బాబూలాల్ గౌర్
బాబూలాల్ గౌర్ (బాబూరామ్ యాదవ్) (జననం;1929 జూన్ 2 - 2019 ఆగస్టు 21) మధ్యప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. బాబూలాల్ గౌర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. బాబూలాల్ గౌర్ మధ్యప్రదేశ్ శాసనసభకు పదిసార్లు, భోపాల్ సౌత్ నుండి రెండుసార్లు గోవింద్‌పురా నుండి ఎనిమిది సార్లు మధ్య ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. వయోభారం కారణంగా 2018 లో బాబులాల్ గౌర్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. [1]
బాబూలాల్ గౌర్ | |
---|---|
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి | |
In office 2004 ఆగస్టు 23 – 2005 నవంబర్ 29 | |
అంతకు ముందు వారు | ఉమాభారతి |
తరువాత వారు | శివరాజ్ సింగ్ చౌహన్ |
మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |
In office 1980 –2018 | |
అంతకు ముందు వారు | లక్ష్మీనారాయణ శర్మ |
తరువాత వారు | కృష్ణ గౌర్ |
నియోజకవర్గం | గోవిందపుర శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | బాబు రామ్ యాదవ్ 1929 జూన్ 2 మధ్యప్రదేశ్ భారతదేశం |
మరణం | 2019 ఆగస్టు 21 భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | (వయసు 90)
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ |
|
ఇతర రాజకీయ పదవులు | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (1946-2018) |
జీవిత భాగస్వామి | ప్రేమ్ దేవి |
సంతానం | 3 |
కళాశాల | విక్రం విశ్వవిద్యాలయం (బిఎ, ఎల్.ఎల్.బి)\ |
వృత్తి | రాజకీయ నాయకుడు వ్యవసాయవేత్త |
బాబూలాల్ గౌర్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నౌగిర్ గ్రామంలో జన్మించారు. బాబూలాల్ గౌర్ తన చిన్నతనం నుండి భోపాల్‌లో ఉండేవాడు. బాబులాల్ గౌర్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ లాస్ లో పట్టా పొందారు. బాబూలాల్ గౌర్ తన రాజకీయ జీవితాన్ని ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ప్రారంభించారు. [2] 1974లో జనతా పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా భోపాల్ సౌత్ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తొలిసారిగా మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
బాబూలాల్ గౌర్, ఢిల్లీ పంజాబ్ ఇతర రాష్ట్రాలలో ఎమర్జెన్సీ, గోవా విముక్తి ఉద్యమం సత్యాగ్రహాలకు వ్యతిరేకంగా జరిగిన అనేక జాతీయ స్థాయి ఉద్యమాలలో పాల్గొన్నారు. అతను 7 మార్చి 1990 నుండి 15 డిసెంబర్ 1992 వరకు స్థానిక పరిపాలన, చట్టం శాసన వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రజా సంబంధాలు, పట్టణ సంక్షేమం, గృహ (అర్బన్) & పునరావాసం భోపాల్ గ్యాస్ రిలీఫ్ పునరావాస మంత్రిగా పనిచేశాడు. బాబూలాల్ గౌర్ 2002 సెప్టెంబర్ 4 నుండి 2003 సెప్టెంబర్ 7 వరకు మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
బాల్యం విద్యాభ్యాసం
మార్చుబాబూలాల్ గౌర్ 1929 జూన్ 2న బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, భారతదేశం) యునైటెడ్ ప్రావిన్స్‌లోని ప్రతాప్‌గఢ్‌లోని నౌగీర్ గ్రామంలో జన్మించారు. [3] [4] [5] బాబూలాల్ గౌర్ తండ్రి రామ్ ప్రసాద్ యాదవ్ మల్లయోధుడు. [5] బాబూలాల్ గౌర్ భోపాల్‌లో పెరిగాడు. బాబూలాల్ గౌర్ 1958లో ఉజ్జయినిలోని విక్రమ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టభద్రుడయ్యాడు. బాబూలాల్ గౌర్ 1965లో బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసాడు, అది కూడా విక్రమ్ యూనివర్శిటీ నుండి పూర్తి చేశాడు. [6] బాబూలాల్ గౌర్ వృత్తిరీత్యా వ్యవసాయ వేత్త. [6]
రాజకీయ జీవితం
మార్చుతొలి రాజకీయాలు
మార్చురాజకీయాలలోకి రాకముందు బాబులాల్ గౌర్ ఒక మద్యం దుకాణంలో పనిచేశాడు. తరువాత మిల్లులో పనిచేశాడు. బాబూలాల్ గౌర్ 1946 నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో కలిసి పనిచేశాడు. బాబూలాల్ గౌర్ న రాజకీయ జీవితాన్ని ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ప్రారంభించారు, [2] కార్మికుల హక్కుల కోసం అనేక ఉద్యమాలలో బాబూలాల్ గౌర్ పాల్గొన్నారు. [1] [5] బాబూలాల్ గౌర్ భారత జాతీయ కాంగ్రెస్ -మద్దతుగల ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లో చేరి నిరసనలకు నాయకత్వం వహించాడు. తరువాత అతను ఆర్ఎస్ఎస్-మద్దతుగల యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పనిచేశాడు. [7] ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన పలు ఆందోళనలు లో బాబు లాల్ గౌర్ పాల్గొన్నారు. [5] బాబూలాల్ గౌర్ 1956లో భారతీయ జనసంఘ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. [1]
బాబూలాల్ గౌర్ 1956లో సిటీ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు .[5] 1972 లో బాబూలాల్ గౌర్ భారతీయ జనసంఘ్ పార్టీ భ్యర్థిగా పోటీ చేసి గోవింద్‌పురా నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. [8]
శాసన సభ సభ్యుడు
మార్చు1974లో బాబూలాల్ గౌర్ భోపాల్ సౌత్ నుండి జనతా పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఉప ఎన్నికలలో మధ్యప్రదేశ్ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన ఆందోళనలు, గోవా విముక్తి ఉద్యమం ఢిల్లీ, పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో సత్యాగ్రహాలు వంటి జాతీయ స్థాయి ఉద్యమాలలో గౌర్ పాల్గొన్నారు. అంతర్గత భద్రతా చట్టం నిర్వహణ (మిసా) కింద ఎమర్జెన్సీ సమయంలో బాబు లాల్ గౌర్ ను 19 నెలల పాటు జైలులో నిర్బంధించారు. [4]
1977 లో బాబులాల్ గౌర్ భోపాల్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. [9] 1980 నుండి, 2013 వరకు బాబు లాల్ గౌర్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[10] 1993లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 59,666 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. బాబు లాల్ గౌర్ 2003లో 64,212 ఓట్ల తేడాతో గెలిచి శాసనసభ ఎన్నికల్లో తన రికార్డును తానే బద్దలు కొట్టారు [5] పదవ విధానసభ 1993-98 సమయంలో, బాబూలాల్ గౌర్ భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ విప్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, అండర్‌టేకింగ్ కమిటీ సభ్యుడు, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడుగా పనిచేశాడు.[11]
అతను 1990 మార్చి ఏడు నుండి 1992 డిసెంబర్ 15 వరకు స్థానిక పరిపాలన, చట్టం శాసన వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రజా సంబంధాలు, పట్టణ సంక్షేమం, గృహ (అర్బన్) & పునరావాసం భోపాల్ గ్యాస్ రిలీఫ్ పునరావాస మంత్రిగా పనిచేశాడు. బాబు లాల్ గౌర్ 11వ మధ్యప్రదేశ్ శాసనసభలో (1999-2003) 2002 సెప్టెంబర్ 4 నుండి 2003 డిసెంబర్ 7 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. [5]
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి
మార్చు1994 హుబ్లీ అల్లర్ల కేసులో కర్ణాటకలోని హుబ్లీ కోర్టు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమా భారతికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ముఖ్యమంత్రి ఉమాభారతి సీఎం పదవికి రాజీనామా చేశారు. [7] బాబు లాల్ గౌర్ 2004 ఆగస్టు 23 నుండి 29 నవంబర్ 2005 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గా పనిచేశాడు. [4] నవంబర్ 2005లో గౌర్ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. [4]
వ్యక్తిగత జీవితం, మరణం
మార్చుఆయనకు భార్య ప్రేమ్ దేవితో పాటు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. [3] అతని భార్య ప్రేమ్ దేవి అప్పటికే మరణించగా, వారి కుమారుడు పురుషోత్తం 2004లో మరణించాడు. [12] అనారోగ్యం కారణంగా 2018లో ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. [5] కృష్ణ గౌర్, అతని కోడలు, 2018లో గోవింద్‌పురా అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. [4]
2019 ఆగస్టు 7న, గౌర్ వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా భోపాల్ [13] లోని నర్మదా ఆసుపత్రిలో చేరారు. [2] 2019 ఆగస్టు 21న గుండెపోటుతో మరణించాడు. [14]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Staff Reporter (21 August 2019). "Former Madhya Pradesh CM Babulal Gaur passes away". The Hindu. Retrieved 21 August 2019.
- ↑ 2.0 2.1 2.2 "Former MP CM Babulal Gaur no more". The Economic Times. 21 August 2019. Retrieved 23 August 2019.
- ↑ 3.0 3.1 श्री बाबूलाल गौर - एकादश विधान सभा (1998-2003) (PDF). mpvidhansabha.nic.in (in హిందీ). Retrieved 27 August 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Profile" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 4.0 4.1 4.2 4.3 4.4 "Former Madhya Pradesh chief minister Babulal Gaur passes away". Hindustan Times. 21 August 2019. Retrieved 23 August 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "HT death" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 उत्तर प्रदेश के यादव से मध्य प्रदेश के गौर कैसे बन गए बाबूलाल. aajtak.intoday.in. 21 August 2019. Retrieved 23 August 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "AajTak" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 6.0 6.1 "Babulal Gaur(Bharatiya Janata Party(BJP)):Constituency- GOVINDPURA(BHOPAL) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 23 August 2019.
- ↑ 7.0 7.1 Ghose, Debobrat (21 August 2019). "Babulal Gaur dies at 89: 'Accidental chief minister' of Madhya Pradesh was known for humility, development work in Bhopal". Firstpost. Retrieved 6 March 2021.
- ↑ "1972 results" (PDF). Retrieved 10 January 2020.
- ↑ "1977 results" (PDF). Retrieved 10 January 2020.
- ↑ Election results: 1980 to 2013
- ↑ Jaffrelot, Christophe (2003). India's Silent Revolution: The Rise of the Lower Castes in North India. Hurst. ISBN 9781850653981. Retrieved 26 August 2019.
- ↑ "A chapter ends in MP politics as Babulal Gaur takes final bow". uniindia.com. Retrieved 26 August 2019.
- ↑ "Former Madhya Pradesh CM Babulal Gaur dies at 89". India Today. Asian News International. 21 August 2019. Retrieved 21 August 2019.
- ↑ "Babulal Gaur, Former Madhya Pradesh CM and Veteran BJP Leader, Dies After Cardiac Arrest". News18. PTI. 21 August 2019. Retrieved 2 March 2024.