబేదాను ప్రేమించడం అసంభవమనీ ఆమెకు నిజం చెప్పేస్తాడు. జుబేదాకు కోపం వచ్చి అబూమీద, జరీనామీద పగబూనింది. చెరువులలోని నీటిని మంచి నీటిగా మార్చుతాడు అబూ. ప్రజలు అతనికి బ్రహ్మరథం పడతారు.[1]
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలు అన్నింటిని వడ్డాది రచించగా పి.ఎస్.దివాకర్ సంగీతాన్ని సమకూర్చాడు.[1]
క్రమ సంఖ్య | పాట | పాడిన వారు |
---|---|---|
1 | బుల్ బుల్ బాలనురా ఓహో బుల్ బుల్ బాలనురా | కె.జమునారాణి |
2 | హృదయ వీధిని పూలవాన చిలికెనే చల్లగాలి నా మనసును మీటెనే | పి.సుశీల |
3 | చిన్నారి నవ్వులు సన్నజాజి పువ్వులు విరితేనె తేటలు మురిపించు మాటలు | ఎస్.జానకి బృందం |
4 | కన్నీటి వెల్లువ పొంగె చూడరయ్యా నన్ను బ్రోచు దాతల్లారా కావరయ్యా | పి.సుశీల |
5 | నాకే డుమ్‌కీ కొట్టేవ్ బలేగా నాటకమాడేవ్ పిల్లోయ్ | పి.బి.శ్రీనివాస్ |
6 | ఓటమి ఎరుగని జయశాలి కోటలు గెలిచిన బలశాలి | పి.సుశీల |
7 | వాలు చూపుల మనసులు కలిపిన వయ్యారీ మోహన రూపం మై పులకించెనే చిన్నారీ | పి.బి.శ్రీనివాస్, పి.సుశీల |
8 | కన్నీటి గాథలాయేనా నా బ్రతుకు వాడుటేనా | పి.సుశీల |
9 | నీదు లైలా నేనైతే ఏలుకోరాదా మజ్నూవై | ఎ.పి.కోమల |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 వడ్డాది (1960). బాగ్దాద్ గజదొంగ పాటల పుస్తకం. p. 20. Retrieved 22 November 2021.