నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడిని బట్టి బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం.భారతదేశంలో బాలల సంరక్షణ [1][2] కొరకు చాలా చట్టాలున్నాయి.

విద్య ఒక ప్రాథమిక హక్కు మార్చు

ప్ర భారతీయ పౌరుడికి విద్య ఒక ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రకారం విద్య మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం. ఉన్నత విద్య అందరికీ తమ ప్రతిభ మీద ఆధారపడి అందుబాటులో ఉండాలి.

బాలల హక్కులు - బాధ్యతలు మార్చు

బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో అందరిలాగే చిన్నారులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ఉద్దేశం అభివృద్ధి, రక్షణ. ఇప్పటికి మనదేశంలో చాలా మందికి బాలలు అని ఎవరిని పేర్కొంటారు? వారి హక్కులు ఏమిటి? వాటిని పరి రక్షించడం, అమలు జరపడంలో బాధ్యత ఎవరిది? అనే దానిపై స్పష్టమైన అవగాహన లేదు.

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషను మార్చు

బాలలకు న్యాయాన్ని కల్పించడం, నిర్లక్ష్యానికి గురైన బాలలు, ప్రత్యేక బాలల యెడల శ్రద్ధ, బాలకార్మిక వ్యవస్ధను రూపుమాపే దిశలో పనిచేసిన, బాలల మనస్తత్వ శాస్త్రం, పిల్లల పరమైన చట్టాల గురించిన అవగాహన, సమగ్రత, సమర్ధత, అనుభవము, నిపుణత, నైతికత గల్గి, విద్య, శిశు ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, అభివృద్ధి శాఖల నుండి సమర్ధతగల ఆర్గురు సభ్యులు ఉంటారు.

బాలల హక్కులపై ఉపాధ్యాయుల కరదీపిక మార్చు

“నా వరకు చదువు నేర్పడంలోనే మానవాళికి ముక్తి అనిపిస్తోంది” అన్న జార్జి బెర్నార్డ్ షా మాటలు మీకు గుర్తుండే ఉండాలి. నాగరికులుగా భారతదేశంలో మనం ఉపాధ్యాయులను భగవంతుని తర్వాత అంతటి అత్యున్నత స్థానంలో నిలబెట్టాం. ఎందుకు ఉంచకూడదు?

పిల్లలతో సున్నితంగా వ్యవహరించండి మార్చు

మంచి వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తనతో ఎట్టి పరిస్థితినైనా విజయవంతంగా అధిగమించగలరు. కుటుంబం, తోటిపిల్లలు, ఉపాధ్యాయులు, అందరూ పాఠశాల వాతావరణంలో కలిసి వుంటారు. పిల్లల అభివృద్ధికి, సక్రమ సామాజికతను పొందడానికి ఈ వాతావరణం తప్పనిసరి అంశం. పిల్లలను ప్రతిభావంతులుగా మలిచే సామాజిక కారణాలలో తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులే ప్రథములు.

బాల కార్మికులు మార్చు

జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి.

బాలలపై హింస మార్చు

బాలలపై అత్యాచారము పై అధ్యయనం- స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ 2007, ఇండియాలో చేసిన ఒక సర్వేలో బాలలు ముఖ్యంగా పసిపిల్లలు, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారు, ఎక్కువ హింసకు, అత్యాచారానికి గురౌతున్నారని తెలియజేసింది. ఈ అత్యాచారాలు భౌతిక, లైంగిక, మనస్సుకు సంబంధించినవి.

బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతలు మార్చు

బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతలు. ప్రస్తుతం మనదేశంలో చాలా మంది బాలలు హక్కులు కోల్పోయి దీనావస్ధలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చాలా మంది బాలబాలికలు అన్ని జిల్లాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు.

వనరులు మార్చు

  1. బాలల హక్కులు[permanent dead link]
  2. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]